Immunity Boosting Food (Photo Credits: Pixabay)

ఉదయం అల్పాహారం చేయకుండానే తొందర తొందరగా ఆఫీసులకీ, కాలేజీకి చాలా మంది వెళ్తుంటారు. ఉదయం అల్పాహారం తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే ఆ రోజుకు సరిపడ శక్తిని ఇస్తుంది. అయితే తీసుకునే అల్పాహారం రోజు ఇతరత్రా రుచుల మీదకు మనసు మళ్లకుండా నియంత్రించేలా ఉండాలి. అందుకు ఎలా ఉండేలా చూసుకోవాలో చూద్దాం! తక్కువ పోషకాలతో కూడిన అల్పాహారం తీసుకోవడం మూలంగా అడ్రినల్ గ్రంథి ఒడిదొడుకులకు లోనవుతుంది. దాని పర్యవసానాలైన బరువు పెరగడం, చర్మపు ముడతలు, తరచుగా నీరసించిపోవడం, నిస్సత్తువ మొదలైన ఇబ్బందులు తలెత్తుతాయి.

తూర్పుగోదావరిలో విషాదం, కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి, మరొకరి పరిస్థితి విషమం

కాబట్టి అల్పాహారంలో పీచు, మాంసకృత్తులు, కొవ్వులు సమంగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి అల్పాహారం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు సమంగా ఉంటాయి. ఫలితంగా అడ్రినల్ గ్రంథి కార్టిసాల్ స్రావం విడుదల కోసం పని చేసే పరిస్థితి తప్పుతుంది. ఫలితంగా తీపి తినాలనే కోరిక తలెత్తదు. అల్పాహారంలో మాంసకృత్తులు ఉండేలా చూసుకుంటే అవి శరీరంలోని హార్మోన్ల పనితీరును రోజంతా నియంత్రణలో ఉంచుతాయి. కాబట్టి అల్పాహారంలో చికెన్, చేపలు, బాదం వంటివి తీసుకోవాలి. క్యాన్స్‌లో నిల్వ చేసిన రెడీమేడ్ పదార్థాలకు బదులు తాజాగా తయారుచేసుకున్న పదార్థాలే తినాలి.