Cyclone Tauktae Update: ముంచుకొస్తున్న తౌక్టే తుఫాను ముప్పు, వాయుగుండంగా మారిన అల్ప పీడనం, ఈ నెల 8న తౌక్టే గుజరాత్ వద్ద తీరం దాటుతుందని అంచనా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన ఐఎండీ
Cyclone Tauktae (Photo Credits: Twitter, @indiannavy)

New Delhi, May 15: తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా (Cyclone Tauktae update) మారింది. ఈ తుపాన్ శనివారం ఉదయం లక్షద్వీప్ వద్ద కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం లక్షద్వీప్ (Lakshadweep) ప్రాంతం నుంచి దక్షిణ గుజరాత్, డయ్యూ తీరాలకు చేరే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.

ప్రస్తుతం దక్షిణ గుజరాత్‌ తీరప్రాతానికి 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ సమయంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని పేర్కొన్నది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

క్రమంగా అల్పపీడనం బలపడి ఈ నెల 16 నాటికి తౌక్టే తుపాన్‌గానూ, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర, అతి తీవ్ర తుపాన్‌గా (very severe cyclonic storm) రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న నాలుగు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడున్నాయని పేర్కొంది. తౌక్టే' తీవ్ర తుపానుగా మారి ఈనెల 18న గుజరాత్ వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా తౌక్టే' తుపాన్‌ ప్రభావంతో కేరళలో భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ, యానాం, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రపై తుపాను ప్రభావం ఉండనుందని, అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

కరోనాకు తోడవుతున్న తీవ్ర తుఫాన్, అరేబియా సముద్రంలో పుట్టిన తౌక్టే, పశ్చిమ తీరాన్ని వణికించేందుకు రెడీ, ఈ నెల 16 నాటికి తుపాను తీవ్ర రూపం దాల్చుతుందని తెలిపిన ఐఎండీ

ఈ తుఫాను ప్రభావంతో ఏపీ, తెలంగాణ, రాయలసీమ పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయని, ఋతుపవనాల రాకకు ఇది శుభ సంకేతమని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను కారణంగా శని, ఆదివారాల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న వెల్లడించారు. సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, గద్వాల-జోగులాంబ, మహబూబ్‌నగర్‌, ములు గు, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్నిచోట్ల ఓ మోస్తరు వానలు కురుస్తాయని వివరించారు.

పశ్చిమ తీరంతోపాటు పలు రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. తుఫాను తీవ్రత నేపథ్యంలో తీర రాష్ట్రాలకు విపత్తు నిర్వహణాదళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) సహాయక బృందాలను పంపుతున్నది. ఈ ఏడాది భారత తీరంలో ఏర్పడిన మొట్టమొదటి తుఫాను ఇదేనని చెప్పవచ్చు. దీనికి మయన్మార్‌ తౌక్టే అని పేరు పెట్టింది. తౌక్టే అంటే బర్మా భాషలో ‘బల్లి’ అనిఅర్థం.

సాధారణం కంటే ఒక రోజు ముందుగానే మే 31న నైరుతి రుతుపవనాలు కేరళ మీదుగా దేశంలోకి ప్రవేశించనున్నాయి. సాధారణంగా జూన్‌1న రుతుపవనాలు వస్తుంటాయి. అయితే, నాలుగు రోజులు ముందు వెనుకగా (ప్లస్‌ ఆర్‌ మైనస్‌ మోడల్‌ ఎర్రర్‌) ఈ ఏడాది రుతుపవనాల ఆగమనం ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం ప్రకటించింది. రుతుపవనాల రాకను సూచిస్తూ దక్షిణ అండమాన్‌ సముద్రం ప్రాంతంలో వర్షాలు మొదలై.. వాయవ్య దిశగా బంగళాఖాతం మీదుగా విస్తరిస్తాయి.

ఐఎండీ తాజా అంచనాల ప్రకారం.. మే 22 ప్రాంతంలో అండమాన్‌ సముద్రం మీదుగా రుతుపవనాలు ప్రవేశించవచ్చని తెలుస్తున్నది. దేశంలో 75 శాతం వర్షపాతానికి ఆధారంగా ఉండే నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణంగానే ఉంటాయని ఐఎండీ గతనెలలో అంచనాలను వెలువరించింది.