Ram Navami 2024 in Ayodhya: వీడియోలు ఇవిగో, బాలరాముడి నుదిటిపై తిలకం దిద్దిన సూర్య కిరణాలు, అయోధ్యలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు..
మధ్యాహ్నం 12:16 గంటల సమయంలో సూర్య కిరణాలు బాలరాముడి నుదుటన తిలకంగా మూడున్నర నిమిషాల పాటు కనిపించాయి. భక్తజన సంద్రంగా అయోధ్య మారింది.
శ్రీరామ జన్మభూమి అయోధ్యలో శ్రీరామ నవమి (Ram Navami ) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అక్కడ నూతనంగా నిర్మించిన రామ మందిరంలో (Shri Ram Janmabhoomi Temple) బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి శ్రీరామ నవమి కావడంతో వేడుకలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సూర్య కిరణాలు బాల రాముడికి తిలకం దిద్దాయి.
మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముడి నుదిటిపై సూర్య కిరణాలు పడ్డాయి. మధ్యాహ్నం 12:16 గంటల సమయంలో సూర్య కిరణాలు బాలరాముడి నుదుటన తిలకంగా మూడున్నర నిమిషాల పాటు కనిపించాయి. భక్తజన సంద్రంగా అయోధ్య మారింది. బాలరాముడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రాణప్రతిష్ట తరువాత తొలిసారి అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి.రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేసింది. వీడియోలు ఇవిగో, భద్రాచలంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం, ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
శ్రీరామనవమి రోజున భక్తులకు శ్రీరాముడి దర్శనం కోసం 19 గంటల పాటు ఆలయం తలుపులు తెరిచి ఉంచుతారు. నాలుగు భోగ్ నైవేద్యాల సమయంలో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే తెర మూసివేయనున్నారు. విశిష్ట అతిథులు ఏప్రిల్ 19 తర్వాత మాత్రమే దర్శనం కోసం సందర్శించాలని అయోధ్య రామ మందిర ట్రస్ట్ వెల్లడించింది. శ్రీరామనవమి రోజు రాముల వారి కోసం 1,11,111 కేజీల లడ్డూలను అయోధ్య రామ మందిరానికి దేవర్హ హన్స్ బాబా ట్రస్ట్ పంపించింది.
Here's Live Videos
అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఈ లడ్డూలు ప్రసాదంగా ఇవ్వనున్నారు. ఈ ట్రస్ట్ జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ట వేడుకకు 40 వేల కేజీల లడ్డూలు ఇచ్చింది. రామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి సుమారు 25 నుంచి 35 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పడానికి అద్భుతమైన కోట్స్,ఈ మెసేజెస్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు రామనవమి శుభాకాంక్షలు చెప్పేయండి
ఏటా శ్రీరామనవమి రోజున రాముడి విగ్రహం నుదుటన సూర్య కిరణాలు ప్రసరించేలా అధికారులు ఆలయ నిర్మాణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏటా ఈ పండుగ వేళ మధ్యాహ్నం సమయంలో బాలరాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. దీన్నే సూర్య తిలకంగా అభివర్ణిస్తారు. ఇందు కోసం ఆలయ మూడో అంతస్తులో ప్రత్యేక అద్దాలను ఏర్పాటు చేశారు. ఈ సూర్యకిరణాల తిలకం 58 మిల్లీ మీటర్ల పరిమాణంతో ఉంటుంది. ఇందులో రెండు నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంగా కనిపిస్తుంది. ఇక ఇవాళ తొలిసారి ఆలయంలో ఆ దృశ్యం కనిపించనుంది. దీంతో ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలివెళ్లారు.