Sabarimala Makaravilakku: మకరవిళక్కు అంటే తెలుసా, మూడుసార్లు కనిపించే మకరజ్యోతి కోసం శబరిమలకు అయ్యప్ప భక్తులు, మకరవిళక్కు పండుగ సమయం, చరిత్ర ఓ సారి తెలుసుకుందామా..
మకరజ్యోతి సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్య పొన్నంబలేమేడు నుండి వస్తుందని భక్తుల నమ్మకం.
మకరవిళక్కు కేరళలోని అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి, ఇది ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రసిద్ధ శబరిమల ఆలయంలో జరుగుతుంది. ఆలయానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలమేడు కొండపై మూడుసార్లు కనిపించే మకరవిళక్కు (కాంతి లేదా జ్వాల) చూడటానికి అయ్యప్ప స్వామి భక్తులు ఎదురుచూస్తుంటారు. మకరజ్యోతి సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్య పొన్నంబలేమేడు నుండి వస్తుందని భక్తుల నమ్మకం.
ఈ పవిత్రోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని భగవంతుని ఆశీస్సులు కోరుతున్నారు.మకరవిళక్కు పండుగ సమయం, దాని చరిత్ర, ప్రాముఖ్యత, ఆచారాలు, దక్షిణాది రాష్ట్రంలో పండుగను ఎలా జరుపుకుంటారు అనే దాని గురించి వివరంగా మీకు అందిస్తున్నాం. ఓ సారి తెలుసుకోండి. మకరవిళక్కు ఉత్సవాలకు ముందు శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు.మకరవిళక్కు పండుగలో తిరువాభరణం (అయ్యప్ప భగవంతుని పవిత్రమైన ఆభరణాలు) ఊరేగింపు, శబరిమల కొండ పుణ్యక్షేత్రం వద్ద ఒక భక్తుల సందడి ఉంటుంది.
ప్రతి సంవత్సరం, ఈ రోజున ఈ ఆచారాన్ని దర్శనం చేసుకోవడానికి దాదాపు అర మిలియన్ మంది భక్తులు శబరిమలకు వెళ్తారు. కేరళలో 'మకరవిళక్కు' ఉత్సవానికి ముందు ప్రశాంతమైన తీర్థయాత్ర కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తారు. 2023లో, మకరవిళక్కు ఆదివారం, జనవరి 15, 2023న వస్తుంది. మకర విళక్కు సంక్రాంతి ముహూర్తం జనవరి 14న రాత్రి 08:57కి. మకర జ్యోతి 2023 జనవరి 14, 2023న సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల మధ్య వరకు కనిపిస్తుంది.
మకరవిళక్కుకు సంబంధించిన చరిత్ర, ఆచారాలు, వేడుకలు
మకరవిళక్కు అనేది గతంలో మలయరాయ తెగవారు ఆచరించే మతపరమైన ఆచారంలో భాగం. ఈ తెగ పొన్నంబలమేడు (మకరవిళక్కు కనిపించే ప్రదేశం) అడవిలో మలయమాన్ కారి వారసులని నమ్ముతారు. తరువాత ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (TDB) రహస్యంగా కొనసాగించింది. మకరవిళక్కు వందల సంవత్సరాలకు పైగా గిరిజనులు ఆచరిస్తున్నారు. రికార్డుల ప్రకారం, పొన్నంబలమేడులోని ఒక దేవాలయం కేరళ అటవీ శాఖ ఆధీనంలో ఉన్నందున ప్రజలకు తెరవలేదు. మకరం నాడు 1వ తేదీన ఆకాశంలో సిరియస్ నక్షత్రం కనిపించినప్పుడు, ఈ గిరిజనులు ఆ ఆలయంలో తమ కర్మలను నిర్వహిస్తారు.
శబరిమల ఆలయంలో కూడా, ఒక పాత్రలో కర్పూరం, నెయ్యి వెలిగించి విగ్రహం చుట్టూ అగ్నిని ఆవరించి ఆరతి చేస్తారు. శబరిమలై ఆలయం నుండి కనిపించే ఈ దీపం లేదా అగ్నిని మకర జ్యోతి అని పిలుస్తారు, అయితే పొన్నబలమేడులోని మంటలే అసలు మకరవిళక్కు అని మత గ్రంథాలు చెబుతున్నాయి. ఆలయంలో దీపారాధన (ఆరతి) సమయంలో వెలిగించే దీపాన్ని మకర విళక్కు అంటారు.
మకర జ్యోతి అనేది జనవరి 14 లేదా 15 మకర సంక్రాంతి నాడు వచ్చే నక్షత్రం. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు కేరళలోని శబరిమల ఆలయంలో యాత్రికులు అధిక సంఖ్యలో పూజించే నక్షత్రం. తన భక్తులను ఆశీర్వదించడానికి అయ్యప్పన్ దేవుడు తనను తాను మకర జ్యోతిగా చెప్పుకుంటాడని నమ్ముతారు.
పురాణాల ప్రకారం, రాముడు, అతని సోదరుడు లక్ష్మణుడు శబరి అనే గిరిజన భక్తురాలిని శబరిమలలో కలుసుకున్నారు. శబరి పండ్లను ఆమె ఎంగిలి చేసి స్వామివారికి సమర్పించగా, భగవంతుడు వాటిని మనస్పూర్తిగా స్వీకరించాడు.అనంతరం రాముడు వెళ్లాల్సిన శాస్తా వైపు బయలు దేరగా రాముడిని స్వాగతించడానికి లేచి నిల్చుంటుంది. ఈ సంఘటన యొక్క వార్షికోత్సవాన్ని మకర విళక్కు రోజున జరుపుకుంటారు.ఏడు రోజుల పాటు జరిగే మకరవిళక్కు ఉత్సవం ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. పండుగ ముగిసి, కురుతి పూజ జరిగే వరకు చాలా మంది యాత్రికులు సాధారణంగా శబరిమలలోనే ఉంటారు.