Cancer Cases in India: దేశంలో నిశ్శబ్దంగా క్యాన్సర్ విజృంభణ, 2025 నాటికి క్యాన్సర్ కేసులు 15.7 లక్షలకు పెరిగే అవకాశం, ఐసీఎంఆర్ పరిశోధనలో వెల్లడి, పొగాకు వాడకమే కారణం
కరోనా కేసులతో పాటు ఇతర వైరల్ వ్యాధులు దేశ ప్రజలకు నిదర లేకుండా చేస్తోంటో, తాజాగా క్యాన్సర్ (Cancer Cases in India) గురించి ఆందోళనకర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్‌ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్, భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సంయుక్తంగా సంచలన నివేదికను విడుదల చేశాయి.
New Delhi, August 19: దేశంలో కరోనా మాటును పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. కరోనా కేసులతో పాటు ఇతర వైరల్ వ్యాధులు దేశ ప్రజలకు నిదర లేకుండా చేస్తోంటో, తాజాగా క్యాన్సర్ (Cancer Cases in India) గురించి ఆందోళనకర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్‌ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్, భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సంయుక్తంగా సంచలన నివేదికను విడుదల చేశాయి.
రానున్న ఐదేళ్లలో భారత్‌లో క్యాన్సర్ రోగుల సంఖ్య (Cancer Statistics) గణనీయంగా పెరగనున్నట్లు "జాతీయ క్యాన్సర్ నమోదు పట్టిక - 2020" పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో సుమారు 13.9 లక్షల క్యాన్సర్ రోగులుండగా 2025 నాటికి ఇది 15.7 లక్షలకు పెరిగే అవకాశం (Cancer cases rise) ఉందని వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాల్లో పొగాకు వినియోగం ఎక్కువగా ఉండటంతో అక్కడి పురుషులు అధికంగా క్యాన్సర్‌కు గురవుతున్నారు. దీంతో పొగాకు సంబంధిత క్యాన్సర్లు 27.1 శాతంగా ఉన్నాయి. కరోనాకు తోడయిన స్వైన్ ఫ్లూ, దేశంలో ఇప్పటివరకు 2,721 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు, తెలంగాణలో 443 కేసులు నమోదు, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిఫుణులు హెచ్చరిక
అంటే పొగాకు వినియోగం కారణంగా ఒక్క ఈ ఏడాదిలోనే 3.7 లక్షలమంది దీని బారిన పడ్డారు. పురుషుల్లో ఊపిరితిత్తుతలు, కడుపు, అన్నవాహిక క్యాన్సర్ అధికంగా ఉంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్(14.8%), గర్భాశయ క్యాన్సర్(5.4%) ఎక్కువగా వస్తోంది. క్యాన్సర్ బాధితులు ఎక్కువగా మిజోరంలోని ఐజ్వాల్(పురుషుల్లో ఎక్కువగా క్యాన్సర్), అరుణాచల్ ప్రదేశ్‌లోని పపుం పురె(మహిళల్లో అత్యధికంగా క్యాన్సర్) జిల్లాలో, తక్కువగా మహారాష్ట్రలోని ఒస్మానాబాద్, బీడ్ జిల్లాల్లో ఉన్నారు