ఎక్కువ కాలం ఒంటరితనంతో ఉన్న వారు మానసిక, శారీరక అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. ఏళ్ల తరబడి ఒంటరిగా జీవించడం, వరుసగా సంబంధాలు తెగిపోవడం (Living alone and divorce linked) జరిగినప్పుడు అలాంటివారి రక్త కణాల్లో తేడాలు వస్తాయని, ఇది క్రమంగా రకరకాల అనారోగ్యాలకు దారితీస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే, ఈ పరిస్థితి కేవలం ఒంటరి మగవాళ్లలో మాత్రమే కనిపిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఆడవారిలో ఉండకపోవచ్చని అధ్యయనం తెలిపింది.
జర్నల్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్‌లో ఈ నూతన అధ్యయన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఒంటరితనంవల్ల కనిపించే ఈ ఇన్‌ఫ్లమేషన్‌ను ( inflammation in men) లో గ్రేడ్ ఇన్‌ఫ్లమేషన్‌గా వర్గీకరించారు. ఇది నిరంతరం కొనసాగుతుందని, వయసు సంబంధ అనారోగ్యాలకు, మరణాలకు (Men living alone at higher risk) ఈ ఇన్‌ఫ్లమేషన్ దారితీస్తుందని తెలిపారు. జీవిత భాగస్వామితో విడాకులు తీసుకోవడం లేదంటే ఆమెతో తరచూ సంబంధాలను తెంచుకుంటూ ఎక్కువకాలం ఒంటరిగా జీవించడం వల్ల బలహీనమైన శారీరక, మానసిక స్థితిలోకి వెళ్లిపోతారు.
ఉదయం అల్పాహారంలో వీటిని తీసుకుంటే, డయాబెటిస్ దగ్గరకు రమ్మన్నా రాదు, ఓ లుక్కేయండి..
అలాగే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, మరణాలు సంభవించడం లాంటి ఉపద్రవాలు ముంచుకొస్తున్నాయని అధ్యయనకారులు తెలిపారు. మొత్తం 4,835 మందిపై పరిశోధన చేసి నివేదికను తయారుచేశారు. అంతా 48 ఏండ్ల నుంచి 62 ఏండ్ల మధ్య వయసు ఉన్నవారిని పరిశోధన కోసం ఎంచుకున్నారు.