Liver Problems: కాలేయాన్ని పాడు చేసే పదార్థాలు, లివర్‌ని కాపాడే ఆరోగ్య పదార్థాలు ఇవే, ఏవి తినాలి, ఏవి తినకూడదనే దానిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఓ సారి తెలుసుకోండి
World Liver Day is observed to create better awareness about liver diseases. (Photo credits: Pixabay)

కాలేయం అనేది మన శరీరంలో ముఖ్య అవయవం. దీన్ని ఆరోగ్యంగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్ల కారణంగా త్వరగా కాలేయం (Liver Problems) దెబ్బతింటుంది. అలా కాకుండా లివర్ హెల్దీగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు (What Foods to Eat ) తీసుకోవాలి అనేక కారణాల వల్ల కాలేయ సమస్యలు చుట్టు ముడతాయి. కొన్ని సార్లు ప్రమాదకర సమస్యలు కూడా వస్తాయి. వీటన్నింటిని ట్రీట్‌మెంట్‌తో సరిచేసుకోవచ్చు. కొన్ని ఆహార పదార్థాలను తినడం వల్ల (What Foods to Avoid) లివర్ ఆరోగ్యం బాగుంటుంది.

ఈ రోజుల్లో ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినడం అలవాటైంది. జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపడమే కాకుండా ఊబకాయం కూడా వస్తుంది. దీనివల్ల కాలేయానికి తీవ్ర నష్టం (Liver Disease) వాటిల్లుతుంది. ఇది సిర్రోసిస్‌కు దారి తీస్తుంది. లివర్ సిర్రోసిస్ కారణంగా, కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి వాటి వినియోగానికి దూరంగా ఉండాలి. సోడా, ఇతర కార్బోనేటేడ్ పానీయాలు తీవ్రమైన కాలేయ సమస్యలను కలిగిస్తాయి. ఇది కాలేయ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. అదే సమయంలో, ఈ కార్బోనేటేడ్ పానీయాలు కూడా ఊబకాయం సమస్యకు దోహదం చేస్తాయి. చక్కెర నూనె, పిండి వంటి శుద్ధి చేసిన ఉత్పత్తులు కూడా కాలేయానికి హానికరం. ఈ పదార్థాలు శరీరంలో క్యాన్సర్ సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. కనుక ఇలాంటి పదార్థాలకు దూరంగా వుండాలి.

ఉదయం తేనే, నిమ్మకాయ రసం నీళ్లను తాగతే ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు, నిమ్మ కాయ రసం, తేనే లాభాలు ఇవే

లివర్ ను కాపాడే పదార్థాల విషయానికి వస్తే.. ఓ స్ట్రాంగ్ కాఫీ తాగితే చాలు ఎంతో రిలాక్స్ అవుతాం. కొన్ని రోజులుగా కాఫీపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు కాఫీని తాగడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని తేల్చారు. కాఫీలోని ప్రత్యేక గుణాలు లివర్ క్యాన్సర్ రాకుండా చూస్తాయని తేలింది. కాబట్టి కాఫీని రెగ్యులర్‌గా తాగడం అలవాటు చేసుకోండి. టీలోనూ ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. ఈ టీని తాగడం కాస్తా ఒత్తిడిగా ఫీల్ అయినప్పుడు రిలాక్స్ అవుతామని తెలుసు. కానీ, కాలేయాన్ని కాపాడడంలో టీ కూడా కీ రోల్ పోషిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

ద్రాక్షలోనూ ఎన్నో అద్భుత గుణాలు ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ లివర్‌ని రక్షిస్తాయి. కాబట్టి వీటిని కూడా మీ డైట్‌లో చేర్చుకోండి. వెల్లుల్లిలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలోని ట్యాక్సిన్స్ అన్నీ తొలగిపోతాయి. ఘాటైన వెల్లుల్లిలో కొలెస్టిరాల్‌ని తగ్గిస్తుంది. దీనిని తినడం వల్ల క్యాన్సర్ నిరోధిస్తుంది. దీనిని తినడం వల్ల కాలేయం ఆరోగ్యం బాగుంటుంది. కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది , కాలేయ ఆరోగ్యానికి, కీళ్ళనొప్పులు తగ్గడానికి పనికివస్తుంది.

మగవారు ఒంటరిగా జీవించడం చాలా డేంజర్, ఒంట‌రిత‌నం వ‌ల్ల క‌నిపించే ఇన్‌ఫ్ల‌మేష‌న్‌ అనారోగ్యాల‌కు, మ‌ర‌ణాలకు దారి తీస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడి

బీట్ రూట్, క్యారెట్, బంగాళా దుంపల్లో కాలేయ కణాల పునరుత్పత్తికి ఉపయోగపడపడే ఎన్నో గొప్ప గుణాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రతీరోజూ వీటిని మీ డైట్‌లో చేర్చుకుంటే కాలేయ పనితీరు మెరుగవుతుంది. ఫైబర్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండి, సోడియం, పొటాషియం తక్కువగా ఉండే ఆపిల్స్‌ కూడా కాలేయాన్ని కాపాడతాయి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. యాపిల్ తొక్క, లోపలి గుజ్జులోనూ పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది గ్యులాక్టురోనిక్ యాసిడ్ తయారీకి దోహదపడుతుంది. యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా తినొచ్చు.

శరీరానికి కావాల్సిన ఎన్నో ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి. వీటిలో కొవ్వు శాతం కూడా తక్కువగా ఉంటుంది. ప్రతీరోజూ వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు బయటికి వెళ్లిపోతాయి. క్యాబేజీ కూడా కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మీ కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని ప్రత్యేక గుణాలు మీ లివర్‌ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి వీటిని కూడా మీ డైట్‌లో భాగం చేసుకోవడం మరిచిపోవద్దు.

గుడ్ ఫ్యాట్స్, ఎన్నో పోషకాలు ఉండే నట్స్ కూడా లివర్‌ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ అన్నీ కూడా లివర్‌ని కాపాడతాయి. కాబట్టి రెగ్యులర్‌గా వీటిని మీరూ తీసుకోవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలు కూడా లివర్‌ని కాపాడతాయి. వీటిని తినడం వల్ల గుండెకి మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఎన్నో ఆరోగ్య గుణాలు ఆలివ్ ఆయిల్‌లో దాగి ఉంటాయి. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ ఆయిల్ కూడా లివర్ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందని తేలింది.