Evening Exercise –Sugar Levels Link: షుగర్ కంట్రోల్ కోసం రోజూ వ్యాయామం చేస్తున్నారా? అయితే, ఉదయంపూట కంటే సాయంత్రంపూట చేసే వ్యాయామంతో షుగర్‌ స్థాయిలు మరింత మెరుగ్గా అదుపులోకి.. స్పెయిన్‌ లోని యూనివర్సిటీ ఆఫ్‌ గ్రెనడా పరిశోధకుల తాజా అధ్యయనంలో ఏం తేలిందంటే?

సాయంత్రంపూట చేసే వ్యాయామం వల్ల బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ మరింత నియంత్రణలో ఉంటాయని తాజా అధ్యయనంలో ఒకటి తెలిపింది.

Evening Walk (Credits: X)

Newdelhi, June 11: సాయంత్రంపూట చేసే వ్యాయామం (Evening Exercise) వల్ల బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ (Sugar Levels) మరింత నియంత్రణలో ఉంటాయని తాజా అధ్యయనంలో ఒకటి తెలిపింది. అధిక బరువు, ఊబకాయంతో బాధపడే పెద్దలు సాయంత్రం వేళ శారీరక శ్రమ చేయడం వల్ల షుగర్‌ లెవెల్స్‌ తగ్గుతాయని వెల్లడించింది. ఈ మేరకు స్పెయిన్‌ లోని యూనివర్సిటీ ఆఫ్‌ గ్రెనడా పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఒబేసిటీ జర్నల్‌ లో ప్రచురితమయ్యాయి.

మళ్లీ హోం మంత్రి అమిత్ షానే, కేంద్ర మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు లిస్టు ఇదిగో, తెలుగు రాష్ట్రాల మంత్రులకు ఏయే శాఖలంటే..

అధ్యయనం సాగింది ఇలా..

మొత్తం 186 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం వరకు కొంతమందితో.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరికొంత మందితో.. సాయంత్రం 6 నుంచి అర్ధర్రాతి వరకు ఇంకొంత మందితో ఏకంగా 14 రోజులపాటు వ్యాయామం చేయించారు. 46 ఏండ్ల సగటు వయస్సు, అధిక బరువు ఉన్న వారిని ఈ ప్రయోగం కోసం ఎంచుకున్నారు.

ఒక్క ముస్లీం కూడా లేకుండా మోదీ క్యాబినెట్ ఇదిగో, ఏడుగురు మాజీ సీఎంలతో పాటు 7 గురు మహిళలకు అవకాశం, నరేంద్ర మోదీ క్యాబినెట్ పూర్తి లిస్ట్ ఇదే..

తేలింది ఏంటంటే?

ఉదయం, మధ్యాహ్నం వేళల్లో వ్యాయామం చేసిన వారితో పోలిస్తే, సాయంత్రం వేళల్లో శారీరక శ్రమ చేసిన వారి బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ తక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది.

పోరాడి ఓడిన బంగ్లాదేశ్, ఉత్కంఠ పోరులో 4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి..



సంబంధిత వార్తలు