Happy Eid al-Adha 2021: ఈదుల్ అజ్ హా.. త్యాగానికి ప్రతీకగా ముస్లీంలు జరుపుకునే గొప్ప పండుగ, ఈ పండుగ చరిత్రను, ప్రపంచానికి అల్లాహ్ ఇచ్చిన సందేశాన్ని ఓ సారి తెలుసుకుందాం
ఈ పండుగను ఈదుల్ అజ్ హా లేదా ఈదుజ్జుహా లేదా బఖర్ ఈద్ (Eid al-Adha 2021) లేదా బక్రీదు అని వివిధ దేశాలలో వివిధ పేర్లతో పిలుస్తుంటారు. అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇబ్రాహీం ప్రవక్త తనకుమారుడైన ఇస్మాయీల్ను బలి ఇవ్వడాని తీసుకెళ్ళే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని ముస్లింలు ఈ పండుగను జరుపు కొంటారు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం మతస్తులు రంజాన్ లాగానే బక్రీద్ పండగను (Happy Eid al-Adha 2021) కూడా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను ఈదుల్ అజ్ హా లేదా ఈదుజ్జుహా లేదా బఖర్ ఈద్ (Eid al-Adha 2021) లేదా బక్రీదు అని వివిధ దేశాలలో వివిధ పేర్లతో పిలుస్తుంటారు. అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇబ్రాహీం ప్రవక్త తనకుమారుడైన ఇస్మాయీల్ను బలి ఇవ్వడాని తీసుకెళ్ళే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని ముస్లింలు ఈ పండుగను జరుపు కొంటారు. ఈ పండుగకు ప్రామాణికం ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్. ఈదుల్ ఫిత్ర్ (రంజాన్) లో లాగ, బక్రీదు పండుగనాడు కూడా ప్రార్థనలు ఖుత్బా (ధార్మిక ప్రసంగం) తో ప్రారంభమౌతుంది. ఈ పండుగకు త్యాగాల పండుగ అనే అర్థం వస్తుంది.
ఇస్లామీయ కేలండర్ ప్రకారం 12వ నెల యైన జుల్ హజ్జా 10వ తేదీన ఈ పండుగ జరుపుకొంటారు. ఈ పండుగ 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ నెలలోనే హజ్ తీర్థయాత్రగూడా చేస్తారు. ఈ యాత్రకొరకు సౌదీ అరేబియా లోని మక్కా నగరానికి వెళ్ళి మస్జిద్-అల్-హరామ్ లోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు. ఈ పండుగ రంజాన్ పండుగ జరిగిన 70 రోజుల తరువాత జరుపుకుంటారు.
ఈ పండగ తేదీని కూడా చంద్ర దర్శనం ద్వారానే ఇస్లాం మత పెద్దలు నిర్ణయిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో చివరి నెల 'ధూ అల్-హిజా'. ఈ నెలలోనే పవిత్ర 'హజ్' యాత్ర ప్రారంభమవుతుంది. ఇదే నెలలో మక్కా సందర్శనకు వెళ్తారు. ఈ నెలలోని చివరి పదవ రోజును బక్రీద్ పండగగా జరుపుకుంటారు. ఈ పదిరోజులు అత్యంత పవిత్రమైనవిగా ముస్లింలు భావిస్తారు. అల్లాకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఇబ్రహీం ప్రవక్త చేసిన అతిగొప్ప త్యాగాన్ని ఈ పండగ సందర్భంగా స్మరించుకుంటారు. బక్రీద్ పండగ రోజున జంతువులను బలివ్వడం అనవాయితి. దీని ఉద్దేశ్యం రక్తపాతం చేయడమని కాదు, దేవునికి ఒక రూపంలో చెల్లించే అతి గొప్ప త్యాగం. అలా త్యాగం చేసిన జంతువు మాంసాన్ని అందరికీ పంచడం కూడా తప్పనిసరి.
పండుగ దేనికి ప్రతీకగా జరుపుకుంటారు
అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకొనే పండగ బక్రీద్. ఇస్లాం క్యాలెండర్‌లోని బక్రీద్ మాసంలో 11వ రోజున ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీ. సమాజంలో పేరుకుపోతున్న రుగ్మతల నుంచి జనవాళిని జాగృతపరుస్తూ సన్మార్గంలో నడిపించేందుకు అల్లాహ్ భూమండలానికి 80వేల మంది ప్రవక్తల్ని పంపినట్లు ముస్లింల ఆరాధ్యగ్రంథం దివ్యఖురాన్ చెబుతోంది. వారిలో ఒకరు ప్రవక్త హజరత్ ఇబ్రహీం. అల్లాహ్‌పై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం గడపాలని మానవాళికి బోధిస్తున్న ప్రవక్తల్లోని విశ్వాసాన్ని కూడా గ్రహించేందుకు అల్లాహ్ అనేక పరీక్షలతో పరీక్షించేవారు. ఈ క్రమంలో ప్రవక్త ఇబ్రహీం అనేక పరీక్షల్లో తన విశ్వాసాన్ని నిరూపించినట్లు పవిత్ర ఖురాన్ పేర్కొంది.
