Happy Bhogi (File Image)

భోగి పండుగ ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది.

ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది. దీనిపై పురాణాల్లో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.

భోగి పండుగ చరిత్ర ఏమిటీ? ఆ పేరు ఎలా వచ్చింది, భోగి పండుగ రోజున ఏం చేస్తే మంచి జరుగుతుంది, భోగిమంటల్లో ఏం వేస్తారు, పిల్లలపై రేగి పళ్లు ఎందుకు పోస్తారు.. భోగి పండుగ గురించి పూర్తి కథనం ఓ సారి తెలుసుకుందాం

పురాణాల ప్రకారం ఈ రోజునే శ్రీ రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని.. దీని సంకేతంగానే భోగి పండగ ఆచరణలోకి వచ్చిందని చెబుతారు. కృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రొజు ఇదేనంటారు. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన ఆయనను అక్కడ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమిచ్చాడనేది మరో కథనం.

భోగి పండుగ చరిత్ర ఏమిటీ? ఆ పేరు ఎలా వచ్చింది, భోగి పండుగ రోజున ఏం చేస్తే మంచి జరుగుతుంది, భోగిమంటల్లో ఏం వేస్తారు, పిల్లలపై రేగి పళ్లు ఎందుకు పోస్తారు.. భోగి పండుగ గురించి పూర్తి కథనం ఓ సారి తెలుసుకుందాం

బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. మరి, ఈ సంక్రాంతి ముందు రోజున వచ్చే ఈ బోగి పండుగ రోజున బంధుమిత్రులకు ఈ కింది కోటేషన్లతో శుభాకాంక్షలు చెప్పేయండి

1. ఇంటికొచ్చే పాడిపంటలు,

కమ్మనైన పిండివంటలు, చలికాచే భోగి మంటలు,

సంతోషంగా కొత్త జంటలు, ఏటేటా సంక్రాంతి ఇంటింటా కొత్త కాంతి

అందరికీ భోగి శుభాకాంక్షలు

2. గతానికి వీడ్కోలు పలుకుతూ

రేపటి జీవిత సంక్రాంతికి స్వాగతం పలికే

భోగి పండుగ సందర్భంగా

అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు

3. మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు

4. ఈ భోగి పండుగ మీ ఇంట సంబరాల కాంతిని తీసుకురావాలని,

కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ

అందరికీ పండుగ శుభాకాంక్షలు

5. ఈ భోగి మీ జీవితంలో

భోగ భాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటూ

మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు

6. కష్టాలను దహించే భోగిమంటలు,

భోగాలను అందించే భోగి పళ్లు,

అల్లుళ్లకి స్వాగతం పలికే తోరణాలు,

ధాన్యపు రాసులతో నిండిన ఇళ్లు..

అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు

7. నిన్నటి బాధలను భోగిమంటల్లో కాల్చేసి

కాంతిని పంచగా వచ్చిన సంక్రాంతిని

నీలో దాచేయాలని కోరుకుంటూ

అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు

8. మీ సమస్యలన్ని భోగి మంటల్లో కాలి మసి అవ్వాలని,

సంక్రాంతికి సిరి సంపదులు మీ ఇంట చేరాలని,

కమ్మగా పిండివంటలతో కనుమ నిండాలని..

మీకు మీ కుటుంబానికి ..భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు!

8. శార్వరి నామ భోగి సంక్రాంతి,కనుమ పర్వదినముల ఉత్తరాయణ పుణ్యకాల శుభాకాంక్షలు

9. పచ్చ తోరణాలతో...

పాడి పంటలతో...

భోగి సందళ్ళతో...

ముంగిట ముగ్గులతో...

ఈ సంక్రాంతి మీ జీవితాలలో కాంతిని నింపాలని

కోరుకుంటూ...

మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

10. భోగి సంక్రాంతి కనుమ పండుగల సందర్భంగా

ప్రజలందరూ ఆనందోత్సాహాలతో సుఖశాంతులతో ఉండాలని

అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు

11. ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చే మకర సంక్రమణం

జనులందరికీ వెలుగునిచ్చే నిలువెచ్చని రవికిరణం..

భోగ భాగ్యాలనిచ్చే భోగి, సరదాలని పంచే సంక్రాంతి, కమ్మని కనుమ,

కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ..సంక్రాతి శుభాకాంక్షలు

12. భోగ భాగ్యాలనిచ్చే భోగి..

సరదాలను తీసుకొచ్చే సంక్రాంతి..

కమ్మనైన కనుమ..

కొత్త సంవత్సరంలో మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ..

అందరికీ భోగి శుభాకాంక్షలు.

14. భోగి భోగభాగ్యాలతో..

సంక్రాంతి సిరిసంపదలతో..

కనుమ కనువిందుగా..

జరుపుకోవాలని కోరుకుంటూ..

సంక్రాంతి శుభాకాంక్షలు

17. మీలోని చెడును, దురలవాట్లను,

చెడు సావాసాలను భోగి మంటల్లో వేసేయండి.

జీవితంలో కొత్త వెలుగును ఆహ్వానించండి.

భోగి పండుగ శుభాకాంక్షలు!

18. మీ జీవితంలోని చీడ - పీడ ఆ భోగి మంటల్లో కలిసి,

కొత్త వెలుగులు ప్రసరించాలని..

భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు మీ దరి చేరాలని కోరుకుంటూ..

భోగి పండగ శుభాకాంక్షలు!

19. భాగ్యాలనిచ్చే భోగి, సరదాలనిచ్చే సంక్రాంతి..

కమ్మదనం పంచే కనుమ..

ఈ సంబరం నింపాలి మీ ఇంట్లో సిరుల పంట..

మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు!

20. నూతన ప్రారంభానికి ఒక శుభ దినం..

అదృష్టాన్ని, భోగ భాగ్యాలను ప్రసాదించే పర్వదినం..

మీ కుటుంబం సుఖసంతోషాలతో..

సిరిసంపదలతో సుసంపన్నంగా విరజిల్లాలని ఆకాంక్షిస్తూ..

భోగి శుభాకాంక్షలు!