Happy Bhogi 2023 Telugu Wishes: : తెలుగు వారి ముఖ్యమైన పండగ, ముఖ్యంగా ఆంధ్రులు అతి పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి ఉత్సవంలో (Sankranti Utsavam) మొదటి రోజును భోగి (Bhogi) అంటారు. భోగి పండగ సాధారణంగా ప్రతీ ఏడాది జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడుకి భూమి దక్షిణం వైపుగా దూరంగా జరగడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం చలి మంటలు వేసుకునేవారు,
అలాగే ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది. దక్షిణాయనంలో తాము పడ్డ కష్టాలను మంటల్లో వేస్తూ, రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలు -సకల భోగాలు ఇవ్వాలని అగ్నిదేవుడిని ప్రార్థించడం కోసం వేసే మంటలనే భోగి మంటలు అంటారు. ఆరోజును భోగి పండగగా చేస్తారనేది పురాణాల ప్రకారం ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది.
నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. మనకు లభించిన దానితో తృప్తిపడకుండా ఇంకొకటి కావాలని ఆశిస్తే అది భోగం అనిపిచుకోదు. లభించిన దానితో పరిపూర్ణమైన ఆనంద పొందగలిగితే అదే నిజమైన భోగం. భోగి పండగ ద్వారా చాటబడే నీతి అదే. మనకు లేనిది, మనది కానిది, నిన్నటి ఛేదును, మనలోని దురాశలను భోగి మంటల్లో వేసి, రాబోయే కాలానికి అంతా మంచే జరగాలి, కష్టాలు మంటల్లో కలిసి సుఖసంతోషాలను ఆహ్వానించడమే భోగి పండగ ముఖ్యోద్దేశం. భోగి సందర్భంగా, ప్రజలు పాత వస్తువులను త్యజించి క్రొత్త ప్రారంభానికి నాంది పలుకుతారు. నూతన ఆరంభాలకు ఈరోజు శుభదినంగా చెప్తారు. ప్రజలు తమ ఇంటిని అందంగా అలంకరిస్తారు, కొత్త వస్తువులను ఇంటికి తీసుకువస్తారు ఉదయాన్నే పవిత్ర స్నానం చేసి భోగి వేడుకల్లో పాల్గొంటారు. ఈరోజు కొత్త బట్టలు మరియు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రతి కుంటుంబంలోని సభ్యులంతా కలిసి ఆనందంతో, ఘనంగా సంక్రాంతి పండగ వేడుకలను భోగి పండగతో మొదలు పెడతారు.
ఈ భోగి పండగను పురస్కరించుకొని మీ స్నేహితులు, కుటుంబం, బంధువులు, సహోద్యోగులు మరియు తోటి వారికి ఈ భోగి పండగ గొప్ప ఆరంభాన్ని ఇవ్వాలని, సంక్రాంతి పండగ ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేసే విధంగా, మీ ద్వారా పండగ సంతోషం వ్యాప్తి కావాలనే ఉద్దేశ్యంతో భోగి పండగ శుభాకాంక్షలు, సందేశాలు, ఫేస్బుక్ మరియు వాట్సాప్ స్టేటస్ ల కోసం కొన్ని కొన్ని ఆణిముత్యాలను ఇక్కడ అందిస్తున్నాం. భోగి పండుగకు ఇంగ్లీష్‌లో గ్రీటింగ్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
WhatsApp Message Reads: గతాన్ని తొలగించండి, ముందున్న భవిష్యత్తును వెలిగించండి. ఈ నూతన సంవత్సరాన్ని మరింత గొప్పగా ఆరంభించండి. ఆ భోగి మంటల వెలుగులతో సరికొత్త ఉషోదయానికి స్వాగతం పలకండి. భోగి పండుగ శుభాకాంక్షలు.
WhatsApp Message Reads: మీలోని చెడును, దురలవాట్లను, చెడు సావాసాలను భోగి మంటల్లో వేసేయండి. జీవితంలో కొత్త వెలుగును ఆహ్వానించండి. భోగి పండుగ శుభాకాంక్షలు!
WhatsApp Message Reads: మీ జీవితంలోని చీడ- పీడ ఆ భోగి మంటల్లో కలిసి, కొత్త వెలుగులు ప్రసరించాలని.. భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు మీ దరి చేరాలని కోరుకుంటూ.. భోగి పండగ శుభాకాంక్షలు!
భాగ్యాలనిచ్చే భోగి, సరదాలనిచ్చే సంక్రాంతి, కమ్మదనం పంచే కనుమ. ఈ ఉత్సవం నింపాలి మీ ఇంట్లో సిరుల పంట. మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు!
నూతన ప్రారంభానికి ఒక శుభ దినం, అదృష్టాన్ని, భోగ భాగ్యాలను ప్రసాదించే పర్వదినం. మీ కుటుంబం సుఖసంతోషాలతో, సిరిసంపదలతో సుసంపన్నంగా విరజిల్లాలని ఆకాంక్షిస్తూ.. భోగి శుభాకాంక్షలు!
మీ సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభం కావాలని, స్నేహితులతో, బంధువులతో, చుట్టుపక్కల వారితో, ఊర్లో వారితో మీ సంబరాలు అంబరాన్ని తాకాలని, ఈ వేడుకలు ఎన్నో సరదాలు, సంతోషాలు మీ గడపకు తీసుకు రావాలని కోరుకుంటూ 'లేటెస్ట్‌లీ తెలుగు' తరఫున తెలుగు వారందరికీ భోగి పండగ శుభాకాంక్షలు