Coronavirus Outbreak in India: రెడీ అవుతున్న సింగిల్ డోస్ వ్యాక్సిన్, దేశంలో భారీగా పెరిగిన రికవరీ రేటు, నిన్న ఒక్కరోజే 3,53,299 మంది డిశ్చార్జ్, 3,890 మంది కరోనా కారణంగా మృతి, ఈ నెల 31 వరకు ఛత్తీస్‌గ‌ఢ్‌లో లాక్‌డౌన్
coronavirus in idnia (Photo-PTI)

Amaravati, May 15: దేశంలో నిన్న‌ కొత్త‌గా 3,26,098 మందికి కరోనా నిర్ధారణ (India Coronavirus Updates) అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,53,299 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,43,72,907కు (COVID-19 Cases in India) చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 3,890 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,66,207కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,04,32,898 మంది కోలుకున్నారు. 36,73,802 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 18,04,57,579 మందికి వ్యాక్సిన్లు వేశారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ల పంపిణీ ఓ సమస్యగా మారింది. రెండు డోసుల మధ్య విరామం, వ్యాక్సిన్ల కొరత అధికార యంత్రాంగాన్ని వేధిస్తున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు సింగిల్ డోస్ వ్యాక్సిన్లు రంగప్రవేశం చేయనున్నాయి. అన్నీ కుదిరితే.... అమెరికాకు చెందిన 'జాన్సెన్' (జాన్సన్ అండ్ జాన్సన్), రష్యాకు చెందిన 'స్పుత్నిక్ లైట్' కరోనా వ్యాక్సిన్లు భారత్ లో అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు సింగిల్ డోస్ వ్యాక్సిన్లే.

ముంచుకొస్తున్న తౌక్టే తుఫాను ముప్పు, వాయుగుండంగా మారిన అల్ప పీడనం, ఈ నెల 8న తౌక్టే గుజరాత్ వద్ద తీరం దాటుతుందని అంచనా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన ఐఎండీ

'స్పుత్నిక్ లైట్' చివరి దశ ప్రయోగ ఫలితాలు త్వరలోనే వెల్లడి కానుండగా, జులైలో ఇది భారత్ లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. రష్యాకు చెందిన 'స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ ను భారత్ లో పంపిణి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్... 'స్పుత్నిక్ లైట్' సింగిల్ డోస్ వ్యాక్సిన్ కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. అటు, జాన్సన్ అండ్ జాన్సన్ తన 'జాన్సెన్' సింగిల్ డోస్ వ్యాక్సిన్ కోసం భారత్ లో తగిన భాగస్వామి కోసం అన్వేషిస్తోంది. భారత్ లోనే ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు తగిన వనరులున్న భాగస్వామి కోసం ఈ అమెరికా సంస్థ ప్రయత్నిస్తోంది.

ఛత్తీస్‌గ‌ఢ్‌లో గత కొద్ది రోజులుగా కరోనా ఇన్‌ఫెక్షన్ కేసుల‌ సంఖ్య క్షీణిస్తున్న‌ప్ప‌టికీ, వైర‌స్ మ‌రింత‌గా వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని మిన‌హాయింపుల‌తో త‌దుప‌రి లాక్‌డౌన్ కొన‌సాగింపున‌కు సూచనలు జారీ చేసింది. ఈసారి ప్రతి జిల్లాలో కోవిడ్ ప‌రిస్థితుల ప్ర‌కారం ఆంక్ష‌ల‌ను విధించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ‌ల కార్యకలాపాలు కొన్ని నిబంధ‌న‌ల మేర‌కు ప‌నిచేయాల్సి వుంటుంది. బ్యాంకులు, పోస్టాఫీసుల‌ను తెర‌వ‌నున్నారు. అయితే ఆయా కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది మాత్రమే విధుల‌కు హాజ‌రుకావాల్సివుంటుంది.

తెలంగాణను వణికిస్తున్న బ్లాక్ ఫంగస్, ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకరు మృతి, పలువురుకి కొనసాగుతున్న చికిత్స, కామారెడ్డి లోనే బ్లాక్ ఫంగస్ కేసులు బయటకు, నాలుగవ రోజుకు చేరుకున్న లాక్‌డౌన్

మార్కెట్లలోని దుకాణాల‌ను ప్రత్యామ్నాయ రోజుల ఆధారంగా తెర‌వ‌వ‌చ్చు. అయితే ఆదివారం మాత్రం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమ‌లులో ఉంటుంది. ఇదిలావుండ‌గా రాష్ట్రంలో కొత్తగా క‌రోనా కేసుల సంఖ్య‌ గణనీయంగా త‌గ్గింది. గత 45 రోజుల గణాంకాలను పరిశీలిస్తే, గత 24 గంటల్లో మొదటిసారిగా 8 వేల కంటే తక్కువగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 7,594 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అదే సమయంలో 172 మంది క‌రోనాతో మృతి చెందారు. రాయ్‌పూర్‌లో గరిష్టంగా 28 మంది మృతిచెందారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,15,964 కి చేరుకుంది. అదే సమయంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,99,925గా ఉంది. కరోనా కార‌ణంగా ఇప్పటివరకు 11,461 మంది మృతి చెంద‌గా, 7,72,500 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.