అంతర్జాతీయ పితృ దినోత్సవము (Father's Day) ను ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని (Happy Father's Day 2020) పాటిస్తున్నాయి. తల్లుల గౌరవార్థంగా మాతృ వందన దినోత్సవం (Happy Mother's Day) ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది. ఇకపై పగలు ఎక్కువ, రాత్రులు తక్కువ, హ్యాపీ సమ్మర్ సీజన్ 2020 వచ్చేసింది, జూన్ 21 నుంచి సెప్టెంబర్ 22 వరకు కొనసాగనున్న సమ్మర్ సీజన్
ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి ఫాదర్స్ డే ను (Father’s Day 2020) గుర్తించి జరుపుకున్నారు. ఆ తరువాత అలా అలా ఈ నాన్నల వందన దినోత్సవమునకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్ లో వచ్చే మూడో ఆదివారాన్ని పితృ వందన దినోత్సవముగా ప్రకటించుకొని జరుపుకుంటున్నాయి. పితృ దినోత్సవం పంధర్భంగా అందరి తండ్రులకు లేటెస్ట్‌లీ తెలుగు తరపున శుభాకాంక్షలు తెలుపుతూ మీ కోసం వాట్సప్ స్టిక్టర్స్, కోట్స్ అందిస్తున్నాము. 20వ శతాబ్దపు ప్రఖ్యాత భారతదేశపు కవి, 11 ఏళ్లకే ఘజల్ రాసిన కైఫి అజ్మీ, ప్రేమ కవిత్వం నుంచి అట్టడుగు వర్గాల ప్రతినిధిగా ఆయన కవిత్వం
అమ్మాయిని తండ్రి కంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరు. ప్రతి తండ్రికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు
ఓర్పుకు, సహనానికి మారుపేరు నాన్న. తండ్రులందరికీ పితృ దినోత్సవ శుభాకాంక్షలు
నాన్న ఎప్పుడూ నాకు మొదటి స్నేహితుడు, ఆత్మ బంధువు, గురువు, దైవం అన్నీ నాన్నే.. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు
నాన్న అంటే నమ్మకం, ఆత్మస్థయిర్యాన్ని పెంచే ఆయుధం. పితృ దినోత్సవ శుభాకాంక్షలు
ఓడినప్పుడు ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా నేనున్నా కన్నా అంటూ ధైర్యం చెప్పే ఒకే ఒక వ్యక్తి నాన్న. ఫాదర్స్ డే శుభాకాంక్షలు
నాన్న మాటల్లో ప్రేమ ఉంటుంది. కోపంలో బాధ్యత ఉంటుంది. అణుక్షణం బిడ్డ గురించే అతని ఆలోచనలు. ప్రతి తండ్రికీ పితృ దినోత్సవ శుభాకాంక్షలు
నాన్న నా ఆశ. నా శ్వాన. నాన్నా అందుకో పితృ దినోత్సవ శుభాకాంక్షలు
దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి నాన్న, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి. హ్యాపీ ఫాదర్స్ డే
ఎవరూ తెలియని ఈ లోకంలో యువరాజుగానో, యువరాణి గానో మనల్ని పరిచయం చేసి, మన తప్పుటడుగులను దిద్ది , మనల్ని చదివించి సమాజానికి ఉన్నతంగా పరిచయం చేసే నాన్నే మన సూపర్ హీరో.
తండ్రిని గౌరవించడం, ప్రేమించడం తప్ప ఫాదర్స్ డే సందర్భంగా మన నాన్న కు ప్రత్యేకంగా ఇవ్వాల్సిందేముంది. ప్రపంచానికి చెప్పాల్సిందేముంది. నాన్నను గౌరవించటానికి ఫాదర్స్ డే అవసరం లేదు . నాన్న గొప్పతనం చెప్పటానికి ఇది ఒక సందర్భం మాత్రమే .. నాన్నను ప్రేమించటానికి ఒక్కరోజు మాత్రమే చాలదు, ప్రతిరోజు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనం కృతజ్ఞులమై ఉండాలి. ఐ లవ్ యూా నాన్న..