Health Tips: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే మీ నరాలు బలహీనంగా మారుతున్నాయని అర్థం..
ఈ నరాలు బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.
మన శరీరంలో అవయవాలు అన్నిటికీ రక్తప్రసరణ అందించడానికి నరాలు పనిచేస్తాయి. ఈ నరాలు బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. నరాల బలహీనతకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారము శరీరంలో పోషకాలలో విటమిన్ల లోపం నరాలు బలహీనంగా మారడం వంటి సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఈ బలహీనతను తొలగించడానికి మనం మన ఆహారంలో విటమిన్లు ప్రోటీన్లు ఖనిజాలను చేర్చుకోవడం చాలా ముఖ్యం.
నరాల బలహీనత లక్షణాలు- మన శరీరంలో నరాల బలహీనతకు లక్షణాలు చూసినట్లయితే మన చర్మం పైన నరాలు స్పైడర్ లాగా ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా చర్మం లో పడి నుంచి బయటికి వచ్చినట్టుగా కనిపిస్తాయి. వీటిని వెరికోస్ బీన్స్ అని అంటారు ఈ నరాల బలహీనత ఉన్నప్పుడు చేతులు కాళ్లల్లో గుచ్చుకున్నట్టు , జలదరింపులు తిమ్మిరి వంటివి ఏర్పడతాయి. అంతేకాకుండా శరీరంలో వాపు , కాళ్ళలో వాపు బరువు అలసట నొప్పి వంటివి కూడా ఏర్పడతాయి. అంతేకాకుండా నరాలలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. శరీరము శక్తి లేకపోవడం బలహీనంగా ఏ పని చేయాలనిపించకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కడుపు సంబంధం సమస్యలు తలనొప్పి చలి వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. ఒక్కొక్కసారి రక్తపోటు వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. నిరాశ, ఒత్తిడి కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఎలా తగ్గించుకోవాలి- నరాల బలహీనతను ఆహారపు అలవాట్లు కారణమైతే మనం ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఆహారంలో ఐరన్ విటమిన్స్ ప్రోటీన్ ఫైబర్ విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు కూరగాయలను తీసుకోవాలి. అంటే కాకుండా బ్రౌన్ రైస్ బ్రకోలి పైన ఆపిల్ క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఆహారాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. అంతే కాకుండా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ను కూడా మనము తీసుకోవాలి. అంతేకాకుండా విటమిన్ b6, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి కోడిగుడ్లు వంటివి పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీరు త్రాగడం, ముఖ్యంగా పండ్లను అధికంగా తీసుకోవాలి కొబ్బరినీళ్లు నిమ్మరసం మజ్జిగ వంటి వాటిని తీసుకోవడం ఉత్తమం.
Health Tips: చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి హాని చేస్తుందా..
చిట్కాలు- ఆహారంలో ఒమేగా త్రీ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. ముఖ్యంగా అతడు అవిస గింజలు వాల్నట్వంటి వాటిని తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
నరాల నొప్పి బలహీనత మరీ అధికంగా ఉంటే ఆముదం నూనె తోటి మసాజ్ చేసుకొని గోరువెచ్చటి నీటితో కాపడం పెట్టుకున్నట్లయితే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
నరాల బలహీనత అధికంగా ఉన్నప్పుడు వేడి వేడి నీటిలో ఉప్పు కలిపి ఆ నీటిలో కాళ్లు కొద్దిసేపు ఉంచినట్లయితే మీకు ఈ నరాల నొప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి