Covid Heart Attack: కరోనాతో గుండెపోటుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆరోగ్యమంత్రి, కోవిడ్‌కి హార్ట్ ఎటాక్‌కి సంబంధంపై రెండు నెలల్లో నివేదిక వస్తుందని వెల్లడి
కోవిడ్‌కి గుండెపోటుకి సంబంధం ఉందా అనే విషయం కనుగొనడంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పరిశోధనలు ప్రారంభించిందని, రెండు, మూడు నెలల్లో దీని ఫలితాలు వస్తాయని చెప్పారు.
యువకుల నుంచి చిన్న పిల్లల వరకు ఈ మధ్య హార్ట్ ఎటాక్ తో మరణించడంపై కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవియా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యువ కళాకారులు, క్రీడాకారులు ప్రదర్శన చేస్తుండగా స్టేజిపైనే గుండెపోటుతో కుప్పకూలిని పలు ఘటనలు మనందరం చూశాం.
ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే.. కోవిడ్‌తో బాధపడ్డ యువకులే గుండెపోటుకు గురై చనిపోయినట్లు కొన్ని ప్రాంతాల నుంచి పలు నివేదికలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో కోవిడ్‌కి గుండెపోటుకి సంబంధం ఉందా అనే విషయం కనుగొనడంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పరిశోధనలు ప్రారంభించిందని, రెండు, మూడు నెలల్లో దీని ఫలితాలు వస్తాయని చెప్పారు.
ఈ కరోనా వైరస్ పరివర్తన చెందతూనే ఉంది. ఇప్పటి వరకు 231 రకాల వేరియంట్‌లను గుర్తించారు. మరోవైపు గత కొద్ది నెలలుగా అనుహ్యంగ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందుకు తగిన విధంగ ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరా, తదితరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ కేసుల గురించి వారానికోసారి సమీక్ష జరుగుతోంది. ఐతే ఈ కోవిడ్ ఎలా ప్రవర్తిస్తుందో అంచనా వేయడం అసాధ్యం అని, ప్రస్తుతం పెరుగుతున్న కేసులు మాతకనం అంత ప్రమాదకరమైనవి కాదన్నారు. ఏదిఏమైనా కరోనా నాల్గో వేవ్ గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
కోవిడ్ వేరియంట్ బీఎఫ్7 సబ్ వేరియంట్, ఎక్‌బీబీ1.16 సబ్ వేరియంట్‌లే ఈ కరోనా కేసులు ఉధృతికి కారణం ఇప్పటి వరకు కొత్త వేరియంట్‌ని గుర్తించినప్పుడల్లా ల్యాబ్‌లో గుర్తించి, వ్యాక్సిన్‌ల సామార్థ్యాన్ని అధ్యయన చేస్తాం. ఇప్పటి వరకు వ్యాక్సిన్‌లు అన్ని వేరియంట్‌లకు వ్యతిరేకంగా పనిచేశాయి. "అని మాండవియా చెప్పుకొచ్చారు.