Bone Death: మరో ప్రమాదం..కరోనా పేషెంట్లలో కుళ్లిపోతున్న ఎముకలు,పేషెంట్లు కోలుకున్న 60 రోజుల తర్వాత వారిపై ఎవాస్క్యులర్‌ నెక్రోసిస్‌ వ్యాధి దాడి, ఇప్పటికే ముంబైలో మూడు బోన్‌ డెత్‌ కేసులు నమోదు
Joint bone | Representational Image (Photo Credits: Pixabay)

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలాన్ని రేపుతోంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ లతో ప్రజలను వణికిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఫోర్త్ వేవ్ కూడా మొదలయింది. ఎంతో మంది పేషెంట్లు కరోనా బారీన పడ్డారు. మరికొందరు మరణించారు. చాలామంది కోలుకున్నారు. అయితే కోలుకున్న వారిలో ఆ తర్వాత అనేక రకాలైన సమస్యలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న పేషెంట్లలో బ్లాక్ ఫంగస్ (Black Fungus) సమస్యలు మాత్రమే చూశాము.

తాజాగా మరో ప్రమాకదర సమస్య వారిలో బయటపడుతోంది. దాని పేరే.. ‘బోన్‌ డెత్‌’. దీనినే ‘ఎవాస్క్యులర్‌ నెక్రోసిస్‌ ఆఫ్‌ ది హిప్‌ జాయింట్‌’ (ఏవీఎన్‌) (Bone Death or Avascular Necrosis or AVN) అనీ అంటారు. కొవిడ్‌నుంచి కోలుకున్న అరవై రోజుల తరువాత, కొంతమందిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ముంబైలోని కరోనా బారినపడిన వారిలో కనీసం 3 AVN కేసులు నమోదయ్యాయి. COVID -19 చికిత్స తర్వాత 45 రోజుల నుండి 58 రోజుల మధ్య వారి శరీరంలో నెక్రోసిస్‌ను అభివృద్ధి చేసినట్లు నివేదించబడింది.

దీని మనం వాడే భాషలో చెప్పాలంటే శరీరంలో ఎముకలు కుళ్లిపోవడం (Bone Death). వైద్య పరిభాషలో ఎవాస్క్యులర్‌ నెక్రోసిస్‌ (What is Avascular Necrosis). ఈ వ్యాధి సాధారణంగా తుంటికీళ్లలో(హిప్‌ జాయింట్స్‌లో) వస్తుందని తేలింది. కొవిడ్‌ చికిత్సలో వాడే స్టిరాయిడ్స్‌ ప్రభావం వల్ల ఈ వ్యాధి వారిని వెంటాడుతుందని తాజా పరిశోధనలో వెల్లడయింది.

ఇదో ప్రమాదకర కేసు.. మనిషి మెదడులో క్రికెట్ బాల్ సైజులో బ్లాక్ ఫంగ‌స్‌, మూడు గంటలు పాటు శ్రమించి శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు, స‌ర్జ‌రీ త‌ర్వాత నిల‌క‌డగా పేషెంట్ ఆరోగ్యం

సాధారణంగా శరీరంలోని ఇతర భాగాలతో పోలిస్తే, హిప్‌ జాయింట్స్‌ (తుంటికీళ్లలో)లో రక్తప్రసరణ తక్కువగా ఉంటుంది. అయితే స్టిరాయిడ్స్‌ వాడటం వల్ల అంతంతమాత్రంగా రక్తప్రసరణ ఉన్న హిప్‌ జాయింట్స్‌కు ఒక్కసారిగా సరఫరా నిలిచిపోతుంది. ఫలితంగా, తుంటి కీళ్లలోని ఎముక కణాలు నశిస్తాయి. అక్కడున్న ఎముకలు క్రమంగా కుళ్లిపోతాయి..దీని బోన్ డెత్ అని పిలుస్తారు.

