Ram Navami Wishes in Telugu: శ్రీరామ నవమి చాలా ముఖ్యమైన రోజు. శ్రీ రామ నవమి (Ram Navami 2024) అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన దినం. ఆ సుగణాభిరాముడు, లోకోద్దారకుడు అయిన ఆ స్వామి పుట్టిన రోజు చైత్రశుద్ద నవమి. శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. ఆరోజు కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది.అయితే ఆరోజు రాముడిని కొలవడం వల్ల మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.
వివిధ రకాలుగా భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. ఆ రోజు దేవుళ్ళు దేవతల విగ్రహాలను శుభ్రం చేసుకుంటారు. ఉదయాన్నే నిద్ర లేచి ఇళ్లను శుభ్రం చేసుకుని దేవుడు మందిరం శుభ్రం చేసుకున్నాక దీపారాధన చేస్తారు. అలానే శ్రీ రామునికి పండ్లు, తులసి ఆకులని, పూలని, ప్రసాదాన్ని అర్పిస్తారు. శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పడానికి అద్భుతమైన కోట్స్,ఈ మెసేజెస్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండి
అలానే ఆ రోజు ఉపవాసం కూడా చాలా మంది పాటిస్తారు. శ్రీ రామునికి హారతి ఇచ్చిన తర్వాత రామచరితమానస్, రామాయణం, రామస్తుతి, రామ రక్ష స్తోత్రం వంటివి చదువుతారు. ఈ కోట్స్ ద్వారా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పేద్దాం.
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు
శ్రీ రామ జయరామ జయ జయ రామ!
ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం!
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
[caption id="attachment_133205" align="aligncenter" width="1200"] Ram Navami Telugu Messages
ఆ శ్రీరాముని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు