Covid in Children: చిన్నపిల్లల్లో కరోనా లక్షణాలు ఎలా గుర్తించాలి, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలకు ఎప్పుడు పరీక్షలు చేయించాలి, కోవిడ్ సోకిన తల్లి, బిడ్డకు పాలివ్వొచ్చా, డాక్టర్లు చెబుతున్న విషయాలు మీకోసం

ఒకవేళ చిన్నారులు మహమ్మారి బారిన పడితే (Covid-19 in children) తీసుకోవాల్సిన చర్యల గురించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేక మార్గాలు, మార్గదర్శకాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇక మంత్రిత్వ శాఖ ప్రకారం పిల్లల్లో ఎక్కువ మంది లక్షణాలు లేకుండానే మహమ్మారి బారిన పడుతున్నారని.. చాలా తక్కువ కేసుల్లోనే సింప్టమ్స్‌ కనిపిస్తున్నాయని తెలిపింది.

Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, May 15: కరోనావైరస్ మొదటి దశలో పిల్లల్ని టచ్ చేయలేదు. అయితే సెకండ్ వేవ్ లో చిన్న పిల్లలు టీనేజర్లు కరోనా బారీన (Coronavirus in children) పడుతున్నారు. చిన్నారులకు కోవిడ్ సోకుతున్న కేసులు ఇటీవల దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయి.

పిల్లల్లో కోవిడ్ లక్షణాలు ఉన్నాయో లేదో.. ఒకవేళ చిన్నారులు మహమ్మారి బారిన పడితే (Covid-19 in children) తీసుకోవాల్సిన చర్యల గురించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేక మార్గాలు, మార్గదర్శకాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇక మంత్రిత్వ శాఖ ప్రకారం పిల్లల్లో ఎక్కువ మంది లక్షణాలు లేకుండానే మహమ్మారి బారిన పడుతున్నారని.. చాలా తక్కువ కేసుల్లోనే సింప్టమ్స్‌ కనిపిస్తున్నాయని తెలిపింది.

కాగా పిల్లల్లో జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు,రుచి, వాసన కోల్పోవడం, మయాల్జియా(కండరాల నొప్పి, స్నాయువులో నొప్పి), రినోరియా(ముక్కు నుంచి విపరీతంగా నీరు కారడం.. క్రమేణా అది చిక్కని శ్లేష్మంగా మారడం)తో పాటు, కొద్ది మంది పిల్లల్లో జీర్ణశయాంతర సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వీటితో పాటు వాంతులు, విరేచనాలు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటే కచ్చితంగా కరోనావైరస్ సోకిందని అనుమానించాలి. పసివాళ్లు నొప్పిగా ఉందని చెప్పలేరు కాబట్టి వాళ్లు అదే పనిగా ఏడుస్తున్నారంటే నొప్పితో బాధపడుతున్నారని అనుమానించాలి. వీటితో పాటు చర్మం, పెదవులు, గోళ్లు పాలిపోవడం, చిరాకు పడటం, ఆపకుండా ఏడ్వడం వంటి లక్షణాలు కూడా ఈ మధ్య కనిపిస్తున్నాయి.

రెడీ అవుతున్న సింగిల్ డోస్ వ్యాక్సిన్, దేశంలో భారీగా పెరిగిన రికవరీ రేటు, నిన్న ఒక్కరోజే 3,53,299 మంది డిశ్చార్జ్, 3,890 మంది కరోనా కారణంగా మృతి, ఈ నెల 31 వరకు ఛత్తీస్‌గ‌ఢ్‌లో లాక్‌డౌన్

సాధారణంగా పిల్లలు కోవిడ్‌ బారిన పడితే త్వరగానే కోలుకుంటారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక లక్షణాలు కనిపంచని వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందివ్వాలని.. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. విడవకుండా గొంతు నొప్పి, దగ్గు ఉన్నప్పుడు, తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినా, ఆయసం, ఆక్సిజన్‌ లెవల్స్‌ 90 శాతం కన్నా పడిపోయినా, విడవకుండా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి ఉంటే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. జ్వరం ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. ఎందుకంటే, కరోనా లక్షణాల్లో జ్వరం ప్రధానమైంది.

చిన్నారులకు జ్వరంగా ఉంటే ఎప్పుడెప్పుడు, ఎంతెంతుందో రాసిపెట్టండి. అలాగే ఆక్సిజన్ లెవల్స్, పల్స్ రేట్, వాంతులు, విరేచనాలు.. ఇతర వ్యాధి లక్షణాలు ఉంటే అవి కూడా రాసిపెట్టండి. ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వీటిని ఒక చార్టులో నమోదు చేయాలి. అయితే చిన్నారుల్లో వ్యాధి లక్షణాలు కనిపించినా తల్లిదండ్రులు భయపడాల్సిన పని లేదని, పిల్లలు చాలా వేగంగా కోలుకుంటారని డాక్టర్లు చెబుతున్నారు.