దీపావళి అమవాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి పండుగ (Nagula Chavithi 2020) జరుపుకుంటారు. అలాగే కొంతమంది శ్రావణ శుద్ధ చతుర్థినాడు కూడా జరుపుకుంటారు.ఈ ఏడాది నవంబరు 18 బుధవారం నాడు నాగుల చవితి (nagula chavithi date and time) వచ్చింది. ఈ పండుగ నాడు సర్పాలకు అధిపతి అయిన నాగరాజును పూజిస్తారు. సాధారణంగా ఈ పండుగ వివాహిత మహిళలు తమ పిల్లల క్షేమం కోసం చేస్తారు. దేశంలో ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకుంటారు.
మన తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగకు (Nagula Chavithi) విశేష ఆదరణ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో (Nagula Chavithi history in Telugu) తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి మొదలవుతుంది. పాములు భూమి అంతర్భాగంలో జీవించి భూసారాన్ని కాపాడుతూ.. సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలుస్తారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాలను తింటూ పరోక్షంగా రైతుకు పంటనష్టం కాకుండా చేస్తాయని నమ్ముతారు.అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు (nagula chavithi importance) ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.హైదరాబాద్‌లోని వనస్థలిపురం నాగ దేవత మనవ శరీరం రూపంలో పుట్ట ఉంటుంది. ఈ పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు.
మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.
నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేస్తారు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్టవద్ద " దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. మన భారతీయుల చాలా ఇళ్ళల్లో ఇలవేల్పు " సుబ్రహ్మణేశ్వరుడే ఆరాధ్య దైవంగా పూజిస్తారు కాబట్టి వారి పేరును చాల మంది నాగరాజు, ఫణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు వగైరా పేర్లు పెట్తుకుంటూ ఉంటారు.
పాములకు చేసే ఏదైనా పూజ, నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం, కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
కోట్స్, విషెస్
మీకు మీ కుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు
పార్వతి పరమేశ్వరులు, సూర్యభగవానులు, నాగేంద్రుని ఆశీస్సులతో మీకు మీ కుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు నాగుల పంచమి శుభాకాంక్షలు
పరమశివుని ఆశీస్సులతో పాటు ఆ నాగేంద్రుని ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు