
తెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడి నెలకొనింది. తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొనే పెద్ద పండుగ వచ్చేసింది. గురువారం భోగితో మొదలయ్యే ఈ పండుగ మూడు రోజులు పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. భోగి అనేది సంస్కృత పదం. దీన్నే భోగం అని కూడా అంటారు. భోగమంటే సుఖసంపదలు. ఇది కాలక్రమేనా భోగిగా మారింది. సూర్యుడు దక్షిణాయన సమయంలో భూమికి దూరంగా జరగడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
దీనివల్ల చలి తీవ్రత పెరుగుతుంది. అందుకే.. అంతా ఆ రోజు చలిమంటలు వేస్తుంటారు. పాత వస్తువులను అగ్ని దేవుడికి ఆహుతి ఇచ్చి.. ఉత్తరాయణంలో అంతా మంచి జరగాలని కోరుకుంటారు. మనలో చెడును తగలబెట్టి మంచిని పెంచుకోవడమే ఈ భోగి మంటలు వెనుక ఉన్న ఆంతర్యం. సంక్రాంతికి స్వాగతం పలుకుతూ.. బంధుమిత్రులకు భోగి శుభాకాంక్షలు చెప్పేద్దామా.
మీరు దూర ప్రాంతాల్లోల ఉన్నవారికి మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా విషెస్ చెప్పొచ్చు. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ప్రతీ సందర్భానికి స్మార్ట్‌ఫోన్ ద్వారా విషెస్ చెప్పే ట్రెండ్ పెరిగిపోయింది. ప్రతీ సందర్భానికి స్టిక్కర్స్, గిఫ్స్, వీడియోస్, ఫోటోస్ లాంటివి చాలా అందుబాటులో ఉన్నాయి. మరి మీరు కూడా వాట్సప్ స్టిక్కర్స్ ద్వారా భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా

ఇంటికొచ్చే పాడిపంటలు,
కమ్మనైన పిండివంటలు, చలికాచే భోగి మంటలు,
సంతోషంగా కొత్త జంటలు,
ఏటేటా సంక్రాంతి ఇంటింటా కొత్త కాంతి
అందరికీ భోగి శుభాకాంక్షలు

గతానికి వీడ్కోలు పలుకుతూ
రేపటి జీవిత సంక్రాంతికి స్వాగతం పలికే
భోగి పండుగ సందర్భంగా
అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు

మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు

ఈ భోగి పండుగ మీ ఇంట
సంబరాల కాంతిని తీసుకురావాలని,
కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ
అందరికీ పండుగ శుభాకాంక్షలు

ఈ భోగి మీ జీవితంలో
భోగ భాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటూ
మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు

నిన్నటి బాధలను భోగిమంటల్లో కాల్చేసి
కాంతిని పంచగా వచ్చిన సంక్రాంతిని
నీలో దాచేయాలని కోరుకుంటూ
అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు

మీ సమస్యలన్ని భోగి మంటల్లో కాలి మసి అవ్వాలని,
సంక్రాంతికి సిరి సంపదలు మీ ఇంట చేరాలని,
కమ్మగా పిండివంటలతో కనుమ నిండాలని..
మీకు మీ కుటుంబానికి ..భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు!

పచ్చ తోరణాలతో...
పాడి పంటలతో...
భోగి సందళ్ళతో...
ముంగిట ముగ్గులతో...
ఈ సంక్రాంతి మీ జీవితాలలో
కాంతిని నింపాలని కోరుకుంటూ...
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
భోగి సంక్రాంతి కనుమ పండుగల సందర్భంగా
ప్రజలందరూ ఆనందోత్సాహాలతో సుఖశాంతులతో ఉండాలని
అందరికీ లేటెస్ట్‌లీ తరపున భోగి పండుగ శుభాకాంక్షలు