Independence Day 2021 Greetings: భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు,ఈ కోట్స్‌తో మీ బంధుమిత్రులకి, స్నేహితులకి విషెస్ చెప్పండి, WhatsApp Status, Quotes, Facebook Captions మీకోసం..
ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు.
బ్రిటిష్ వారి రాక్షస పాలన నుంచి భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీన మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day 2021) జరుపుకుంటూ వస్తున్నాం. మహానీయులను గుర్తు చేసుకుంటున్నాం.
జెండాలో ఉన్న ఒక్కో రంగు ఒక్కో విషయాన్ని మనకు తెలియజేస్తాయి. కాషాయ రంగు దేశ పటిష్టతకు, ధైర్యానికి ప్రతీకగా నిలిస్తే, మధ్యలో ఉండే తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. కింద ఉండే ఆకుపచ్చ రంగు దేశ ప్రగతికి సూచికగా నిలుస్తుంది. ఇక మధ్యలో ఉండే అశోక చక్రం ధర్మాన్ని సూచిస్తుంది.
భారత జాతీయ జెండాను 1947 జూలై 27వ తేదీన నిర్వహించిన రాజ్యాంగ సభలో మొదటగా ఆమోదించగా, ఆ తరువాత నుంచి అదే జెండాను మనం ఉపయోగిస్తూ వస్తున్నాం. భారత జాతీయ పతాకాన్ని త్రివర్ణ పతాకం, మువ్వన్నెల జెండా అని కూడా పిలుస్తారు. ఈ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమానమైన నిష్పత్తిలో ఉంటాయి. మధ్యలో 24 ఆకులతో ఆకాశనీలం రంగులో అశోక చక్రం ఉంటుంది. కాగా భారత జాతీయ పతాకాన్ని రూపొందించింది మన తెలుగు వాడైన పింగళి వెంకయ్య. ఆయన రూపొందించిన జెండానే ఇప్పటికీ మనం వాడుతున్నాం.
భారత స్వాతంత్ర్య దినోత్సవం కొటేషన్లు, కోట్స్ విషెస్ మీకోసం
1. అన్ని దేశాల్లో కెల్లా భారతదేశం మిన్న అని చాటి చెబుతూ జరుపుకుందాం ఈ పండుగను కన్నుల విందుగా.. అందరికీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
2. నేటి స్వాతంత్ర్య సంబరం..ఎందరో త్యాగవీరుల త్యాగఫలం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
3. బానిస సంకెళ్లను తెంచి స్వేచ్ఛా వాయువుల కోసం వందల ఏళ్లు తెగించి పోరాడిన మన వీరత్వం భరతమాతకు పట్టం కట్టిన త్యాగధనుల కర్మఫలం. 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
4.మాతృభూమి కోసం తన ధన, మాన ప్రాణాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
5. ఏ దేశమేగినా -ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా- ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండుగౌరవం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
6. సమరయోధుల పోరాట ఫలం..అమర వీరుల త్యాగఫలం బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం మన స్వాతంత్ర్య దినోత్సవం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
7. సామ్రాస్యవాదుల సంకెళ్లు తెంచుకుని భరతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు.స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
8. బానిస బతుకులకు విముక్తి చెబుతూ.. అమర వీరుల త్యాగాలను గౌరవిస్తూ.. ఏటా జరుపుకునే సంబరాల సంబరం.స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
9. మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అసువులు బాసిన సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ.. అందరికీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
10. గాంధీ తాత మెచ్చిన జెండా
నెహ్రూ గారికి నచ్చిన జెండా
భగత్ సింగ్ పట్టిన జెండా
బోస్ నేత ఎగరేసిన జెండా
తెల్లదొరలను ఎదిరించిన జెండా
చల్లగా స్వరాజ్యం తెచ్చిన జెండా
ప్రియమైన భారతీయులందరికీ జెండా పండుగ శుభాకాంక్షలు
11. మన స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
12. వందేమాతరం.. వందేమాతరం.. భారతీయతే మా నినాదం.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
13. సమరయోధుల పోరాట బలం.. అమర వీరుల త్యాగఫలం.. బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం.. మన స్వాతంత్య్ర దినోత్సవం.. సామ్రాజ్యవాద సంకెళ్లు తెంచుకుని.. భరతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు.. మిత్రులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.