Teachers' Day Wishes in Telugu: జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు, ఈ అద్భుతమైన మెసేజెస్ ద్వారా గురువులకు శుభాకాంక్షలు చెప్పేయండి
ఈ రోజు సెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా జరిగి, ఉత్సవాలు జరుపుకుంటాయి.
ఉపాధ్యాయ దినోత్సవం భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం రోజు సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ రోజు సెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా జరిగి, ఉత్సవాలు జరుపుకుంటాయి. ఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి. ఇక ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబరు 5వ తేదీన జరుపుకుంటారు.
1962 నుండి 1967 వరకు దేశాధ్యక్షుడిగా పని చేసిన రాధాకృష్ణన్ ప్రారంభంలో ఉపాధ్యాయుడు. స్వయంగా ఉపాధ్యాయుడైన ఆయన విద్య మీద అపార నమ్మకంగలవాడు. విద్యాధికులు మాత్రమే దేశ సౌభాగ్యానికి చుక్కానులని ఆయన విశ్వసించేవారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5న జరపవలసిందిగా కోరిందీ డా.సర్వేపల్లి రాధాకృష్ణన్. తన పుట్టిన రోజునాడు తనని అభినందించడానికి వచ్చిన తన అభిమానులను ఆయన ఈ రోజు నన్ను అభినందించడంకంటే ఉపాధ్యాయులను అభినందించడం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందనడంతో ఆ రోజు నుంచి ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాధాకృష్ణన్ పుట్టిన రోజునాడు నిర్వహించడం జరుగుతున్నది.ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా గురువుకు శుభాకాంక్షలు చెప్పేయండి
జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు
ఈ అద్భుతమైన మెసేజెస్ ద్వారా గురువులకు శుభాకాంక్షలు చెప్పేయండి
ఈ అద్భుతమైన మెసేజెస్ ద్వారా గురువులకు శుభాకాంక్షలు చెప్పేయండి