Ugadi Festival: ఉగాదిని ముస్లింలు కూడా ఘనంగా జరుపుకుంటారని తెలుసా, సృష్టి ఆరంభమైన దినమే ఉగాది, జీవిత సత్యాన్ని తెలిపే యుగాది పచ్చడితో ఈ ఏడాది తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుదామా..
Latest Ugadi Wishes in Telugu

ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ (Telugu New Year) గుర్తింపు తెచ్చుకుంది.పులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఉప్పు... షడ్రుచుల మిశ్రమమే ఉగాది (Happy Ugadi).

వసంతుడు చెరకుగడతో తియ్యటి బాణాలు సంధిస్తాడు... వేప పూత చేదుతో క్రిమికీటకాలునశిస్తాయి.. పుల్లటి రుచితో శరీర తాపబాధ తగ్గుతుంది.. వగరు రుచి సన్నని పొగరు కలిగిస్తుంది.. అందరిలోనూ కలిసిపోతూ రుచిని పెంచుతుంది ఉప్పు కోయిలమ్మ తియ్యటి కంఠస్వరంతో ప్రకృతి పరవశిస్తుంది.. ఇదే ఉగాది పండుగ..

చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్విదినానికి (Happy Telugu New Year) ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచంగ శ్రవణాన్ని చేస్తారు.

చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.

వసంత రుతువు వచ్చేసింది, ప్రత్యేక డూడుల్‌తో వసంత ఋతువుకు స్వాగతం చెప్పిన గూగుల్, ఉత్తర అమెరికా ఆంగ్లంలో వసంత ఋతువు అంటే పతనం అని అర్థమని మీకు తెలుసా?

ఇక శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. 'ఉగాది', 'యుగాది' అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. 'ఉగ' అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా 'ద్వయం; లేదా 'జంట' అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది.

ఉగాది నాడు పచ్చడి తినకపోతే ఎంత నష్టపోతారో తెలుసా, పండగ రోజు ఈ పనులు అస్సలు చేయవద్దు, చేస్తే చాలా నష్టపోతారు...

తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు. ఇక ఏపీలోని కడపలో ఉగాది వేడుక హిందూ-ముస్లింల సఖ్యతకు వేదికగా జరుపుకుంటారు. ఏళ్లుగా కడపలో ముస్లింలు తెలుగువారి తొలి ఏడాదిని ఘనంగా జరుపుకుంటున్నారు. వెంకన్న ఆలయానికి వెళ్లి ఆశీస్సులు తీసుకుంటారు.

ఉగాది రోజు పొరపాటున కూడా ఈ పని చేశారో ఏడాది మొత్తం చాలా నష్టపోతారు, ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా పాటించాల్సిన నియమాలు ఇవే...

కడప లక్ష్మీ వెంకటేశ్వరుని ఆలయానికి వేకువజాము నుంచే ముస్లిం భక్తుల భారీ సంఖ్యలో చేరుకుంటారు. ఆరోజున స్వామి వారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకుంటారు. అంతేకాదు ఇక్కడ వెంకన్నకు ఉప్పు, పప్పు, చింతపండు సమర్పించడం ఆనవాయితిగా వస్తుంది. ముస్లింలు వెంకన్న ఆలయానికి రావడం వెనుక చారిత్రక నేపథ్యముంది. శ్రీవారు.. బీబీ నాంచారిని వివాహం చేసుకోవడంతో హిందూ-ముస్లింలకు బంధుత్వం ఏర్పడింది.

వచ్చేసింది నవవసంతం, ఆమని ఆగమనంతో కిలకిల రాగాలు పలుకుతోంది లోకం. వసంత రుతువు ప్రారంభమైన సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్

అందుకే.. ముస్లింలు.. వేంకటేశ్వరస్వామిని అల్లునిగా భావిస్తారు . ఉగాది రోజు ప్రత్యేకంగా వెంకన్న ఆలయానికి వెళ్లి తమ అల్లునికి పండుగకి ఇంటికి ఆహ్వానిస్తూ మొక్కుకుంటారు. కడప ఆలయానికి చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి కూడా భారీగా ముస్లింలు తరలివస్తారు. ఆరోజు ఆలయంలో ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఉగాది రోజున హిందూ భక్తుల కంటే కూడా ముస్లిం భక్తులే ఎక్కువగా కనిపించడం ఈ ఆలయం ప్రత్యేకత.

ఉగాది పచ్చడి రుచుల జీవితం

బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక

ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం

వేప పువ్వు- చేదు- బాధకలిగించే అనుభవాలు

చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు

పచ్చి మామిడి ముక్కలు- వగరు - కొత్త సవాళ్లు

కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు