New Delhi, August 14: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 14వ తేదీని ఇక నుంచి విభజన కష్టాల స్మృతి దివస్‌గా (Partition Horrors Remembrance Day) పాటించాలని పిలుపునిచ్చారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయన ఈ విషయాన్ని (PM Modi declares ) తెలిపారు. పాకిస్తాన్ ఇండియా విభజన సందర్బంగా ప్రజలు బాధలను, కష్టాలను ఎప్పటికీ మర్చిపోలేమని గుర్తుచేసుకున్న ప్రధాని ఆగస్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్‌గా జరుపుకోవాలని ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు.
దేశ చరిత్రలో విభజన కష్టాలను ఎన్నటికీ మర్చిపోలేమని, విభజన సమయంలో ప్రజల పోరాటం, త్యాగాలను గుర్తు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా లక్షలాదిమంది సోదర సోదరీ మణులు విడిపోవాల్సి వచ్చింది. అప్పటి ద్వేషం, హింస కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయారని ట్వీట్ చేశారు. లక్షలాది మంది మన సోదరసోదరీమణులు చెల్లాచెదురయ్యారని, మతిలేని ద్వేషం, హింస వల్ల వేలాది మంది మరణించారని, వారి కష్టాలు, త్యాగాలకు గుర్తుగా ఆగస్టు 14వ తేదీన విభజన గాయాల స్మారక దినంగా పాటించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
ఈ సందర్భంగా సామాజిక విభేదాలు, అసమానతలు అనే విషాన్ని తొలగించడంతోపాటు, ఏకత్వం, సామాజిక సామరస్యం, మానవ సాధికారతా స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకోవాల్సి అవసరం ఉందని ప్రధాని మోదీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.దేశ విభజన వల్ల ప్రజల్లో సామాజిక విభజనలు వచ్చాయని, సామరస్యం లోపించిందని, ఆ విష బీజాలను పారద్రోలేందుకు పార్టిషన్ హారర్స్ రిమెంబ్రెన్స్ డే నిర్వహించాలని మోదీ తెలిపారు. ఈ స్మృతి దినం ఏకత్వ స్పూర్తిని నింపాలన్నారు. సామాజిక సామరస్యం, మానవ సాధికారత మరింత బలోపేతం కావాలని మోదీ తెలిపారు.
Here's PM Modi Tweet
May the #PartitionHorrorsRemembranceDay keep reminding us of the need to remove the poison of social divisions, disharmony and further strengthen the spirit of oneness, social harmony and human empowerment.
— Narendra Modi (@narendramodi) August 14, 2021
మరోవైపు ఇవాళ పాకిస్థాన్ తన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ నేపథ్యంలో అత్తారి-వాఘా బోర్డర్ వద్ద పాకిస్థాన్ రేంజర్లు, బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్ స్వీట్లు పంచుకున్నారు. రేపు కూడా వాళ్లకు స్వీట్లు ఇవ్వనున్నట్లు బీఎస్ఎఫ్ కమాండెండ్ జస్బీర్ సింగ్ తెలిపారు.