Coronavirus Spread: ఊపిరితిత్తులకు కరోనా సోకిందని ఎలా గుర్తించాలి, లంగ్స్ మీద కోవిడ్ ప్రభావం పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం

ఇది ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తోంది. కొవిడ్‌-19 సోకిన వారిలో చాలామంది శ్వాస ఆడ‌క‌ ఇబ్బంది ప‌డుతున్నారు. గొంతు ద్వారా శ‌రీరంలోకి ప్రవేశించి శ్వాస‌మార్గం గుండా నేరుగా వైర‌స్ లంగ్స్‌కు (Covid-19 is spreading in lungs) వెళుతోంది.

Lungs (Photo Credits: Wikimedia Commons)

ప్రపంచవ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కల్లోలం రేపుతోంది. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తోంది. కొవిడ్‌-19 సోకిన వారిలో చాలామంది శ్వాస ఆడ‌క‌ ఇబ్బంది ప‌డుతున్నారు. గొంతు ద్వారా శ‌రీరంలోకి ప్రవేశించి శ్వాస‌మార్గం గుండా నేరుగా వైర‌స్ లంగ్స్‌కు (Covid-19 is spreading in lungs) వెళుతోంది. కాబట్టి మన శరీరంలో ముందుగా కరోనా ప్రభావం ఊపిరితిత్తుల మీదనే పడుతోంది. కరోనా రాగానే గొంతు నొప్పి, పొడి ద‌గ్గు వస్తోంది. క‌రోనా సోకిన వారిలో దాదాపు 80 శాతం మందిలో ఇలాంటి ల‌క్ష‌ణాలే (6 signs that indicate Covid-19 ) క‌నిపిస్తాయి.

కొంత‌మందిలో న్యుమోనియా ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ద్వారా ఊపిరితిత్తుల‌ను కాపాడుకోవ‌చ్చు. క‌రోనావైర‌స్ (Coronavirus Scare) ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డేస‌రికే 25 శాతం వ‌ర‌కు లంగ్స్ దెబ్బ‌తింటాయి. కాబ‌ట్టి ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే ఆల‌స్యం చేయకుండా జాగ్ర‌త్త ప‌డ‌టం ద్వారా క‌రోనా నుంచి తొంద‌ర‌గా బ‌య‌ట‌ప‌డొచ్చు.

ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి?

శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందిగా ఉందంటే.. మీ ఊపిరితిత్తుల్లోకి వైర‌స్ ప్ర‌వేశించింద‌ని అనుమానించాల్సిందే. ఊపిరితిత్తుల దిగువ భాగంలో వాపు లేదా నొప్పి ఎక్కువ‌గా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

కరోనా వ్యాక్సిన్ నుంచి ఐదు నెలలే రక్షణ, ఆ తర్వాత దాని ప్రభావం క్షీణిస్తోందని తెలిపిన బ్రిటన్ పరిశోధకులు, బూస్టర్‌ డోసు ఇచ్చేందుకు రెడీ అవుతున్న బ్రిటన్

పొడి దగ్గు, ద‌గ్గుతున్న‌ప్పుడు నొప్పి రావడం కూడా కొవిడ్‌-19 పాజిటివ్‌గా ఉండటానికి సంకేతాలు అని గుర్తించాలి. కొవిడ్‌-10 కార‌ణంగా న్యుమోనియా రావ‌డంతో పాటు శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బంది ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో లంగ్స్ మొత్తం పాడైపోయి ప్రాణానికే ప్ర‌మాదం ఏర్ప‌డ‌వ‌చ్చు. ఈ వైర‌స్ కార‌ణంగా న్యుమోనియా వ‌స్తే ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు మొత్తం ద్ర‌వంతో నిండిపోయి ఊపిరితిత్తుల వాపు వ‌స్తుంది. దీనివ‌ల్ల తీవ్ర‌త ద‌గ్గు రావ‌డంతో పాటు శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మైపోతుంది.

జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం ఆరు రకాల సంకేతాల ద్వారా కరోనా ఊపిరితిత్తుల్లోకి చేరిందో లేదోనని చెప్పవచ్చని తెలిపింది. అవేంటంటే..

1. శ్వాస లేకపోవడం

ఊపిరితిత్తులలో కోవిడ్ -19 వ్యాప్తి చెందుతున్నప్పుడు, వైరస్ ఊపిరితిత్తులలోకి ఆక్సిజన్ ప్రవేశించే ప్రదేశాన్ని అడ్డుకోవడంతో రోగులు ఊపిరి ఆడకపోవచ్చు. ఈ పరిస్థితి తీవ్రమైతే, రోగులు శ్వాస కోసం వెంటిలేటర్‌పై ఆధారపడవచ్చు.

