Ramzan Mubarak 2020 Wishes

Ramdan Mubarak Telugu Wishes: ముస్లీం అతి పవిత్ర పండగ రంజాన్. రంజాన్ (Ramzan) పండుగకు ఓనెల ముందు నుంచే ముస్లీంలు అతి పవిత్రంగా ఉపవాస దీక్షను పాటిస్తారు. అయితే ఇదే మాసంలో వాళ్లు దాన ధర్మాలు కూడా విపరీతంగా చేస్తారు. అత్యంత పేదవారికి తోచని సాయం చేస్తుంటారు. బట్టలు, డబ్బులు, ఆహారాన్ని పంపిణీ చేస్తుంటారు. ఈ ఏడాది రంజాన్‌ మాసం ఈనెల 23న ప్రారంభం కానుంది. ప్రేమలో ఓడిపోవడం, గెలవడం అంటూ ఉండవు

ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్‌. దివ్య ఖుర్‌ ఆన్‌ గ్రంథం దివి నుంచి భువికి ఈ మాసంలోనే వచ్చింది. ఈ నెలలో ఉపవాస దీక్ష ద్వారా శరీరాన్ని శుష్కింపజేయడం ద్వా రా ఆత్మ ప్రక్షాళన అవుతుంది. తద్వారా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు అదుపులో ఉంటాయి. రంజాన్‌ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షను ఆచరించిన విదితమే. ఉదయాన్నే అన్న పానాదులను సేవించడాన్ని సహరి అంటా రు. తిరిగి సాయంత్రం ఉపవాస దీక్ష విరమించి భోజనాన్ని సేవించడాన్ని ఇఫ్తార్‌ అంటారు.

Ramzan Mubarak 2020 Wishes

ముస్లింలకు ముఖ్యమైన ఐదు విధులైన ఈమాన్, నమాజ్, జకాత్, రోజా, హజ్‌లలో రోజాను రంజాన్‌ మాసంలో త్రికరణ శుద్ధితో ఆచరిస్తారు. ఉపవాసాన్ని అరబ్బీలో ‘సౌమ్‌’ అని, ఉర్దూ భాషలో ‘రోజా’ అనీ పిలుస్తారు. ఇస్లాంలో ‘రోజా’ అంటే ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆహారపానీయాలు సేవించకుండా మనోవాంఛలకు దూరంగా ఉండడం. ఈమాన్- దైవత్వం పట్ల ప్రగాఢ విశ్వాసం, నమాజ్- ఎనిమిదేళ్లు దాటిన వారు విధిగా 5 సార్లు చేయాలి, రోజా- ఉపవాసదీక్షను 8 ఏళ్లు నిండి బాలబాలికలతో సహా అందరూ విధిగా పాటించాలి, జకాత్ / సద్కా- తమ స్థోమతను బట్టి నిర్దేశించిన స్థాయిలో దానధర్మాలు చేయడంగా చెప్పవచ్చు.

నెల రోజులపాటు రంజాన్‌ దీక్షలు పాటించిన ముస్లింలు మాసం అనంతరం షవ్వాల్‌ మాసపు మొదటి రోజు జరుపుకొనే పండుగే ఈద్‌–ఉల్‌–ఫితర్‌. ఈ రోజు ఉదయాన్నే తలంటు స్నానాలు చేసి, కొత్త బట్టలను ధరించి, ఇతర్‌ పూసుకొని ఊరి చివరన ఉండే ఈద్‌గాహ్‌లలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ‘ఈద్‌–ముబారక్‌’ అంటూ శుభాకాంక్షలు చెప్పుకొంటారు.

రంజాన్‌ పండగ రోజు షీర్‌ ఖుర్మా అనే తీపి వంటకం అందరినీ నోరూరిస్తుంది. ధనికులు, పేదలు అంతా ఒకే భావన, ప్రేమాభిమానాలు, సమైక్యతా సామరస్యాలు నెలకొల్పడంలో ఈ పండుగ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ పండుగ తర్వాత మరో 6 రోజులపాటు షవ్వాల్‌ దీక్షలను పాటిస్తారు.

