Health Benefits of Garlic: నపుంసకత్వాన్ని దూరం చేసి లైంగిక సామర్థాన్ని పెంచే ఔషదం వెల్లుల్లి, రోజూ పచ్చి తెల్లగడ్డ రెబ్బలు కొన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు
నపుంసకత్వాన్ని నివారించే శక్తి సైతం దీనికి ఉందట. స్త్రీ పురుషుల లైంగిక సమస్యల్ని దూరం చేసి.. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వెల్లుల్లి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రతిరోజు 2-4 రెబ్బలు తినడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లు మరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి (Health Benefits of Garlic) సంజీవని లాంటిది. వెల్లుల్లి మీ బరువును ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది. రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్‌కెళ్లినంత లాభం కలుగుతుంది. అలాగే వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతారు. వెల్లుల్లిని భోజనం తీసిన తర్వాత కంటే పరగడుపున తీసుకుంటే చాలామంచిదని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.
జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్ చేయడమే కాదు అనవసరమైన ఫ్యాట్‌ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. వెల్లుల్లిని తినడం వల్ల (Surprising Health Benefits of Garlic) ఆకలి వేయదు. జిహ్వచాపల్యం బాగా తగ్గుతుంది. అంతేకాదు వెల్లుల్లి అడ్రినలైన్‌ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. క్యాలరీలను కరిగిస్తుంది. వెల్లుల్లి గుండెకు ఎంతో మేలు చేస్తుందట. వెల్లుల్లి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు దరిచేరవు. అంతేకాదు మదుమేహం వంటి వ్యాధులను సైతం తగ్గించే సామర్ధ్యం దీనికి కలదు. అలాగే జీర్ణ సంబంధ వ్యాధులు కూడా నయం అవుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది. వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. అంతేకాదు శరీరం లోపలి భాగాల్ని కూడా శుద్ధిచేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. ప్రమాదకరమైన విషపదార్థాల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది.
పచ్చి వెల్లుల్లి గుండెను కాపాడతుంది. రోజూ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల (Amazing Health Benefits of Garlic) గుండె సంబంధిత బబ్బులు రావు. వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్ ప్రాపర్టీస్ వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టుకోవడంలాంటివి (బ్లడ్ క్లాట్స్) సంభవించవు. పచ్చి వెల్లుల్లిని తినలేకపోతే ఆహారపదార్థాలలోనైనా వేసుకొని తప్పనిసరిగా వెల్లుల్లి తినడం మంచిది.
కొన్ని వెల్లుల్లి రేకులను తీసుకుని ఉదయాన్నే పచ్చిగా తింటే ఆరోగ్యపరంగా చాలా మేలు జరుగుతుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ప్లామేటరీ గుణాలు ఉండటం వల్ల అది రక్తం గడ్డకట్టనీయకుండా చేస్తుంది. అనారోగ్యంతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే వెల్లుల్లి తినడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. వీరికి వెల్లుల్లి మంచి ఔషదంలా పనిచేస్తుంది. అలాగే నరాల బలహీనతకు వెల్లుల్లి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వదు. వైరస్, బాక్టీరియాలతో పోరాడే ఔషదగుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. కాబట్టి రోజూ వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
వెల్లుల్లిలోని ఔషధ గుణాలు సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయట. నపుంసకత్వాన్ని నివారించే శక్తి సైతం దీనికి ఉందట. స్త్రీ పురుషుల లైంగిక సమస్యల్ని దూరం చేసి.. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వెల్లుల్లి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రతిరోజు 2-4 రెబ్బలు తినడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.రక్తశుద్ధి, రక్త ప్రసరణకు వెల్లుల్లి బాగా సహాయపడుతుంది.
అంతేకాదు, గర్భం ధరించేందుకు ప్రయత్నించినప్పుడు మహిళలకు అవసరమైన శక్తిని వెల్లుల్లి ఇస్తుంది. వెల్లుల్లిలోని సెలీనియం, విటమిన్లు సీ, బీ-6 క్రోమోజోమ్ లోపాలను నివారిస్తాయి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ లైంగిక అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది.
స్త్రీ, పురుషులలో సంతానోత్పత్తిని పెంచే పోషకాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి. స్పెర్మ్ తో పాటు, పిండం తయారుచేసే గుడ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. చాలామంది పురుషులలో, రియాక్టివ్ ఆక్సిజన్ జాతుల (ROS) ఉత్పత్తి పెరగడం సంతానలేమికి ప్రధాన కారణం. శరీరం సహజ యాంటీఆక్సిడెంట్లు లేనప్పుడు ఆక్సీకరణస్థాయి పెరిగి ఒత్తిడిని సృష్టిస్తుంది. వెల్లుల్లి ఒక సహజ యాంటీఆక్సిడెంట్, ఈ ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే సెల్యులార్ నష్టాన్ని తగ్గించి పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి అంగస్తంభన వేగంగా అభివృద్ధి చెందడానికి వెల్లుల్లి సహాయపడుతుంది.
ఇది చర్మం, జుట్టు, గోర్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది.రొమ్ము క్యాన్సర్ లాంటి వ్యాధులను నివారిస్తుంది. అధిక బరువు, ఈస్ట్ సమస్యలను నియంత్రించడానికి బాగా సహాయ పడుతుంది. స్త్రీలకు నెలసరి నొప్పి బాధ తప్పుతుంది. గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది. వెల్లుల్లి అండోత్సర్గమును ఉత్తేజపరచడమేకాక క్రోమోజోమ్ లోపాలను నివారిస్తుంది. కాబట్టి ఆడవారిలో సంతానోత్పత్తికి బాగా సాయపడుతుంది.