Love Making Tips: సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఈ తప్పులు చేయవద్దంటున్న నిపుణులు, నేరుగా అక్కడికి వెళితే ఇద్దరికీ తృప్తి ఉండదు, కోరికలు ఎక్కువ సేపు ఉండాలంటే ఏం చేయాలో..వారేం చెబుతున్నారో తెలుసుకోండి
శృంగార విషయంలో ఎన్నో ఆరోగ్య ఇబ్బందులు, సమస్యలు (Difficulties, Problems) ఉన్నా వాటి గురించి చర్చించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వారి శృంగార సమస్యలను బయటకు తెలియపరచడానికి సిగ్గు పడుతూ ఉంటారు.
వివాహబంధం తరువాత భార్యాభర్తల మధ్య శృంగారం (Sex) ఆరోగ్యానికి మంచిదని సైకాలజిస్ట్ చెబుతున్నారు. శృంగార విషయంలో ఎన్నో ఆరోగ్య ఇబ్బందులు, సమస్యలు (Difficulties, Problems) ఉన్నా వాటి గురించి చర్చించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వారి శృంగార సమస్యలను బయటకు తెలియపరచడానికి సిగ్గు పడుతూ ఉంటారు. ఈ సమస్యలకు డాక్టరు (Doctor) సరైన సూచనలు ఇస్తారని అవగాహన (Awareness) కూడా వారిలో ఉండదు. సరైన అవగాహన లేక శృంగార జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. లైంగిక విషయంలో శారీరక (Physically ), మానసిక (Psychological) పరిస్ధితులు ఎదురైనపుడు వైద్యపరమైన జాగ్రత్తలు చాలా అవసరం.
లైంగిక సమస్యలు ఉండటం వల్ల భార్యాభర్తలిద్దరికి (Both spouses) శృంగారంలో సంతృప్తి ఉండదు. దాంతో వారికి నిరాశే ఎదురవుతుంది. లైంగిక సమర్థత ఒక వ్యక్తి యొక్క ఆత్మ విశ్వాసాన్ని (Self-confidence) కోల్పోయేలా చేస్తుంది. జ్ఞానం లేకనో లేదా సమయం లేకనో చాలామంది, ఫోర్ప్లె చేయకుండా, నేరుగా సంభోగం చేస్తారు. ఇది ముఖ్యంగా స్త్రీలలో, ఉద్రేకం పెంచడంలో చాలా అసమర్ధతను నిరూపిస్తుంది. ఫోర్ప్లె అంటే ముద్దులు, ఒకరి జననాంగాలను ఒకరు ఉద్రేక పరుచుకోవడం వంటివి ముఖ్యమైన స్ధాయిలో ప్రేరేపణను పెంచుతాయి.
మీ భాగస్వామితో లైంగిక సంపర్కం లేదా ఫోర్ప్లె చేసేటపుడు, మంచంపై మీరు ఎలా నిర్వహిస్తున్నారు, మీ భాగస్వామిని ఎలా ప్రేమిస్తారు అనేదాని గురించి చింతించకండి. ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసి, ప్రేరేపణను తగ్గిస్తుంది. మీ భావాలను ప్రేరేపించి, అనుభూతులను ఆనందించే విషయాలపై దృష్టి పెట్టండి. శృంగారంలో పాల్గొనేటప్పుడు ఫోర్ ప్లే (Foreplay), ఓరల్ సెక్స్ (Oral Sex) చేసుకుంటే శృంగార కోరికలు ఎక్కువ సేపు ఉంటాయి. పడక గదిలో వారి ఇష్టాయిష్టాలను (Preferences) తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తించాలి. ఇలా చేయడం వల్ల వారి మధ్య ఉన్న అవరోధాలు (Obstacles) తొలగిపోయి శృంగార జీవితం సాఫీగా సాగుతుంది.
భార్యాభర్తలిద్దరూ ఎక్కువ సేపు ఏకాంతంగా కాలం గడపడానికి ప్రయత్నించాలి. శృంగార జీవితానికి ప్రత్యేక సమయాన్ని (Time) కేటాయించాలి. శృంగారం అనేది ఒత్తిడిని తగ్గిస్తుంది. మీలో ఇలాంటి లైంగిక సమస్యలు ఉన్నట్లయితే డాక్టర్ (Doctor) ను సంప్రదించండి శృంగార జీవితానికి వ్యాయామం ఎంతో అవసరం.రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా జననాంగాలలో (Genitals) రక్త ప్రసరణను పెంచుతుంది. శరీరం దృఢంగా (Firmly) మారడం వల్ల శృంగార జీవితం సాఫీగా జరుగుతుంది. స్ట్రాబెర్రీ, డార్క్ చాకోలేట్స్, వెల్లుల్లి వంటి ఆహార పదార్ధాలు మీ ఆహారంలో ఉండేట్టు చూసుకోండి. ఈ పదార్ధాలు సంభోగ సమయంలో జననాంగాలకు ఆక్సిజేనేటేడ్ (Oxygenated) రక్త ప్రసారాన్ని పెంచుతాయి, దీంతో మీ అనుభూతి (Feel) ఎంతో ఆరోగ్యంగా, మంచిగా ఉంటుంది.
పడక దగ్గర మీ ఇష్టాలు, అయిష్టాల గురించి మీ భాగస్వామితో తప్పక మాట్లాడండి. అదేవిధంగా, మీ భాగస్వామి శృంగార రుచులు, ఆశక్తుల గురించి తెలుసుకోండి. ఇది మీ లైంగిక జీవితంపై ప్రయోగిస్తే, మీ శృంగార జీవితం స్పైసీ గా ఉండి, శృంగార అవరోధాలను తొలగించుకోవచ్చు. మీరు మీ భాగస్వామితో శృంగార సంపర్కానికి సమయాన్ని కేటాయించడంలో సమస్యలు ఎదుర్కుంటుంటే, ప్రతి వారం కొంత సమయాన్ని కేటాయించండి, ముఖ్యంగా దానికోసం. ఎందుకంటే, ఎక్కువ కాలం శృంగార సంపర్కం జరగకపోతే, భాగస్వాముల మధ్య విభేదాలు ఏర్పడి, అంగస్తంభనకు కారణమవుతుంది!
సంభోగం సమయంలో మీ ఫోన్ లను లేదా ఇతర సంబంధంలేని సంభాషణలు మానుకోండి. ఇది మీ మనసుని స్థిరంగా ఉంచి, మీరు పూర్తిగా పనిలోనే ఉన్నట్టు మీ భాగస్వామికి తెలుస్తుంది, తద్వారా ఎటువంటి అడ్డంకులు లేకుండా, ప్రేరేపణ స్థాయిలు అభివృద్ది చెందుతాయి. మీ భాగస్వామితో సంభోగంలో పాల్గొనే ముందు జననాంగాల జోలికి వెళ్ళకండి. సంభోగానికి ముందు వాటివైపు వెళ్తే క్లైమాక్స్ కి చేరుకుంటారు, ఇది మీ భాగస్వామితో శృంగార సమయంలో ప్రేరేపణ, స్ఖలనం కష్టమవుతాయి.
చివరిగా, మీరు సంభోగ సమయంలో మీకు ఇష్టంలేని పనులను వత్తిడితో చేయకండి. అది మీ భాగస్వామిని ప్రేరేపించే మంచి పని అయినప్పటికీ, కొత్తవాటిని ప్రయత్నించడం, మీ స్వంత నియంత్రణలు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీకు ఇష్టం లేని పనులు చేయడం వల్ల ప్రేరేపణ కూడా తగ్గవచ్చు.