COVID19 in TS: జలుబు చేసిన వారికి కరోనా సోకితే ఏమవుతుంది? తెలంగాణలో కొత్తగా 453 కరోనా కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో మరో 614 మంది రికవరీ
బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ (ISGlobal) పరిశోధకుల అధ్యయనం ప్రకారం సార్స్ వ్యాధి లేదా మరేదైనా జలుబు లాంటి అస్వస్థతకు గురైన వారి శరీరంలో అభివృద్ధి చెందిన యాంటీబాడీలు...
Hyderabad, August 9: సాధారణ జలుబు సోకిన వారి వ్యక్తుల్లో తయారయ్యే యాంటీబాడీలు కరోనావైరస్‌కు కూడా కొంతమేర ప్రతిరక్షకాలుగా కూడా పనిచేస్తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ (ISGlobal) పరిశోధకుల అధ్యయనం ప్రకారం సార్స్ వ్యాధి లేదా మరేదైనా జలుబు లాంటి అస్వస్థతకు గురైన వారి శరీరంలో అభివృద్ధి చెందిన యాంటీబాడీలు కోవిడ్ మహమ్మారిపై కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఈ రకమైన యాంటీబాడీస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి అదనపు రక్షణ కవచంలా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం, కరోనావైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా IgG యాంటీబాడీల స్థాయిలు ఏడు నెలల తర్వాత స్థిరంగా ఉంటాయని లేదా పెరుగుతాయని కూడా చూపించింది. దీని ప్రకారం అప్పుడప్పుడు జలుబు చేయడం ద్వారా కరోనాకు వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీస్ శరీరంలో తయారవుతాయని తాజా అధ్యయనం ఆధారంగా చెప్పవచ్చు.
ఇక, ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 80,658 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 453 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1,843 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,49,859కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 68 కేసులు నిర్ధారణ కాగా, కరీంనగర్ నుంచి 43, వరంగల్ అర్బన్ నుంచి 36, ఖమ్మం జిల్లా నుంచి 33 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 3 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,828కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 614 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,37,789 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,242 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.