Ramzan 2023: కనిపించిన నెలవంక, నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు, సైరన్లు మోగించి అధికారికంగా ప్రకటించిన ముస్లిం మతగురువులు
శుక్రవారం తెల్లవారుజామున సహార్‌తో ఉపవాస దీక్షలు (fasting begins today) ప్రారంభం కానున్నాయి.
ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల అయిన రంజాన్‌ను (Ramzan) ముస్లింలు ఉత్సాహంగా, గొప్పగా జరుపుకుంటారు, ఎందుకంటే 30 రోజుల పండుగ ఆశ, ఆధ్యాత్మిక వృద్ధికి గుర్తుగా ఉంటుంది. ఈ కాలంలో, ముస్లింలు ప్రార్థనలు చేస్తారు. ఉపవాసం ఉంటారు. ప్రాపంచిక ఆనందాలను వదులుకుంటారు. వారు సుహూర్ కోసం త్వరగా మేల్కొంటారు. సూర్యాస్తమయం వరకు ఆహారం, పానీయాలకు దూరంగా ఉంటారు. ఖర్జూరం, నీళ్లతో ఉపవాసం విరమించిన తర్వాత ఇఫ్తార్ సమయంలో వివిధ రకాల రుచికరమైన వంటకాలతో కూడిన భోజనం చేస్తారు.
పవిత్ర రంజాన్ మాసం సెహ్రీ, ఇఫ్తార్ టైమింగ్స్ ఇవే, హైదరాబాద్ నగరంలో టైమింగ్స్ ఓ సారి తెలుసుకోండి
ఇస్లామిక్ పవిత్ర మాసం ప్రారంభం చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది. తాజాగా నెలవంక దర్శనమివ్వడంతో రంజాన్ నెల ప్రారంభమైనట్లు సైరన్లు మోగించి మతగురువులు ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున సహార్‌తో ఉపవాస దీక్షలు (fasting begins today) ప్రారంభం కానున్నాయి. కాగా, మూడేళ్లుగా కరోనాతో నగరంలో రంజాన్ సందడి అంతగా కనిపించలేదు. ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో రంజాన్ కళ మళ్లీ తిరిగి రానుంది.
ఒకవైపు ముస్లింలు ఉపవాస దీక్షలు కొనసాగిస్తూ..మరోవైపు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, ఫలాలు కొనుగోలుతో మార్కెట్‌లు సందడిగా మారాయి. చార్మినార్, నయాపూల్, అఫ్జల్‌గంజ్, మల్లేపల్లితో, మెహిదీపట్నం, టోలిచౌకితో పాటు ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో రంజాన్ మార్కెట్‌లు వెలిశాయి. వ్యాపార సంస్థలను రంగురంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు.
ఇది మొదట సౌదీ అరేబియా, యుఎఇ, యుకె, కొన్ని పాశ్చాత్య దేశాలు, ఆపై భారతదేశంతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కనిపించింది. భారతదేశంలో రంజాన్ కోసం ముస్లింలు ఈ రోజు, మార్చి 24, శుక్రవారం నుండి ఉపవాసం ప్రారంభిస్తారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా న్యూఢిల్లీలోని ప్రముఖ మసీదు జామా మసీదు దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. మార్చి 23, గురువారం సాయంత్రం రంజాన్ సందర్భంగా జామా మసీదు సమీపంలోని మార్కెట్‌కు కూడా ప్రజలు భారీగా తరలివచ్చారు.