Tholi Ekadashi in Telugu: తొలి ఏకాదశికి ఏ దేవుడిని పూజించాలి, ఈ రోజు ఏ పనులు చేయాలి, మరే పనులు చేయకూడదో తెలుసుకోండి

ప్రతి నెల పండుగలతో కళకళలాడుతూ ఉంటుంది. సంవత్సరంలో మనకు 12 ఏకాదశులు వస్తాయి.వీటిని హిందువులు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ ఏకాదశిలలో ఆషాడమాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది.ఈ ఏకాదశిని హిందువులు తొలి ఏకాదశి, శయన ఏకాదశి,హరివాసరం అని కూడా పిలుస్తారు.

Tholi Ekadasi Wishes

మన హిందూ ధర్మంలో సంస్కృతి సాంప్రదాయాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెల పండుగలతో కళకళలాడుతూ ఉంటుంది. సంవత్సరంలో మనకు 12 ఏకాదశులు వస్తాయి.వీటిని హిందువులు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ ఏకాదశిలలో ఆషాడమాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది.ఈ ఏకాదశిని హిందువులు తొలి ఏకాదశి, శయన ఏకాదశి,హరివాసరం అని కూడా పిలుస్తారు.

ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని తొలి ఏకాదశిగా భావిస్తారు. ఈ ఏడాది (2024) జూలై 17 వ తేదీన తొలి ఏకాదశిని జరుపుకుంటున్నారు.ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి శయన పాన్పుపై భక్తులకు దర్శనమిస్తాడు కనుక ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి ఎప్పుడు..? ఉపవాసం, పూజ విధానం ఏమిటి...ఈ రోజు చేయాల్సిన పూజలు ఇవే..

హిందూ పురాణాల ప్రకారం ఈ ఏకాదశి నుంచి సూర్యుడు దక్షిణాయనం దిశలో మనకు కనిపిస్తారు.ఈ రోజును రైతులు విత్తనాల ఏకాదశిగా కూడా జరుపుకుంటారు.ఈ రోజు భక్తులు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.ఉదయమే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకునే విష్ణు దేవుడి ఫోటో లేదా విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేస్తారు. తొలి ఏకాదశి ఎందుకు జరుపుకుంటారో తెలుసా, విష్ణుమూర్తి 4 నెలలు యోగ నిద్రలోకి జారుకున్న తరువాత ఏం జరిగింది ?

ఈ సమయంలో విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. ఈ రోజున ఆవులను పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతారు.ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ " ఈ ద్వాదశ మంత్రాన్ని జపించాలి. రామ, కృష్ణ, నారాయణ మొదలైన పేర్లతో భగవన్నామ స్మరణ చేయాలి.అలాగే విష్ణు శహస్రనామాలను జపించాలి

ఈరోజు మాంసం గుడ్లు చేపలు వంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఎట్టి పరిస్థితులలో తులసీ దళాలను కోయకూడదు. అలాగే స్వామి వారి పూజ అనంతరం స్వామివారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత విష్ణు సహస్రనామాలను చదవాలి.అదే విధంగా ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయమే స్వామివారికి పూజ చేసిన అనంతరం ఉపవాస దీక్ష విరమించాలి.



సంబంధిత వార్తలు

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Weather Forecast: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif