Coffee Could Lower Risk Of Death: కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్.. రోజూ ఎంచక్కా కాఫీ తాగండి.. మరణ ముప్పును తగ్గించుకొని ఆయుష్షును పెంచుకోండి.. తాజా అధ్యయనంలో వెల్లడి
దీనివల్ల అనారోగ్య సమస్యలు దరిచేరుతాయన్నది. అయితే, ఎక్కువసేపు కూర్చున్నప్పటికీ రోజూ కాఫీ తాగడం వల్ల మరణ ముప్పును తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.
Newdelhi, June 25: కంప్యూటర్ (Computer) పై పనిచేయడం వల్ల ఎక్కువసేపు అదేపనిగా కూర్చోవడం జరుగుతున్నది. దీనివల్ల అనారోగ్య సమస్యలు (Health Issues) దరిచేరుతాయన్నది. అయితే, ఎక్కువసేపు కూర్చున్నప్పటికీ రోజూ కాఫీ తాగడం వల్ల మరణ ముప్పును తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువసేపు కూర్చుని ఉన్నప్పటికీ, రోజూ కాఫీ తాగేవారు వివిధ కారణాల వల్ల చనిపోయే ముప్పు తక్కువగా ఉంటుందని అధ్యయనకారులు వెల్లడించారు. 10 వేలమందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
రోజుకు 2.5 కప్పుల కాఫీతో..
కాఫీ అలవాటు ఉండేవారిలో గుండెపోటుతో మరణించే ముప్పు తక్కువగా ఉందని పరిశోధకులు తేల్చారు. అలాగే, ఎక్కువసేపు కూర్చుని ఉండి కాఫీ తాగని వారితో పోలిస్తే, రోజుకు 2.5 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే వారిలో మొత్తంగా మరణాల ముప్పు తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.