Ramadan Mubarak Wishes in Telugu: పవిత్ర రంజాన్ మాసం ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. రంజాన్ మాసం... ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. రంజాన్ మాసం ప్రారంభం చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది. రంజాన్ మార్చి 22 లేదా మార్చి 23న ప్రారంభమై ఏప్రిల్ 21 లేదా ఏప్రిల్ 22న ఈద్-ఉల్-ఫితర్ రోజున ముగుస్తుందని భావిస్తున్నారు. రంజాన్ మాసం ప్రారంభం, ముగింపు నిర్ణయించడానికి నెలవంక దర్శనం ముఖ్యం.
ఈ ఉపవాస సమయంలో ప్రజలు సెహ్రీ, ఇఫ్తార్ చేస్తారు.రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. సూర్యోదయానికి ముందు తీసుకునే భోజనాన్ని సెహ్రీ అని, సూర్యోదయం తర్వాత తీసుకునే భోజనాన్ని ఇఫ్తార్ అని అంటారు. పవిత్ర రంజాన్ మాసంలో, ఉపవాసం ఉండే వ్యక్తి సరైన సమయంలో సెహ్రీ, ఇఫ్తార్ కలిగి ఉండటం చాలా ముఖ్యం.
సెహ్రీ తర్వాత, రోజంతా ఏదైనా తినడం, త్రాగడం నిషేధించబడింది. సాయంత్రం నమాజ్ చేసిన తర్వాత, సూర్యాస్తమయం సమయంలో ఇఫ్తార్ చేస్తారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మిత్రులకు శుభాకాంక్షలు చెప్పేయండి ఈ మెసేజ్‌లతో..
నెల రోజులపాటు రంజాన్ దీక్షలు పాటించిన ముస్లింలు మాసం అనంతరం షవ్వాల్ మాసపు మొదటి రోజు జరుపుకొనే పండుగే ఈద్–ఉల్–ఫితర్. ఈ రోజు ఉదయాన్నే తలంటు స్నానాలు చేసి, కొత్త బట్టలను ధరించి, ఇతర్ పూసుకొని ఊరి చివరన ఉండే ఈద్‌గాహ్‌లలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ‘ఈద్–ముబారక్’ అంటూ శుభాకాంక్షలు చెప్పుకొంటారు.
ఇస్లాం నిర్దేశించిన సిద్ధాంతాల్లో జకాత్ నాలుగోది. జకాత్ అనగా దానం. ఇది మానవుల్లో త్యాగం, సానుభూతి, సహకారాలను పెంపొందిస్తుంది. ప్రతి ఒక్కరూ తమకు ఉన్న దానిలోనే అవసరమున్న వారికి ఇంత ఇచ్చి ఆదుకోవాలి.
30 రోజులపాటు ఉపవాస దీక్ష పాటించలేని వారు 27 రోజుల తర్వాత వచ్చే షబ్–ఎ–ఖదర్ రాత్రి నుంచి ఈద్–ఉల్–ఫితర్ వరకు మూడు రోజులపాటు ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఇహ లోకంలో ఆచరించే ఇటువంటి కఠో ర దీక్షలు మనల్ని పరలోకంలో రక్షణగా ఉండి కాపాడుతాయని ముస్లింల ప్రగాఢ విశ్వాసం.
సమాజంలోని నిరుపేదలకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు కూడా ఇతరులతో పాటు పండుగల్లో మంచి వస్త్రాలు ధరించి మంచి వంటకాలు ఆరగించే వీలు కల్పిస్తుంది. పావు తక్కువ రెండు సేర్ల గోదుమల తూకానికి సరిపడా పైకాన్ని కడు నిరుపేదలకు దైవం పేరిట ప్రతి ముస్లిం దానం చేయాలి.