Happy Bhogi 2021 Wishes (Photo Credits: File Image)

తెలుగు వారు జరుపుకునే అతి పెద్ద పండుగలలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు చాలా ముఖ్యమైనవి. వరుసగా మూడు రొజుల పాటు ఈ పండుగలను జరుపుకుంటారు. ఈ పండుగ వస్తుందంటే చాలు.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సంబరాలు ఆకాశాన్ని తాకుతాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఉదయాన్నే భోగి మంటలు వేసి... శీతాకాలానికి గుడ్ బై చెబుతారు. ఇంటింటా ముగ్గులతో తెలుగు ఇళ్లు కళకళలాడుతుంటాయి.

కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టాలతో తెలుగు లోగిళ్లలో సందడి వాతావరణం కనిపిస్తోంది. ప్రజలంతా సంతోషంగా భోగి (Happy Bhogi 2023), సంక్రాంతి పండుగలు జరుపుకోవాలని రాజకీయ నేతలు, ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు కోరుతూ... తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ శుభాకాంక్షలు పంపుతున్నారు.

ఇళ్లలో వేస్ట్‌గా పడివున్న చెక్కముక్కలు, ఇతరత్రా వాడుకలో లేని వస్తువుల్ని చలి మంటల్లో వేసి తగలబెడతారు. తద్వారా ఇళ్లలో చెత్తకు చెక్ పెట్టి... సరికొత్త సంక్రాంతికి స్వాగతం పలుకుతారు. ఈ పండుగనాడు ఆంధ్రులు కొత్తబట్టలు ధరించడం ఒక సంప్రదాయంగా ఉంది. తెల్లవారుజామున భోగిమంటల వద్ద చలికాచుకున్న చిన్నా పెద్దలు భోగిమంటల (Bhogi Pongal Festival) సెగతో కాచుకున్న వేడినీటితో లేదా మామూలు నీటితో తలస్నానం చేసి కొత్తబట్టలు ధరిస్తారు. అలాగే పిల్లలకు భోగి పళ్లు పోసి... ఆశీర్వదిస్తారు.

నాగుల చవితికి పుట్టలో పాలు ఎందుకు పోస్తారు? నాగుల చవితి విశిష్టత ఏంటి? నాగుల పంచమిపై ప్రత్యేక కథనం, విషెస్, కోట్స్ మీకోసం

సాధారణంగా అందరు చెప్పేది… ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు… ఆరోగ్యం కోసం కూడా. ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది ఆ గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. సూక్ష్మక్రిములు నశిస్తాయి.

భోగి మంటల్లో పనికిరాని వస్తువులను కాల్చండి అని వింటుంటాం.

పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు. ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు… మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి.

ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలం లో అనేక వ్యాదులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పిడిస్తాయి.

దీపావళి పండుగ విశిష్టతను ఓ సారి తెలుసుకుందాం

వాటికి ఔషదంగా ఇది పని చేస్తుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి, మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని వేస్తారు. అగ్ని హోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశి ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు (oxygen) ను విడుదల చేస్తుంది.

ఈ ఔషద మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరం లోని 72,000 నడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషదం ఇవ్వవచ్చు, అదే అందరికి వస్తే అందరికి ఔషదం సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చెయించుకొలేని పేదలు కూడా ఉండవచ్చు.

ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరు కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల మద్యన దూరాలను తగ్గిస్తుంది, ఐక్యమత్యాని పెంచుతుంది. ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధనా, మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా.

భర్తల కోసం మహిళలు చేసుకునే పండుగ, అట్ల తద్ది ఆరట్లు..ముద్దపప్పు మూడట్లు అంటూ పాటలతో వాయినాలు, పండుగ గురించి లేటెస్ట్ లీ ప్రత్యేక కథనం

భోగి (Happy Bhogi) రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరు. రేగి చెట్లు, రాగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతి రూపం . ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తల పై పోయడం వలన శ్రీ లక్ష్మి నారాయణుల అనుగ్రహం మన పిల్లల ఫై ఉంటుంది అని, పిల్లలకి ఉన్న దిష్టి తొలగి పోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం.

పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కాని భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత, ముగ్గువేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం, సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు, భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గువేయడం కొంచెం కష్టంతో కూడుకొన్నప్పటికి ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు, రోజు వేసే ముగ్గుల కన్నా ఈ రోజు మరింత అందంగా రంగు రంగుల రంగవల్లికలేస్తారు.

కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేస్తారు, ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగుభూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు, ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు. భోగి రోజున పిల్లలు చాలా ఆనందంగా గాలిపటాలు ఎగురవేస్తారు, వివిధ రకాల గాలిపటాలు తయారు చేసి లేదా కొనుక్కొని ఎగరవేయడంలో పోటీపడతారు.

నవరాత్రి ప్రత్యేకత ఏంటి? వివిధ రాష్ట్రాల్లో శరన్నవరాత్రిను ఎలా జరుపుకుంటారు, తెలుగు రాష్ట్రాల్లో విజయదశమి వేడుకలు ఎలా ఉంటాయి? దసరాపై స్పెషల్ కథనం మీకోసం

గోదావరి జిల్లాల్లో ప్రాంతాల్లో భోగి రోజున కోడి పందాలు వేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది, పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్లు పోటీలో ప్రాణాలను పణ్ణంగా పెట్టి పోరాడుతాయి, ఈ పోటీలను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. పోటీలో పాల్గొనే కోళ్లపై పందాలు కాస్తారు. తాహత్తుకు మించి మితిమీరిన పందాలు కాయడం వలన కలిగే అనర్ధాల వలన పందాలు కాయడంపై నిషేధాంక్షలు ఉన్నాయి.

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిని నిర్వహిస్తారు. ఈ పండుగ తొలి రోజు వచ్చేదే ‘భోగి’. దక్షిణాయన సమయంలో సూర్యుడు దక్షిణ అర్ధగోళానికి, భూమికి దూరంగా జరుగుతుంది. దీంతో భూమిపై ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరుగుతుంది. ఈ చలిని తట్టుకునేందుకు అప్పట్లో అంతా చలిమంటలు వేసుకునేవారు. అదే సమయంలో తాము పడిన కష్టాలు, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలను భోగి మంటలు అంటారు. భోగి మంటలు వెనుక పురాణం కథనం, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.

కాగా భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం ఈ రోజునే శ్రీ రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని.. దీని సంకేతంగానే భోగి పండగ ఆచరణలోకి వచ్చిందని చెబుతారు. శ్రీ మహా విష్ణువు వామన అవతారం లో బలి చక్రవర్తిని పాతాళం లోకి తొక్కిన పురాణ గాద మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశిర్వదించమని వరమివ్వడం జరిగిందట. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది.

వినాయక చవితి..ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు, ప్రత్యేకతలేంటీ? శివుడు వినాయకునికి చెప్పిన మంత్రం ఏమిటి? వినాయక మహత్యం గురించి ఆసక్తిర కథనం మీకోసం

కృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రొజు ఇదేనంటారు. శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రొజు ఇదే అనేవి కూడా పురాణాల గాద.

కొన్ని రాష్ట్రాల్లో పెద్ద పండుగ (Pedda Panduga) అని కూడా పిలుస్తారు, ఈ పంటకాల పండుగను తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విస్తృతంగా జరుపుకుంటారు. వర్షాలు మరియు మేఘాల దేవుడైన ఇంద్రుని గౌరవార్థం భోగిని జరుపుకుంటారు మరియు ప్రజలు సమృద్ధిగా పంట మరియు శ్రేయస్సు కోసం అతని ఆశీర్వాదం కోరుకుంటారు.