సాధారణంగా, కొవిడ్‌ బారిన పడని రోగుల్లో 2000ఎంజీ కంటే ఎక్కువగా స్టిరాయిడ్స్‌ వాడితే, బోన్‌ డెత్‌ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కరోనా రోగుల్లో మాత్రం 750ఎంజీ నుంచి 850 ఎంజీ స్టిరాయిడ్స్‌ వాడినా బోన్‌ డెత్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. సాధారణ రోగుల్లో రెండు సంవత్సరాల తరువాత ఈ కేసులు బయటపడుతుండగా కరోనా రోగుల్లో అరవై రోజుల తరువాత బయటపడుతోంది. అయితే స్టిరాయిడ్స్‌తో సంబంధం లేకుండా కూడా కొందరిలో బోన్‌ డెత్‌ సమస్య ఉత్పన్నం అవుతున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే, స్టిరాయిడ్స్‌ వాడకపోయినా కరోనా రోగులకు ఈ వ్యాధి వస్తుందా అన్న దానిపై ఇంకా ఎటవంటి సమాచారం అందుబాటులో లేదు. కొత్తగా వైట్‌ ఫంగస్‌ వెలుగులోకి, నేరుగా ఊపిరితిత్తులపై దాడి, పాట్నా మెడికల్ కాలేజీలో నలుగురిలో వైట్‌ ఫంగస్‌, బ్లాక్‌ ఫంగస్‌ కంటే ప్రమాదకరమంటున్న వైద్యులు, వైట్‌ ఫంగస్‌ లక్షణాలు. చికిత్స గురించి తెలుసుకోండి

ప్రమాదం ఎలా పొంచి ఉంటుంది

ఇప్పటివరకు కనిపించిన కేసుల్లో స్టిరాయిడ్స్‌ వాడిన కరోనా రోగులే బోన్‌ డెత్‌ బారిన పడ్డారు. ఈ కేసుల్లో మొదటి దశలో ఎముకలోని కణాలన్నీ నిర్జీవంగా మారడం మొదలవుతుంది. ఈ దశలో ఎముక 25 శాతం వరకూ దెబ్బతింటుంది. మొదటి దశలోనే వ్యాధిని గుర్తిస్తే, సాధారణ ఔషధాలతో రోగికి ఉపశమనం కలిగించవచ్చు. వ్యాధి ముదరకుండా అడ్డుకోవచ్చు. రెండో దశలో ఎముక 25 శాతం నుంచి 50 శాతం వరకు కుళ్లిపోతుంది. వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దశలో వైద్యం చేయించుకొంటే శస్త్రచికిత్స లేకుండానే నయం చేయవచ్చు. ఈ రెండు దశలూ ప్రమాదకరమే కానీ, ప్రాణాంతకం కాదు.

మళ్లీ వెలుగులోకి కొత్త కరోనావైరస్, కుక్కల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతున్న CCoV-HuPn-2018, ప్రమాదకరమా కాదా అనే దానిపై పరిశోధనలు నిర్వహిస్తున్న డ్యూక్‌ యూనివర్శిటీ పరిశోధకులు

మూడో దశలో ఎముక 50 శాతం నుంచి 75 శాతం వరకు కుళ్లిపోతుంది. ఈ దశలో భరించలేనంత నొప్పితో రోగి బాధపడతాడు. అడుగు తీసి అడుగేయలేని పరిస్థితి. ఈ దశలో చికిత్స తీసుకోకుంటే ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. నాలుగో దశలో తుంటికీలు ఎముక 100 శాతం కుళ్లిపోతుంది. ఆ ఎముకకు సంబంధించినంత వరకూ అది మరణమే. తుంటికీళ్లు పనిచేయడం ఆపేస్తాయి. రోగికి వీల్‌ చైర్ లోనే కూర్చోవాల్సి ఉంటుంది.

గుర్తించబడిన ప్రధాన లక్షణాలు ఇవి:

ఈ బోన్ డెత్ బారీన 30 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్కులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఇది సాధారణంగా నొప్పులతో ప్రారంభం అవుతుంది. అయితే ప్రతి నొప్పి బోన్ డెత్ కిందకు రాదని వైద్యులు చెబుతున్నారు. కరోనానుంచి కోలుకున్న 60 రోజుల తరువాత గజ్జలలో నొప్పి మొదలవుతుంది. విపరీతమైన నడుం నొప్పి ఇబ్బంది పెడుతుంది. నిలబడలేరు, నడవలేరు, కిందికి వంగలేరు. తుంటిలో విపరీతమైన బాధ మొదలవుతుంది.