ఈ క్రమంలోనే హజరత్ ఇబ్రహీం, ఆయన సతీమణి హజీరాలకు వారి వృద్ధాప్యంలో అల్లాహ్ వారికి సంతానప్రాప్తి కలిగించారు. లేక లేక జన్మించిన తమ కుమారుడు ఇస్మాయిల్‌ను వృద్ధ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తరుణంలో ఒక రోజు రాత్రి ఇబ్రహీం తమ కుమారుడు ఇస్మాయిల్‌ను అల్లాహ్‌పేర బలిదానం చేస్తున్నట్లు కలగంటారు. దీంతో అల్లాహ్ తన కుమారుడిని బలిదానం కోరుకుంటున్నారని గ్రహించిన ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్‌ను బలిదానం (ఖుర్బానీ) ఇచ్చేందుకు సిద్ధపడ్తారు. తండ్రి అంతరంగాన్ని గమనించిన కుమారుడు ఇస్మాయిల్ కూడా అల్లాహ్ మార్గంలో బలయ్యేందుకు సిద్ధపడ్తారు.
బలి ఇచ్చే సమయంలో పుత్రవాత్సల్యం అడ్డువస్తే. తనకు బలి ఇవ్వకుండా తన తండ్రి వెనకడుగు వేస్తే, అల్లాహ్‌తో విశ్వాసఘాతకుడిగా నిలవకుండా, కళ్లకు గంతలతో తనను బలిఇవ్వమంటూ తండ్రికి సూచిస్తారు. ఆ మేరకు అల్లాహ్ నామస్మరణతో తన కుమారుడిని బలి ఇచ్చేందుకు గొంతుపై కత్తిపెట్టిన క్షణంలో త్యాగ నిరతికి మెచ్చిన అల్లాహ్ ఆఖరు క్షణంలో అల్లాహ్ ఇస్మాయిల్‌ను తప్పించి అదే స్థానంలో ఒక దుంబా (పొట్టేలు) ను ప్రత్యక్ష పరుస్తారు. దీందో పొట్టేలు గొంతు తెగి అల్లాహ్‌మార్గంలో అది ఖుర్బాన్ అవుతుంది.ఇబ్రాం త్యాగనిరతిని మెచ్చిన అల్లాహ్ ఆరోజు నుంచి ఈదుల్ అజ్ హా (బక్రీద్) పండగను జంతు బలి ఇవ్వాలనీ, ఈ విధానాన్ని భూమి ఉన్నంత వరకు కొనసాగించాలనీ, నిర్దేశించినట్లు ఇస్లాం చెబుతోంది.
ఆనాడు గొప్ప త్యాగం చేసిన జీవిగా అప్పట్నించి మగ మేకను బలి ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఆ మేక పేరునే బకరా -ఈద్ (బక్రీద్) పండగను జరుగుపుకుంటారు. బక్రీద్ పండగ రోజున ఆత్మత్యాగం చేసిన ఆ మేక మాంసాన్ని తమ ఇంట్లో వారితో పాటు, బంధువులకు, పేదవాళ్లకు పంచి పెడతారు. అల్లా కోసం తనకెంతో ఇష్టమైన తన ఏకైక కొడుకును సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడిన ఇబ్రంహీం ప్రవక్తను ఈ పండగ సందర్భంగా స్మరించుకుంటారు.
ఈదుల్ అజ్ హా కు ఇతర పేర్లు
'ఈద్ అల్-కబీర్' : (మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, ఈజిప్టు, , లిబియా దేశాలలో)
'ఫస్కా తమొఖ్ఖార్త్' : (పశ్చిమ ఆఫ్రికా దేశాలలో)
'బబ్బర్ సల్లాహ్' : (నైజీరియా లో)
'సిద్వైనీ' : (సోమాలియా, కెన్యా , ఇథియోపియా లో)
'బడీ ఈద్' లేదా బక్రీద్ : (భారతదేశం, పాకిస్తాన్ లో)
'వలీయా పెరున్నల్' : (కేరళ లో)
'ఖుర్బానీ ఈద్' : (బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా లో)
'పెరునాల్' : (తమిళనాడు లో)
'కుర్బాన్ బైరామి' : (టర్కీ, అజర్‌బైజాన్ లో)
'కుర్బాన్ బజ్రామ్' : (బోస్నియా , హెర్జెగొవీనా, అల్బేనియా, కొసావో , బల్గేరియా లో)
'కుర్బాన్ బైరమే' : (తాతారిస్తాన్ లో)
'కుర్బాన్ బైరామ్' : (రష్యా లో)
'కుర్బాన్ ఆయిత్' : (కజకస్తాన్ లో)
'ఈద్ ఎ ఖోర్బాన్' : (ఇరాన్ , ఆఫ్ఘనిస్తాన్ లో)
'లోయే అక్తర్' లేదా 'కుర్బానియే అక్తర్' : (పుష్తో భాషీయులు)
'కుర్బాన్ ఈత్' : (చైనా , ఉయ్ ఘుర్ భాషలో)
* 'ఈదుల్ అద్ హా' : (మలేషియా, సింగపూర్, ఇండోనేషియా , బ్రూనై లో)