3, నిరంతర దగ్గు

కోవిడ్-19 ఛాతీలో అడ్డంకిని సృష్టిస్తుంది, SARS-CoV-2 ఛాతీలో తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. ఇది నిరంతరం దగ్గుకు దారితీస్తుంది. అయితే, కోవిడ్ -19 సంబంధిత దగ్గు అనేది శ్లేష్మం లేదా కఫం లేకుండా ఉంటుంది.

3. ఛాతి నొప్పి

SARS-CoV -2 ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల నష్టాన్ని కలిగించవచ్చు, అది ఛాతీ నొప్పికి దారితీస్తుంది.

4. కోవిడ్ -19 న్యుమోనియా (Covid-19 pneumonia)

న్యుమోనియాలో, ఊపిరితిత్తులు ద్రవంతో నిండిపోయి మంటగా మారి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కోవిడ్ -19 వల్ల కలిగే న్యుమోనియా రెండు ఊపిరితిత్తులలోనూ పడుతుంది. ఊపిరితిత్తులలోని గాలి సంచులు ద్రవంతో నిండి, ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి మరియు శ్వాస, దగ్గు మరియు ఇతర లక్షణాలను కలిగిస్తాయి.

సెప్సిస్

కోవిడ్ -19 యొక్క తీవ్రమైన కేసు యొక్క మరొక సంక్లిష్టత సెప్సిస్. రక్తప్రవాహంలో ఇన్ఫెక్షన్ చేరుకున్నప్పుడు మరియు వ్యాప్తి చెందుతున్నప్పుడు సెప్సిస్ సంభవిస్తుంది, ఇది ఎక్కడికి వెళ్లినా కణజాలం దెబ్బతింటుంది. రోగి ఊపిరితిత్తులు మరియు ఇతర అవయవాలకు శాశ్వత నష్టం కలిగిస్తుంది.

6. సూపర్ ఇన్ఫెక్షన్

ఒక వ్యక్తికి కోవిడ్ -19 ఉన్నప్పుడు, రోగనిరోధక వ్యవస్థ కరోనాతో పోరాడటానికి తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ పోరాటంలో రోగనిరోధక వ్యవస్థ విఫలమైనప్పుడు వైరస్ మరింతగా హాని కలిగిప్తుంది. ఊపిరితిత్తుల మీద దాడి చేస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఊపిరితిత్తుల ఆరోగ్యం ప్ర‌ధానంగా వాటి సామ‌ర్థ్యం, ప‌నితీరుపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఊపిరితిత్తుల ప‌నితీరు బాగుంటేనే శ‌రీరానికి కావాల్సిన ఆక్సిజ‌న్ స‌క్ర‌మంగా అందుతుంది. కాబ‌ట్టి ఊపిరితిత్తుల ప‌నితీరు మెరుగుప‌డాలంటే వ్యాయామం చేయ‌డం చాలా అవ‌స‌రం. శారీర‌క శ్ర‌మ వ‌ల్ల శ్వాస తీసుకునే సామ‌ర్థ్యం పెరుగుతుంది. త‌ద్వారా ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు పెరుగుతాయి. ఫ‌లితంగా ఊపిరితిత్తులు ఆక్సిజ‌న్‌ను గ్ర‌హించే సామ‌ర్థ్యం పెరుగుతుంది. కాబ‌ట్టి ప్ర‌తిరోజు రన్నింగ్‌, వాకింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయ‌డం మంచిది.

కరోనాతోనే పోలేదు, రాబోయే 60 సంవత్సరాల్లో అంతకన్నా ప్రమాదకర వైరస్‌లు దాడి చేసేందుకు రెడీ అవుతున్నాయి, సంచలన విషయాలను వెల్లడించిన పరిశోధకులు

పెద్ద‌లు అయితే క‌నీసం 30 నిమిషాలు, పిల్ల‌లు అయితే గంట పాటు వ్యాయామం చేయ‌డం ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. లంగ్స్‌లో దీర్ఘ‌కాలిక మంట త‌గ్గాలంటే స‌రైన పోష‌కాహారం తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూర‌గాయలు తినాలి. అర‌టి పండ్లు, యాపిల్‌, ద్రాక్ష‌, టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ల‌భిస్తాయి.