కీళ్ళు, తుంటి, మోకాలు, పాదం లేదా చేతిలో ఏదైనా అసౌకర్యం

ప్రారంభ కీళ్ల నొప్పి

పెరిగిన కీళ్ల నొప్పి

నొప్పి కారణంగా కదలిక యొక్క పరిమిత పరిధి లేదా పరిమిత పరిధిని అనుభవిస్తున్నారు

కాబట్టి మీరు స్టెరాయిడ్ థెరపీ తర్వాత కరోనావైరస్ నుండి బయటపడి ఉంటే మరియు పైన పేర్కొన్న లక్షణాలను మీరు అనుభవిస్తే, దానిని తేలికగా తీసుకోకండి మరియు అత్యవసరంగా వైద్యుడిని సందర్శించండి. ఎముకల పని తీరును గుర్తించడానికి ఉత్తమ మార్గం MRI అని వైద్యులు చెబుతున్నారు.

బోన్ డెత్ ఎలా వస్తుంది.

మహిళల్లో ఆటోఇమ్యూన్‌ సిస్టం దెబ్బతినడం వల్ల తలెత్తే ‘సిస్టమిక్‌ లూపస్‌ ఎర్తమటోసిస్‌'(ఎస్‌ఎల్‌యీ) అనే రుగ్మతవల్ల కూడా బోన్‌ డెత్‌ రావచ్చు. పురుషుల్లో దీర్ఘకాల మద్యపానం, ధూమపానం కారణం కావచ్చు. కొందరికి రోడ్డు ప్రమాదాల్లో తుంటిఎముకలు గాయపడతాయి. సరైన సమయంలో, సరైన చికిత్స తీసుకోలేకపోతే అది కాస్తా బోన్‌ డెత్‌గా మారే అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు తగిలిన దెబ్బలవల్ల కూడా, బోన్‌ డెత్‌ బారినపడే ప్రమాదం ఉంది. మూత్రపిండ మార్పిడి జరిగిన రోగులూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తమా వ్యాధిగ్రస్తులు, చర్మవ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు కూడా రెండునుంచి ఐదు శాతం మేర ఈ రుగ్మతకు చేరువలో ఉన్నట్టే.

బోన్ డెత్ చికిత్స ఏమిటి

ఈ పరిస్థితిని ప్రాథమిక దశలో గుర్తిస్తే మందులు, శస్త్రచికిత్స లేదా ఫిజియోథెరపీ ద్వారా చికిత్స చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. ముందుగా నిర్ధారణ అయితే, 92 నుండి 97 శాతం మంది రోగులకు శస్త్రచికిత్స అవసరం లేదని, బిస్ఫాస్ఫోనేట్ థెరపీ అనే చికిత్స ద్వారా నిర్వహించవచ్చని హిందూజా హాస్పిటల్ ఆర్థోపెడిక్ వైద్యులు చెప్పారు. పరిస్థితి క్షీణించడం ప్రారంభించిన తర్వాత, కీళ్ల మార్పిడి చికిత్స యొక్క ముఖ్యమైన ప్రక్రియగా మిగిలిపోతుంది. అయితే, ఆలస్యమైతే పరిస్థితి మరింత దిగజారవచ్చు.రాబోయే నెలల్లో ఈ పరిస్థితి పెరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు మరియు ఇది తీవ్రమైన ఆందోళన కలిగించే విషయంగా ప్రకటించారు.

బ్లాక్ ఫంగస్‌ను అంటు వ్యాధుల జాబితాలో చేర్చాలని రాష్ట్రాలకు సూచించిన కేంద్రం, ఇప్పటికే నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించిన తెలంగాణ; బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఇలా ఉండొచ్చు

కరోనా నుంచి కోలుకున్న రెండు మూడు నెలల్లోపు ఎముకలకు సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా, నిర్లక్ష్యం చేయకుండా నిపుణులను సంప్రదించాలి. తుంటి పరిసరాల్లో ఎక్స్‌-రే లేదా ఎంఆర్‌ఐ చేయిస్తే సమస్య తీవ్రత తెలుస్తుంది. అప్పటికి ఇంకా స్టిరాయిడ్స్‌ వాడుతుంటే, వెంటనే నిలిపేయాలి. లేదంటే మోతాదు తగ్గించాలి. ఈ విషయంలో నిపుణులదే తుది నిర్ణయం. షుగర్‌, బీపీ, రుమటాయిడ్‌ ఆర్తరైటిస్‌ వంటి సమస్యలుంటే, వాటిని నియంత్రణలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ‘బై ఫాస్పోనెట్‌’ మాత్రలను 3 నుంచి 6 నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.