Children’s Day Wishes in Telugu: బాలల దినోత్సవం శుభాకాంక్షలు, చాచాజీ పుట్టిన రోజు సందర్భంగా అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే విషెస్ చెప్పేయండి ఇలా..
మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా... ఇది నిర్వహించుకుంటున్నాం. ఈసారి ఆయన 134వ జయంతి జరుగుతోంది. నెహ్రూకి రోజాపూలు, పిల్లలు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన రోజా పువ్వును తన కోటుకు పెట్టుకుంటారు.
Children’s Day Messages in Telugu: ప్రతి సంవత్సరం నవంబర్ 14న మనం పిల్లల దినోత్సవం జరుపుకుంటున్నాం. మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా... ఇది నిర్వహించుకుంటున్నాం. ఈసారి ఆయన 134వ జయంతి జరుగుతోంది. నెహ్రూకి రోజాపూలు, పిల్లలు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన రోజా పువ్వును తన కోటుకు పెట్టుకుంటారు. అలాగే తరచూ పిల్లల్ని కలిసి... బాగా చదువుకోవాలని విషెస్ చెప్పేవారు. అలా... ఆయన జయంతి... చిల్డ్రన్స్ డేగా మారిపోయింది. 1964 మే 27న నెహ్రూ మరణించడంతో... ఆయన పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరపాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అప్పటి నుంచి ఏటా ఈ స్పెషల్ డే జరుపుకుంటున్నాం.
మొదట్లో పిల్లల దినోత్సవాన్ని నవంబర్ 20న జరిపేవారు. ఎందుకంటే ఐక్యరాజ్యసమితి నవంబర్ 20ని అంతర్జాతీయ పిల్లల దినోత్సవం (Universal Children’s Day)గా ప్రకటించింది. అందువల్ల ఇండియా కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. ఐతే... నెహ్రూ మరణం తర్వాత... పార్లమెంట్‌లో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి... భారతీయులు నవంబర్ 14ను జాతీయ బాలల దినోత్సవం (National Children’s Day)గా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అందరికీ విషెస్ చెప్పేయండి