Teachers Day 2020: జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం, టీచర్లే హీరోలు అంటూ ప్రధాని మోదీ ట్వీట్, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీ, అమిత్ షా, ఇతర రాజకీయ నాయకులు
అయితే ఈ రోజు సెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా జరిగి, ఉత్సవాలు జరుపుకుంటాయి. ఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి. ఇక ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబరు 5 వ తేదీన జరుపుకుంటారు.
New Delhi, September 5: ఉపాధ్యాయ దినోత్సవం (Teachers' Day) భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబర్ 5 వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అయితే ఈ రోజు సెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా జరిగి, ఉత్సవాలు జరుపుకుంటాయి. ఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి. ఇక ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబరు 5 వ తేదీన జరుపుకుంటారు.
అయితే ఈ సారి కరోనా కారణంగా అన్ని స్కూళ్లు మూసివేయండతో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు అంతరాయం ఏర్పడింది. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా గురువులకు ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, హోం శాఖా మంత్రి అమిత్ షా తదితరులు శుభాకాంక్షలు (Teachers’ Day 2020 Wishes) తెలిపారు. తెలుగు భాషా దినోత్సవం, గిడుగు వెంకట రామమూర్తి జన్మదినోత్సవమే ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం
ఉపాధ్యాయ దినోత్సవాన్ని (Happy Teachers’ Day 2020) పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ట్వీట్ చేశారు. ఉపాధ్యాయులందరికీ ఆయన కృతజ్ఞతలు ప్రకటించారు. జాతికి వారు చేస్తున్న గొప్ప సేవలను ప్రశంసించారు. ‘‘జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు చాలా కష్టపడుతున్నారు. విద్యార్థుల మనసులను తిప్పడంలోనూ వారి పాత్ర కీలకమే. వారందరికీ కృతజ్ఞతలు ప్రకటిస్తున్నా. గురుపూజా దినోత్సవం సందర్భంగా దేశంలోని ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు. సర్వేపల్లి రాధాకృష్ణణ్‌కు నివాళులు అర్పిస్తున్నా. మన ఉపాధ్యాయులే మన హీరోలు’’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Here's PM Tweet
Rahul Gandhi Tweet
విశ్వం మొత్తం నేర్చుకోవాలని ఇష్టపడే వారికి ఒకే ఒక్కరు గురువు మాత్రమే అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఉపాధ్యాయులు తమ జీవితమంతా కేవలం ఒక కారణం కోసం అంకితం చేసే వ్యక్తులు - ఇతరులు తమ జీవితాన్ని నిర్మించుకోవడంలో సహాయపడతారు! ఒక గురువు మనలో జ్ఞాన విత్తనాన్ని నాటాడు, అది ఎప్పటికీ పెరుగుతుందని రణదీప్ సింగ్ సుర్జేవాలా ట్వీట్ చేశారు.
Home minister Tweet
Vice President Tweet
దిగ్గజ ఆలోచనాపరుడు మరియు వివేకవంతుడైన పండితుడు, మాజీ అధ్యక్షుడు డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ జయంతికి నివాళులు. # టీచర్స్ డేలో, లక్షలాది మంది ఆత్మలను నిస్వార్థంగా మార్గనిర్దేశం చేయడం ద్వారా దేశాన్ని రూపొందించడంలో అసమానమైన పాత్ర పోషిస్తున్న మొత్తం బోధనా సోదరభావానికి శుభాకాంక్షలని అమిత్ షా ట్వీట్ చేశారు. మీ అందరికీ #TeachersDay శుభాకాంక్షలు. ఈ రోజు, విద్యార్థులకు విద్యాపరమైన అంతరాయాన్ని నివారించడానికి మహమ్మారి కష్టాల ద్వారా అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలియజేద్దాం. వారి అంకితభావం, ధైర్యం మరియు వారి నిస్వార్థ సేవకు నమస్కరిద్దామంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.
మాజీ అధ్యక్షుడు డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ జీ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశవాసులందరికీ అభినందనలు మరియు శుభాకాంక్షలు.పాఠశాల నుండి విశ్వవిద్యాలయం వరకు 1 కోట్ల మంది ఉపాధ్యాయులు దేశంలోని తరువాతి తరానికి వీలు కల్పిస్తారు. # హ్యాపీ ఉపాధ్యాయ దినోత్సవం అంటే కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు.