COVID: తల్లి గర్భంలో ఉండగానే ఇద్దరు పసికందులకు కరోనా, బయటకు వచ్చిన తరువాత ఒక శిశువు మృతి, మరొకరు వైద్యుల పర్యవేక్షణలో, ప్రపంచంలో తొలికేసుగా గుర్తించిన యుఎస్ వైద్యులు
ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. ఇద్దరు తల్లులకు పుట్టిన శిశువులకు కరోనా సోకడంతో ఇద్దరూ బ్రెయిన్ హేమరేజ్‌తో జన్మించినట్లు (Covid infection through womb caused brain damage) యూఎస్‌లోని వైద్యులు వెల్లడించారు.
COVID Caused Brain Damage in 2 Infants: తల్లి గర్భంలో ఉండగానే ఇద్దరు శిశువులు కరోనా బారీనపడ్డారు. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. ఇద్దరు తల్లులకు పుట్టిన శిశువులకు కరోనా సోకడంతో ఇద్దరూ బ్రెయిన్ హేమరేజ్‌తో జన్మించినట్లు (Covid infection through womb caused brain damage) యూఎస్‌లోని వైద్యులు వెల్లడించారు.
ఇదే తొలికేసు అని కూడా తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ మియామి తన పీడియాట్రిక్స్ జర్నల్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఘటన వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాకమునుపు జరిగినట్లు జర్నల్ పేర్కొంది. ఇద్దరు తల్లలు గర్భధారణ సమయంలోనే కరోనా (COVID-19 Caused Brain Damage in Two Infants) బారిన పడినట్లు తెలిపారు.
ఐతే వారిలో ఒక తల్లికి తేలికపాటి లక్షణాలు కనిపించగా మరో తల్లి కరోనా కారణంగా తీవ్ర అనారోగ్య పాలైందని తెలిపారు. దీంతో వారికి పుట్టిన శిశువులు ఇద్దరు జన్మించిన వెంటనే ఫిట్స్‌తో బాధపడినట్లు తెలిపారు. తర్వాత వారిలో సరైన విధంగా పెరుగుదల కూడా లేకపోవడం గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ఆ శిశువుల్లో ఒక శిశువు 13వ నెలలో మరణించగా మరోక శిశువు వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంతవరకు చిన్న పిల్లలకు కరోనా పరీక్షలు నిర్వహించడం జరగలేదన్నారు. తొలిసారిగా ఆ శిశువులకు నిర్వహించగా కరోనా వైరస్ జాడలను గుర్తించినట్లు తెలిపారు.
చనిపోయిన శిశువుకి పోస్ట్‌మార్టం నిర్వహించగా మెదడులో కరోనా వైరస్ జాడలను గుర్తించామని, అందువల్లే మెదడు దెబ్బతిందని మియామి విశ్వవిద్యాలయ పరిశోధకుల వెల్లడించారు. అలాగే కరోనా బారిన పడి తీవ్రంగా అనారోగ్యం పాలైన తల్లికి కేవలం 32 వారాలకే డెలివరి చేశామని చెప్పారు. ఆమె శిశువే బాగా ఈ వైరస్ ప్రభావానికి గురై చనిపోయినట్లు తెలిపారు.అందువల్ల దయచేసి గర్భధారణ సమయంలో కరోనా బారిని పడితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పీడీయాట్రిక్ వైద్యులను సంప్రదించాలని పరిశోదకులు సూచించారు .