Happy Ugadi 2021 Wishes & Greetings: ఉగాది శుభాకాంక్షలు తెలిపే విషెస్, కొటేషన్లు మీకోసం, కరోనా పీడ తొలగిపోవాలని కోరుకుంటూ అందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను ఈ మెసేజ్‌లతో చెప్పేద్దామా..

షడ్రుచుల మిశ్రమమే ఉగాది (Happy Ugadi). వసంతుడు చెరకుగడతో తియ్యటి బాణాలు సంధిస్తాడు... వేప పూత చేదుతో క్రిమికీటకాలునశిస్తాయి.. పుల్లటి రుచితో శరీర తాపబాధ తగ్గుతుంది.. వగరు రుచి సన్నని పొగరు కలిగిస్తుంది.. అందరిలోనూ కలిసిపోతూ రుచిని పెంచుతుంది ఉప్పు కోయిలమ్మ తియ్యటి కంఠస్వరంతో ప్రకృతి పరవశిస్తుంది.. ఇదే ఉగాది పండుగ..

Happy Ugadi 2021 HD Wallpaper (Photo Credits: File Image)

ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ (Telugu New Year) గుర్తింపు తెచ్చుకుంది.పులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఉప్పు... షడ్రుచుల మిశ్రమమే ఉగాది (Happy Ugadi). వసంతుడు చెరకుగడతో తియ్యటి బాణాలు సంధిస్తాడు... వేప పూత చేదుతో క్రిమికీటకాలునశిస్తాయి.. పుల్లటి రుచితో శరీర తాపబాధ తగ్గుతుంది.. వగరు రుచి సన్నని పొగరు కలిగిస్తుంది.. అందరిలోనూ కలిసిపోతూ రుచిని పెంచుతుంది ఉప్పు కోయిలమ్మ తియ్యటి కంఠస్వరంతో ప్రకృతి పరవశిస్తుంది.. ఇదే ఉగాది పండుగ..

'ఉగాది', 'యుగాది' అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. 'ఉగ' అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా 'ద్వయం; లేదా 'జంట' అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. మరి ఉగాది రోజున ఈ కోట్స్ తో అందరికీ శుభాకాంక్షలు చెప్పేయండి.

ఉగాదిని ముస్లింలు కూడా ఘనంగా జరుపుకుంటారని తెలుసా, సృష్టి ఆరంభమైన దినమే ఉగాది, జీవిత సత్యాన్ని తెలిపే యుగాది పచ్చడితో ఈ ఏడాది తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుదామా..

1.కరోనా పీడ తొలగిపోవాలని కోరుకుంటూ అందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

2. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినోభవంతు

3.మిత్రులకు శ్రేయోభిలాషులకు 2021వ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

4.తెలుగు ప్రజలందరికీ కొత్త వసంత తొలి పండగ శ్రీ ప్లవ నామ ఉగాది శుభాకాంక్షలు

5.ప్రపంచంలో కరోనా చీకట్లను తొలగించి..

తిరిగి మంచి రోజులు రావాలని కోరుకుంటూ..

అందరికీ ముందుగా శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

6.మధురమైన ప్రతి క్షణం

నిలుస్తుంది జీవితాంతం

రాబోతున్న కొత్త సంవత్సరం

అలాంటి క్షణాలనెన్నో

అందించాలని ఆశిస్తూ.. శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

7.మీకూ, మీ కుటుంబ సభ్యులకూ ‘ఉగాది ‘ శుభాకాంక్షలు.

ఈ తెలుగు సంవత్సరం మీకూ మీ కుటుంబ సభ్యులకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము.

8.తీపి, చేదు కలగలిపినదే జీవితం..

కష్టం, సుఖం ఉంటేనే నిజమైన జీవితం..

ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వచ్చేదే ఉగాది పర్వదినం

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శ్రీ ఫ్లవ నామ ఉగాది శుభాకాంక్షలు

శ్రీ శార్వారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. షడ్రుచుల లాంటి ఉగాది 2021 గ్రీటింగ్స్, Messages, Quotes, Images, Status, Greetings, HD Wallpaper, Pics ఉగాది విశిష్టతతో అందిస్తున్నాం

10.మామిడి పువ్వుకి మాట వచ్చింది..

కోయిల గొంతుకు కూత వచ్చింది..

వేప కొమ్మకు పూత వచ్చింది..

పసిడి బెల్లం తోడు వచ్చింది..

గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది..

వీటన్నింటినీ ఉగాది మన ముందుకు తెచ్చింది..

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శ్రీ ఫ్లవ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు

11.వసంత కాలం..

కొత్త చిగురు పుట్టే సమయం..

కొత్త ఏడాది ఆరంభం..

షడ్రుచుల సమ్మేళనం..

ఆనందం.. ఆహ్లాదం తీసుకొచ్చేదే ఉగాది..

ఈ సందర్భంగా శ్రీ ఫ్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు.

12.అమెరికా అయినా రష్యా అయినా,

హాంకాంగ్ అయిన బ్యాంకాక్ అయినా,

ఇండియా అయిన ఇంగ్లాండ్ అయినా,

ఎక్కడ ఉన్న సారీ ఓ తెలుగోడా..

ఉగాది పండుగని ఆనందం గా జరుపుకో..

మన సంప్రదాయాన్ని ఆర్తిగా నిలుపుకో..

ఉగాది శుభాకాంక్షలు.

13. శ్రీ ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ

ఉగాది శుభాకాంక్షలు...

లక్ష్మీదేవి మీ ఇంటికి చేరాలని,

కరోనా వైరస్ మహమ్మారి మీ దరి చేరకూడదని,

అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ.. Happy Ugadi 2021

14. జీవితం సకల అనుభూతుల సమ్మేళనం

స్థితప్రజ్ఞత అలవరుచుకోవడం వివేకుల లక్షణం

ఈ ఉగాది మీకు తెలిపే సందేశమిదే..

మీకు, మీ కుటుంబసభ్యులకు శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

15. మీ ఇంట నవ వసంతం..

కోకిల మీ ఇంటికి అతిథిగా..

రంగవల్లుల రంగులు..

కొత్త చిగురులు..

ఆశల తోరణాలు కట్టే వేళ ఉగాది..

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శ్రీ ఫ్లవ నామ ఉగాది శుభాకాంక్షలు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif