Conjunctivitis Symptoms: కరోనా తర్వాత కండ్లకలక లక్షణాలు ఇవిగో, ఈ సింప్టమ్స్ కనిపించాయంటే వైరస్ వచ్చినట్లే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకోండి

కళ్లు ఎర్రబడి నీరు కారడం, కళ్లు మండటం, కళ్లు వాపుతో పాటు దురదపెట్టడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వానలతో తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.

Conjunctivitis (Photo-PIB Twitter)

భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కండ్ల కలక కేసులు భారీగా నమోదవుతున్నాయి. కళ్లు ఎర్రబడి నీరు కారడం, కళ్లు మండటం, కళ్లు వాపుతో పాటు దురదపెట్టడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వానలతో తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. జులై 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదైనట్టు డాక్టర్లు వెల్లడించారు.

కళ్ల కలక అంత తీవ్రమైన జబ్బుకానప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చూపుపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ జబ్బు సాధార ణంగా ఏడు నుంచి పది రోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత తగ్గిపోతుంది. ఇదొక అంటువ్యాది. తగిన జాగ్ర త్తలు తీసుకోకపోతే ఇతరులకు సోకుతుంది. ఒకఇంట్లో ఒకరికి సోకిందంటే మిగతా వారికి కూడా శరవేగంగా వ్యాపిస్తుంది. కొవిడ్‌లాగా జాగ్రత్తలు తీసుకుంటే దీని వ్యాప్తిని త్వరగా అరికట్టవచ్చు. దేవుని ప్రసాదం తింటే పునర్జన్మ లభిస్తుంది, శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశం గురించి మీకు ఎవరికైనా తెలుసా

కండ్లకలక ఎప్పుడు వస్తుంది..

కండ్ల కలక.... దీనినే పింక్ ఐ అని కూడా అంటారు. ముఖ్యంగా వానాకాలంలోనే కండ్ల కలక ఇబ్బంది పెడుతుంది. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువ ఉండటంతో ..ఈ బ్యాక్టీరియా కళ్ళను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా కళ్ళు కండ్ల కలక బారిన పడతాయి.

కండ్లకలక లక్షణాలు

కన్ను ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది.

కంటి దురద, అధికంగా నీరు కారుతుంది.

లైట్ల వెలుగును చూడలేకపోతారు.

జ్వరం, తేలికపాటి గొంతు నొప్పి వస్తుంది.

కండ్లకలక వ్యాధి సోకితే డాక్టర్లను సంప్రదించాలి. కండ్లకు గోరువెచ్చటి కాపడాలు, మెత్తబరిచే కంటి మందు చుక్కలు, మంట నుంచి ఉపశమనం పొందడానికి అనెల్జెసిక్స్‌ వాడొచ్చు. అలాగే కాంటాక్ట్‌ లెన్స్‌ పెట్టుకోవాలి. మెత్తని, చెమ్మగా ఉన్న టవల్ తో కంటి స్రావాన్ని సున్నితంగా శుభ్రపర్చుకోవాలి. అయితే ఏది పడితే అది యాంటిబయాటిక్స్‌, స్టెరాయిడ్స్‌ వాడొద్దు.