జకాత్‌:

ఇస్లాం నిర్దేశించిన సిద్ధాంతాల్లో జకాత్‌ నాలుగోది. జకాత్‌ అనగా దానం. ఇది మానవుల్లో త్యాగం, సానుభూతి, సహకారాలను పెంపొందిస్తుంది. ప్రతి ఒక్కరూ తమకు ఉన్న దానిలోనే అవసరమున్న వారికి ఇంత ఇచ్చి ఆదుకోవాలి. తమ వద్ద ఉన్న బంగారం, వెండి, రొక్కం, ఆ సంవత్సరం పండిన పంట, వ్యాపారం కోసం నిర్దేశించబడి ఉన్న సరుకులు, చివరకి తమ వద్ద ఉన్న పశువుల వెల కట్టి అందులో నుంచి 2.5శాతం విధిగా దానం చేయాల్సి ఉంటుంది. నిరుపేదలు సైతం ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకోవాలనేదే దీని ముఖ్య ఉద్దేశం.

Ramzan Mubarak 2020 Wishes

ప్రతి రోజు రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు ప్రత్యేకంగా తరావీ నమాజ్‌ చేస్తారు. దివ్య ఖుర్‌ ఆన్‌ను రోజుకు 20 రకాతుల చొప్పున తరావీ నమాజులో 27 రోజులపాటు హాఫీజ్‌లు పఠిస్తారు. రంజాన్‌లో రాత్రి పూట ఇషా నమాజ్‌ అనంతరం తరావీ నమాజ్‌ జరుగుతుంది. ఇలా 27 రోజులు తరావీ నమాజ్‌ జరిపిన తర్వాత షబ్‌–ఎ–ఖదర్‌ రాత్రి ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు.

Ramzan Mubarak 2020 Wishes

30 రోజులపాటు ఉపవాస దీక్ష పాటించలేని వారు 27 రోజుల తర్వాత వచ్చే షబ్‌–ఎ–ఖదర్‌ రాత్రి నుంచి ఈద్‌–ఉల్‌–ఫితర్‌ వరకు మూడు రోజులపాటు ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఇహ లోకంలో ఆచరించే ఇటువంటి కఠో ర దీక్షలు మనల్ని పరలోకంలో రక్షణగా ఉండి కాపాడుతాయని ముస్లింల ప్రగాఢ విశ్వాసం.

Ramzan Mubarak 2020 Wishes

రంజాన్‌ నెలలో ఉపవాసాలతో, దాన ధర్మాలతో గడిపిన వారి ప్రార్థనలను అల్లాహ్‌ ఆలకిస్తాడని, వారి పాపాలు పరిహారమై అగ్ని సంస్కారం పొందిన బంగారం మాదిరి వారి మోము దివ్య కాంతిలో వెలుగొందుతుందని ముస్లింలు విశ్వసిస్తారు.

ఫిత్రాదానం:

షవ్వాల్‌ నెల మొదటి తేదీ ఈద్‌–ఉల్‌–ఫితర్‌ పండుగనాడు నమాజ్‌ ప్రార్థనకు ముందు పేదలకిచ్చే దానమే ఫిత్రా. అందుకే ఈ పండుగను ఈద్‌–ఉల్‌–ఫిత్ర్‌ అని పేరు వచ్చింది. షరియత్‌ పరిభాషలో ఫిత్రా అంటే ఉపవాసాల పాటింపులో మనిషి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాట్లు, లోపాలు జరుగుతూనే ఉంటాయి. ఆ లోపాల పరిహారార్థం చేసేదే ఫిత్రా దానం.

Ramzan Mubarak 2020 Wishes

సమాజంలోని నిరుపేదలకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు కూడా ఇతరులతో పాటు పండుగల్లో మంచి వస్త్రాలు ధరించి మంచి వంటకాలు ఆరగించే వీలు కల్పిస్తుంది. పావు తక్కువ రెండు సేర్ల గోదుమల తూకానికి సరిపడా పైకాన్ని కడు నిరుపేదలకు దైవం పేరిట ప్రతి ముస్లిం దానం చేయాలి.