Blood Sugar Levels: బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసే ఆరు అద్భుతమైన ఆహారాలు ఇవే! ఈ ఫుడ్స్ తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ మీ కంట్రోల్‌లోనే ఉంటాయ్..

అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, బీన్స్, గింజలు, విత్తనాలు లేదా టోఫు, చేపలు మరియు సముద్రపు ఆహారం, చికెన్ , ఇతర పౌల్ట్రీ, గుడ్లు మరియు తక్కువ కొవ్వు పాలు, మొక్కల ఆధారిత ప్రోటీన్లు మధుమేహం ఉన్నవారికి మంచి ఆహారాలుగా సూచించబడ్డాయి. మధుమేహం ఉన్నవారు తమకు నచ్చిన ఆహారాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు.

Immunity Boosting Food (Photo Credits: Pixabay)

Hyderabad, April 02:  పోషకాలు లేని ఆహారం, జీవనశైలి టైప్ 2 డయాబెటిస్ (Diabetics) పెంచుతాయి. బ్లడ్ షుగర్ అనేది శరీరంలో ఇంధనం లాంటిది. మెదడు, నాడీ వ్యవస్ధ, శరీరంలోని ఇతర అవయవాల పనితీరుకు తోడ్పతుంది. రక్తంలో చక్కెర (Blood Sugar) పదార్ధాల నుండి కొవ్వు, కార్బోహైడ్రేట్లు , ప్రొటీన్ (Protein)నుండి ఉత్పత్తి అవుతుంది. శరీరంలో చక్కెర స్ధాయి ఒక సాధారణ పరిమాణంలో మాత్రమే ఉండాలి. అయితే కొంత మందిలో ఎక్కవగా, మరికొందరిలో తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర మోతాదులు అధికంగా ఉంటే తగ్గించాలి. లేదంటే డయాబెటిస్ బారిన పడతారు. అంతేకాకుండా నరాలు దెబ్బతినటం, కిడ్నీ వైఫల్యాలు (Kidney Failure) ,గుండె జబ్బులు వంటి జబ్బుల బారినపడే అవకాశాలు ఉంటాయి.

సరైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా అనగా ఫైబర్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ద్వారా మెటబాలిక్ డిజార్డర్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు. ఊబకాయం వంటి అనేక జీవనశైలి వ్యాధులు రాకుండా జాగ్రత్తపడవచ్చు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, బీన్స్, గింజలు, విత్తనాలు లేదా టోఫు, చేపలు మరియు సముద్రపు ఆహారం, చికెన్ , ఇతర పౌల్ట్రీ, గుడ్లు మరియు తక్కువ కొవ్వు పాలు, మొక్కల ఆధారిత ప్రోటీన్లు మధుమేహం ఉన్నవారికి మంచి ఆహారాలుగా సూచించబడ్డాయి.

Salads for Weight Loss:సలాడ్స్‌లో ఇవి తింటున్నారా? అయితే అస్సలు బరువు తగ్గరు, సలాడ్స్ విషయంలో చాలా మంది చేస్తున్న తప్పులు ఇవే, ఈజీగా బరువు తగ్గేందుకు ఇలా తినండి

మధుమేహం ఉన్నవారు తమకు నచ్చిన ఆహారాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. తినే ఆహారాన్ని సమతుల్యం చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ప్రభావవంతంగా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాలు , పౌష్టికాహార సమతుల్య ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొన్ని ఆహారాలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్ధాయిలు సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

చక్కెర స్ధాయిలను నియంత్రణలో ఉంచే ఆహారాలు;

తృణధాన్యాలు: ఇవి విటమిన్లు ,ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ యొక్క గొప్ప మూలాన్ని కూడా కలిగి ఉంటాయి. సంక్లిష్ట పిండి పదార్థాలను కలిగి ఉంటాయి. జీర్ణక్రియలోను ఎంతో సహాయపడతాయి. బ్లాక్ వీట్, బార్లీ, ఓట్స్, క్వినోవా, రాగి వంటి తృణధాన్యాలను తీసుకోవటం మంచిది. వీటివల్ల మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: వీటిలో విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి . ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బచ్చలికూర, పాలకూర, ఉసిరి ఆకులు వంటి ఆకుకూరల్లో కార్బోహైడ్రేట్లు మరియు కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని సలాడ్‌లు, సూప్‌లుగా భోజనానికి ముందు తీసుకోవటం మంచిది.

నట్స్: నట్స్ ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలం. బాదం,వాల్‌నట్ వంటి నట్స్‌లో ఒమేగా-3 మరియు ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. వేపిన గింజలు అల్పాహారంగా తీసుకోవటం మంచిది.

Health Tips: వీర్య కణాలు పెరగాలంటే ఏం చేయాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, స్పెర్మ్ కౌంట్ పెరుగుదలకు..స్పెర్మ్ నాణ్యతకు తీసుకోవాల్సిన ఆహార పదార్డాల లిస్ట్ ఏమిటో ఓ సారి తెలుసుకోండి

చేపలు, చికెన్, గుడ్లు: చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, ఎసెన్షియల్ ఆయిల్ పుష్కలంగా ఉంటాయి. చికెన్, గుడ్లు , చేపలు ప్రోటీన్ యొక్క మంచి మూలంగా చెప్పవచ్చు. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. అదనపు కేలరీలను నివారించడానికి గ్రిల్ చేసుకుని తినటం మంచిది. ఆకలిని అరికట్టడంలో వీటిలో ఉండే ప్రోటీన్ సహాయపడుతుంది, ఎక్కువ గంటలు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది.

పెరుగు, చీజ్: అవి ప్రోటీన్, కాల్షియం మరియు విటమిన్ డి యొక్క మంచి మూలం. కొవ్వు,పిండి పదార్థాలు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులను ఆహారంగా ఎంచుకోవాలి. పుదీనా మజ్జిగ , తక్కువ కొవ్వు తో కూడిన పెరుగు వంటి వాటిని తీసుకోవటం మంచిది.

బెర్రీలు వంటి తాజా పండ్లు: బెర్రీలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు సూపర్ ఫుడ్‌గా చెప్పవచ్చు. వాటిలో విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాపిల్, బెర్రీలు , పియర్ వంటి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వాటిని సలాడ్‌లుగా, స్మూతీస్‌లో లేదా పెరుగులో తీసుకోవచ్చు. పుదీనా మజ్జిగ , తక్కువ కొవ్వు తో కూడిన పెరుగు వంటి వాటిని తీసుకోవటం మంచిది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now