Ram Navami Wishes: శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపే కోట్స్, స్నేహితులకు, బంధువులకు, కుటుంబసభ్యులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు ఈ మెసేజ్‌స్ ద్వారా చెప్పేయండి
శ్రీ రామ నవమి (Ram Navami 2022) అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన దినం. ఆ సుగణాభిరాముడు, లోకోద్దారకుడు అయిన ఆ స్వామి పుట్టిన రోజు చైత్రశుద్ద నవమి. శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. ఆరోజు కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది.
శ్రీరామ నవమి చాలా ముఖ్యమైన రోజు. శ్రీ రామ నవమి (Ram Navami 2022) అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన దినం. ఆ సుగణాభిరాముడు, లోకోద్దారకుడు అయిన ఆ స్వామి పుట్టిన రోజు చైత్రశుద్ద నవమి. శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. ఆరోజు కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది.అయితే ఆరోజు రాముడిని కొలవడం వల్ల మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.
వివిధ రకాలుగా భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. ఆ రోజు దేవుళ్ళు దేవతల విగ్రహాలను శుభ్రం చేసుకుంటారు. ఉదయాన్నే నిద్ర లేచి ఇళ్లను శుభ్రం చేసుకుని దేవుడు మందిరం శుభ్రం చేసుకున్నాక దీపారాధన చేస్తారు. అలానే శ్రీ రామునికి పండ్లు, తులసి ఆకులని, పూలని, ప్రసాదాన్ని అర్పిస్తారు. అలానే ఆ రోజు ఉపవాసం కూడా చాలా మంది పాటిస్తారు. శ్రీ రామునికి హారతి ఇచ్చిన తర్వాత రామచరితమానస్, రామాయణం, రామస్తుతి, రామ రక్ష స్తోత్రం వంటివి చదువుతారు.
శ్రీరాముడు త్రేతాయుగంలో , చైత్రమాసం, వసంత ఋతువు శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును (The Birth Anniversary Of Lord Rama) ప్రజలు పండుగగా జరుపుకొంటారు.
ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు చెప్పేయండి
మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
ఆ శ్రీరాముని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు
శ్రీ రామ జయరామ జయ జయ రామ!
ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం!
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం! కష్టంలో కలిసి నడవాలన్నది సీతాతత్వం! అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
పుణ్య దంపతులైన సీతా రాముల శుభాశీస్సులతో మనందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో నిండాలని ఆశిస్తూ అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు! జై శ్రీరామ్