Surya Grahan 2022: సూర్యగ్రహణం సమయంలో సెక్స్ చేయవచ్చా, చేస్తే ఏమవుతుంది, నిపుణులు ఏమంటున్నారు, సూర్యగ్రహణం సమయంలో అపోహలు ఏంటో చూద్దాం
అయితే ఈ పాక్షిక సూర్యగ్రహణాన్ని (Surya Grahan 2022) మన దేశంలో ఈ గ్రహణాన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వీక్షించగలం. ఈ గ్రహణాన్ని అరుదైన ఖగోళ విచిత్రంగా చెప్పుకోవచ్చని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.
ఈ రోజు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అయితే ఈ పాక్షిక సూర్యగ్రహణాన్ని (Surya Grahan 2022) మన దేశంలో ఈ గ్రహణాన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వీక్షించగలం. ఈ గ్రహణాన్ని అరుదైన ఖగోళ విచిత్రంగా చెప్పుకోవచ్చని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఎందుకంటే చాలా ఏళ్ల వరకు ఇలాంటి గ్రహణం మళ్లీ భారత్ లో కనిపించదు. మన దేశంలో తదుపరి సూర్యగ్రహణం 2027 ఆగస్టు 2న కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈనాటి గ్రహణం మన దేశంలో జైపూర్, నాగ్ పూర్, ద్వారక, చెన్నై, ముంబై, కోల్ కతా నగరాల్లో కనిపిస్తుంది. అయితే, ఈ ప్రాంతాల్లో కూడా మసకబారిన 43 శాతం సూర్యుడిని మాత్రమే చూడగలము.
సూర్యగ్రహణం (solar eclipse) సాయంత్రం 4.29 గంటల నుంచి 6.26 గంటల వరకు కొనసాగుతుంది. హైదరాబాద్ లో సాయంత్రం 4.59 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. ఢిల్లీలో సాయంత్రం 4.29, కోల్ కతాలో 4.52, చెన్నైలో 5.14, ముంబైలో 4.49, ద్వారకలో 4.36, తిరువనంతపురంలో 5.29, నాగ్ పూర్ లో 4.49 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. మరోవైపు, గ్రహణాన్ని నేరుగా కంటితో చూడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక మన పెద్ద వాళ్లు గ్రహణం రోజు సూర్యుణ్ని, చంద్రుణ్ని పాములు మింగేస్తాయని చెబుతుండే వారు. ఇంట్లో ఎవరైనా గర్భంతో ఉంటే వాళ్లను ఇంట్లోనూ కూర్చోబెట్టేవాళ్లు. బయటకు రానిచ్చేవారు కాదు. అయితే వారు ఆ సమయంలో బయట తిరిగినా కూడా ఏమీ కాదని నిపుణులు చెబుతున్నారు.పెద్దలు గ్రహణం సమయంలో అన్నం వండటం కానీ తినడం కానీ చేయకూడదని, గ్రహణానికి రెండు గంటల ముందే భోజనం ముగించాలని చెబుతుంటారు.అయితే ఇందులో వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు.
ఇక గ్రహణం సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది సెక్స్ లో పాల్గొనకూడదనేది పెద్దవాళ్లు చెప్పేమాట. అయితే ఇది కూడా అబద్దమే. అలాగే గ్రహణాలకు మనుషుల రోజూవారీ జీవిత కార్యకలాపాలకు సంబంధం లేదు. ఎవరికి ఇష్టమైన పనులు వారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గ్రహణం రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న నియమాలు అనాదిగా వస్తున్నాయని, వాటిని మూఢ నమ్మకాలంటూ కొట్టిపారేయడం సరికాదని ఆ నమ్మకాలను విశ్వసించే వారు చెబుతున్నారు.ఏది నమ్మాలి ఏది నమ్మకూడదనేది మీరు మీ మనస్సాక్షిని బట్టి తెలుసుకోవడం ఉత్తమమమనేది మా అభిప్రాయం.