Black Fungus Treatment: ఇదో ప్రమాదకర కేసు.. మనిషి మెదడులో క్రికెట్ బాల్ సైజులో బ్లాక్ ఫంగ‌స్‌, మూడు గంటలు పాటు శ్రమించి శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు, స‌ర్జ‌రీ త‌ర్వాత నిల‌క‌డగా పేషెంట్ ఆరోగ్యం
Surgery | Image Used for Representational Purpose (Photo Credits: Pixabay)

Patna, June 13: దేశంలో సెకండ్ వేవ్ తో పాటు కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్లపై ముకోర్మైకోసిస్ దాడి చేస్తున్న సంగతి విదితమే. దాదాపు అన్ని నగరాల నుండి అనేక కేసులు నమోదవుతుండగా,తాజాగా ఒక కేసు వార్తల్లోకెక్కింది.పాట్నాలో ఓ వ్య‌క్తి మెద‌డులో క్రికెట్ బంతి సైజులో బ్లాక్ ఫంగ‌స్‌ను (Cricket Ball-Sized Black Fungus) ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడిక‌ల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్‌) డాక్ట‌ర్లు (IGIMS Doctors) విజ‌య‌వంతంగా తొల‌గించారు. 60 ఏళ్ల ఆ పేషెంట్‌కు మూడు గంట‌ల పాటు స‌ర్జరీ నిర్వ‌హించి ఫంగ‌స్‌ను (Black Fungus) తొల‌గించ‌డం విశేషం.

అనిల్‌కుమార్ అనే ఆ పేషెంట్ ఈ మ‌ధ్యే కొవిడ్ నుంచి కోలుకున్నాడు. అయితే త‌ర‌చూ మైకంగా ఉండ‌టం, స్పృహ త‌ప్ప‌డం జ‌రుగుతుండేది. దీంతో అత‌న్ని ఐజీఐఎంఎస్‌కు రిఫ‌ర్ చేశారు. అక్క‌డ అత‌నికి బ్లాక్ ఫంగ‌స్ సోకిన‌ట్లు గుర్తించారు.మూడు గంటలు కొనసాగిన శస్త్రచికిత్సలో క్రికెట్ బాల్ అంతటి నల్ల ఫంగస్ ని వైద్యులు తొలగించారు. బ్లాక్ ఫంగస్ యొక్క అనేక కేసులు పాట్నాలోని ఐజిమ్స్ వద్ద విజయవంతంగా చికిత్స చేయబడ్డాయి. ఇది మాత్రం వైద్యులకు ఒక పెద్ద క్లిష్టమైన శస్త్రచికిత్స. నల్ల ఫంగస్ సంబంధిత రోగి యొక్క మెదడుకు వ్యాపించింది. రోగి యొక్క కంటి చూపును జాగ్రత్తగా చూసుకుంటూ శస్త్రచికిత్స చేయడం పెద్ద సవాలు. సంబంధిత రోగి ఇప్పుడు ప్రమాదంలో లేడని వైద్యులు తెలిపారు.

దేశంలో భారీగా తగ్గుతున్న రోజూవారీ కేసులు, తాజాగా 80,834 మందికి కరోనా, కరోనా కట్టడికి ప్రపంచమంతా ఏకతాటిపై నడవాలని కోరిన ప్రధాని మోదీ, కేంద్రం సరైన వ్యూహాలను రచించాలంటే మృతుల సంఖ్య కచ్చితత్వంతో ఉండాలని తెలిపిన రణ్‌దీప్‌ గులేరియా

స‌ర్జ‌రీ త‌ర్వాత అత‌ని ఆరోగ్యం నిల‌క‌డగా ఉంది. ఈ స‌ర్జ‌రీ నిర్వ‌హించిన డాక్ట‌ర్ మ‌నీష్ మండ‌ల్ మాట్లాడుతూ.. ఫంగ‌స్ అత‌ని ముక్కు ద్వారా మెద‌డులోకి చేరింద‌ని చెప్పారు. అయితే అత‌ని క‌ళ్ల‌లోకి మాత్రం అది వెళ్ల‌లేద‌ని తెలిపారు. నిజానికి ఇలాంటి కేసుల్లో చాలా వ‌ర‌కూ పేషెంట్ క‌ళ్లు తొల‌గించాల్సి వ‌స్తుంది. బీహార్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ 500కు పైగా బ్లాక్ ఫంగ‌స్ కేసులు న‌మోద‌య్యాయి.