Hyderabad, April 02:  బరువు తగ్గాలనుకునే వ్యక్తులు ప్రోటీన్(Protein), ఇతర పోషకాలతో కూడిన ఆహారాన్ని స్వీకరించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం బరువు తగ్గడానికి (weight loss) వర్కవుట్‌లకు శక్తిని అందించడమే కాకుండా, మీ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఉన్నవారు చాలా మంది సలాడ్స్​ను ఉపయోగిస్తారు. అయితే సలాడ్ లు (Salads) తయారు చేసే విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలో తెలియకపోవటం వల్ల బరువు పెరగటానికి కారణమయ్యే వాటిని సలాడ్ లలో మిక్స్ చేస్తుంటారు. ఇలాంటి తప్పుల వల్ల బరువు తగ్గటం సంగతి పక్కన పెట్టి బరువు పెరిగుతూ ఇబ్బందులు కొనితెచ్చుకుంటుంటారు.సలాడ్ లు తయారు చేసే సమయంలో యాడ్​ చేయవలసినవి ఏంటో.. చేయకూడనివి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సలాడ్ అనేది ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉండాలి. దానికి అనారోగ్యకరమైన పదార్థాలు జోడిస్తే..వాటిని తీసుకోవటంలో పెద్ద అర్ధమే ఉండదు. సలాడ్‌లు తీసుకోవాలంటే వాటిలో ఫైబర్(Fiber), విటమిన్‌లను ఉండేలా చూసుకోవాలి. సలాడ్స్ సహజంగా ఆరోగ్యకరమైనవి. వాటికి అనవసరమైన కేలరీలను జోడించకూడదు. రుచితోపాటు, చూసేందుకు బాగుండాలి అనే ఉద్దేశంతో సలాడ్స్​పై డ్రెస్సింగ్‌ చేయడం వంటివి చేస్తుంటారు చాలా మంది. ఇలా చేయటం వల్ల అదనపు ట్రాన్స్ ఫ్యాట్స్​ను శరీరానికి అందించిన వారమౌతాం. వెన్న, చీజ్ వంటి పాల ఉత్పత్తులను నిషేధించాలి. ఎందుకంటే ఇది అనారోగ్యకరమైన కొవ్వులు, అదనపు కార్బోహైడ్రేట్లను సలాడ్స్​కు ఇస్తుంది. కాబట్టి వాటిని ఎట్టిపరిస్ధితుల్లో వాడకుండా ఉండటమే మంచిది.

Health Tips : Cauliflower కాలి ఫ్లవర్ రెగ్యులర్ గా తింటున్నారా..అయితే వీళ్లకు విషంతో సమానం అంట, ఎవరంటే..?

ప్రోటీన్ కోసం సలాడ్‌లలో చాలా మంది మాంసాన్ని(meat) చేర్చుతారు. అయితే ఇది ఏమాత్రం సరైంది కాదు. కొవ్వు పదార్ధాలు ఎక్కువగా ఉండటం వలన ఇది చాలా అనారోగ్యాన్ని కలిగిస్తుంది. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారికి ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది అదనపు క్యాలరీలను శరీరంలో చేరుస్తుంది.

Health Tips: వీర్య కణాలు పెరగాలంటే ఏం చేయాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, స్పెర్మ్ కౌంట్ పెరుగుదలకు..స్పెర్మ్ నాణ్యతకు తీసుకోవాల్సిన ఆహార పదార్డాల లిస్ట్ ఏమిటో ఓ సారి తెలుసుకోండి

వీటికి బదులు పప్పుధాన్యాలతో రిప్లేస్ చేయవచ్చు. డ్రై ఫ్రూట్స్, నట్స్‌ సలాడ్స్​కు అపారమైన ఫైబర్‌ను అందిస్తాయి. వీలైనంత ఎక్కువగా పచ్చిగా తినగలిగే కూరగాయలను సలాడ్స్​లో చేర్చడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు బీట్‌రూట్‌లు సలాడ్‌కు రంగును జోడించడమే కాకుండా ఐరన్​తో నిండి ఉంటాయి. అదేవిధంగా, పండ్లు, తేనెతో సహా సహజ తీపి పదార్థాలు వాడితే మంచిది. ఇవి పోషక విలువలను మెరుగుపరుస్తాయి. ప్రోటీన్ల కోసం మాంసానికి బదులుగా పప్పులు, మొలకలు, బీన్స్‌లను చేర్చడం కూడా మంచిదే. గుమ్మడికాయ గింజల వంటి విత్తనాలను జోడించడం వల్ల సలాడ్‌లో క్రంచ్‌తో పాటు పోషకాహారం కూడా పెరుగుతుంది.