Bhogi Wishes in Telugu: భోగిపండుగ శుభాకాంక్షలు తెలుగులో చెప్పాలనుకుంటున్నారా, అయితే మీ బంధువులకు, స్నేహితులకు ఈ మెసేజెస్ ద్వారా భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి
భోగి పండగ సాధారణంగా ప్రతీ ఏడాది జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది
Happy Bhogi Wishes in Telugu : తెలుగు వారి ముఖ్యమైన పండగ, ముఖ్యంగా ఆంధ్రులు అతి పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి ఉత్సవంలో (Sankranti Utsavam) మొదటి రోజును భోగి (Bhogi) అంటారు. భోగి పండగ సాధారణంగా ప్రతీ ఏడాది జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడుకి భూమి దక్షిణం వైపుగా దూరంగా జరగడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం చలి మంటలు వేసుకునేవారు.
అలాగే ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది. దక్షిణాయనంలో తాము పడ్డ కష్టాలను మంటల్లో వేస్తూ, రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలు -సకల భోగాలు ఇవ్వాలని అగ్నిదేవుడిని ప్రార్థించడం కోసం వేసే మంటలనే భోగి మంటలు అంటారు. ఆరోజును భోగి పండగగా చేస్తారనేది పురాణాల ప్రకారం ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది.
ఈ భోగి పండుగ మీ ఇంట సంబరాల కాంతిని తీసుకురావాలని, కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ అందరికీ పండుగ శుభాకాంక్షలు
ఈ భోగి మీ జీవితంలో భోగ భాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటూ మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు
నిన్నటి బాధలను భోగిమంటల్లో కాల్చేసి కాంతిని పంచగా వచ్చిన సంక్రాంతిని నీలో దాచేయాలని కోరుకుంటూ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు
పచ్చ తోరణాలతో... పాడి పంటలతో... భోగి సందళ్ళతో... ముంగిట ముగ్గులతో... ఈ సంక్రాంతి మీ జీవితాలలో కాంతిని నింపాలని కోరుకుంటూ...
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
మీరు దూర ప్రాంతాల్లోల ఉన్నవారికి మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా విషెస్ చెప్పొచ్చు. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ప్రతీ సందర్భానికి స్మార్ట్‌ఫోన్ ద్వారా విషెస్ చెప్పే ట్రెండ్ పెరిగిపోయింది. ప్రతీ సందర్భానికి స్టిక్కర్స్, గిఫ్స్, వీడియోస్, ఫోటోస్ లాంటివి చాలా అందుబాటులో ఉన్నాయి.