Here' PIB Tweet

కండ్ల కలక వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు, పారాసైట్ల పీడనం, అలర్జీల వల్ల వస్తుంది. అడెనోవైరస్‌ వంటి ఒక ప్రత్యేక వైరస్‌ల సమూహంతోనూ ఈ సమస్య వచ్చే అవకాశాలున్నాయి. కండ్ల కలక అంటు వ్యాధి. ఈ వ్యాధి సోకి వ్యక్తి ఇతరులకు దూరంగా ఉంటూ తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యాధి సోకిన వ్యక్తి తన చేతులతో కండ్లను తాకవద్దు. వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కళ్ల కలక వైరస్‌ లేదా బాక్టీరియా, అలర్జీ కారణంగా వస్తుంది. వైరస్‌, బాక్టీరియాతో వచ్చే కలకలు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతాయి. గుంపు లుగా ఉండే ప్రదేశాల్లో అధికంగా వ్యాప్తి చెందేందుకు అవకాశాలున్నాయి. అలర్జీతో కలిగే కలక ఆ వ్యక్తి రోగ నిరోధక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. వైరస్‌ లేదా అలర్జీ వల్ల కలిగే కలక తక్కువ సమయంలో తీవ్రమైన లక్షణాలతో వస్తుంది. అంతే వేగంగా తగ్గిపోతుంది. బాక్టీరియాతో కలిగే కలక కొన్ని రోజుల వ్యవధిలో పెరుగుతుంది. కళ్ల మీద అధిక ప్రభావం ఉంటుంది. కంటి చూపు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కొన్ని సార్లు రసాయనాల వల్ల కలక రావచ్చు. అప్పుడు శుభ్రమైన నీటితో కళ్లను శుభ్రం చేసుకుంటే తగ్గిపోతుంది. లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇన్ఫ్‌క్షన్‌ ఉన్న వ్యక్తి నుంచి ఆ వైరస్‌ ఇతర వ్యక్తుల కు కంటి స్రావాలు, చేతుల ద్వారా చేరుతుంది. ఎక్కువ శాతం చేతులు కళ్లలో పెట్టుకోవడం ద్వారా సోకుతుంది. ఒక వ్యక్తి ముక్కులో లేదా సైనస్‌లో ఉండే వైరస్‌, బాక్టీరియా ఇతరు కళ్లలోకి చేరడం ద్వారా ఇన్ఫ్‌క్షన్‌ వచ్చే ప్రమాదం ఉంది. కాంటాక్టు లెన్స్‌ వినియోగించే అలవా టు ఉన్నవారు వాటిని సక్రమంగా శుభ్రం చేసుకోవాలి. సరైన లెన్స్‌వాడకపోడం వల్ల కూడా కలక రావచ్చు.

ఈ లక్షణాలు కనిపించినప్పుడు కళ్లు నలపడం లేదా చేతులు పెట్టడం చేయరాదు. శుభ్రమైన టిష్యూ పేపర్‌ లేదా చేతి రుమాలుతో కండ్లు తరచూ తుడుచుకోవాలి. నల్లటి అద్దాలు పెట్టుకోవడం ద్వారా నుంచి కొంత ఉపశ మనం పొందవచ్చు. కాంటాక్టు లెన్స్‌ పెట్టుకునేవారు వెంటనే వాటి వాడకం ఆపేయాలి. వైరస్‌ వల్ల కలిగే సమస్య ఒకటి రెండు వారాల్లో తగ్గిపోతుంది. బాక్టీరి యాతో సమస్య ఏర్పడితే సరైన మందును తగిన మో తాదులో తీసుకోవాలి. కండ్ల కలకలు నివారించడానికి తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. కళ్ల కలక ఉన్న వారు వాడిన చేతి గుడ్ల, శరీరం శుభ్రం చేసుకునే గుడ్డ ను ఇతరులు వాడొద్దు.

ఒక కన్ను లేదా రెండు కండ్లు ఎర్రగా మారడం. కళ్లలో మంట, నొప్పి, దురద ఉండటం. కనురెప్పలు వాపు రావడం. కంటి రెప్పలు అతుక్కోవడం. ఉదయం నిద్రలేచే సరికి ఎక్కువ ఊసులతో కనురెప్పలు అతుక్కొని ఉండడం. ఎక్కువ వెలుతురు చూడలేక పోవడం. కళ్ల నుంచి నీరు లేక చిక్కటి స్రావం కారడం. బాక్టీరియాతో కలిగే కలకతో చీము వచ్చే అవకాశం కూడా ఉండడం. చిన్న పిల్లల్లో జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కండ్ల కలకకు కారణమైన వైరస్‌తో సాధారణ జలుబు కూడా వస్తుంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif