GAS6 Protein: బట్టతలకు శాశ్వత పరిష్కారం, GAS6 ప్రొటీన్‌ బట్టతలపై వెంట్రుకలను తిరిగి పెంచుతుందని తేల్చిన హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు

‘GAS6’ అనే ప్రొటీన్‌ (GAS6 Protein) జుట్టు పెరుగుదలను ప్రొత్సహించి, బట్టతలపై వెంట్రుకల పునరుత్పత్తికి (Harvard study on hair-growth protein promises sure fix) సహాయపడుతుందని, బట్టతలకు శాశ్వత పరిష్కారం చూపగలుగుతుందని పేర్కొంది.

LED device for baldness (Photo Credits: Pixabay)

తలపై నిండుగా కనిపించే ఒత్తైన జుట్టు మగవాళ్లకు చాలా అందం. అయితే చాలామందికి బట్టతల అనేది తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తూ ఉంటుంది. ఇక వయసులో ఉన్నప్పుడే బట్టతల వస్తే జాబ్‌ ఇంటర్వ్యూలు, పెళ్లి సంబంధాల లాంటి విషయాల్లో వీరికి ఇబ్బందులు మరీ ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే చాలామంది డిప్రెషన్ లోకి కూడా వెళుతుంటారు. అయితే ఇది ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై పరిశోధకులు తమ పరిశోధనలను ముమ్మరం చేశారు.

వీరి పరిశోధనల్లో శరీరంలో కార్టిజాల్‌ హార్మోన్‌ (స్ట్రెస్‌ హార్మోన్‌) పెరుగడం వల్ల తలలోని మాడు భాగానికి, వెంట్రుకల కుదుళ్లకు చెప్పలేని నష్టం కలుగుతుందని తేలింది. మగవాళ్లలో మాత్రమేకాకుండా, స్త్రీలలో కూడా ఒత్తిడి హార్మోన్ బట్టతలకు (Permanent cure to baldness on the way) కారణమౌతుంది. ఆందోళన, కోపం, యాంగ్జైటీ వంటి స్ట్రెస్‌ సంబంధిత ప్రతిచర్యలు బట్టతలకి కారణమౌతాయని పరిశోధకులు ఇప్పటికే స్పష్టం చేశారు. తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు సరికొత్త విషయాన్ని కనుగొన్నారు.

తలనొప్పికి తక్షణం ఉపశమనం కలిగించే చిట్కాలు, మీరు తాత్కాలిక తలనొప్పితో బాధపడుతున్నట్లయితే వీటిని ఆచరించి చూడమంటున్న నిపుణులు

నేచర్ మ్యాగజైన్‌లో తాజాగా ప్రచురించిన కథనం ప్రకారం.. ‘GAS6’ అనే ప్రొటీన్‌ (GAS6 Protein) జుట్టు పెరుగుదలను ప్రొత్సహించి, బట్టతలపై వెంట్రుకల పునరుత్పత్తికి (Harvard study on hair-growth protein promises sure fix) సహాయపడుతుందని, బట్టతలకు శాశ్వత పరిష్కారం చూపగలుగుతుందని పేర్కొంది. జుట్టు ఊడిన ప్రదేశంలో కుదుళ్ల నుంచి కొత్త వెంట్రుకలు తిరిగి పెరగడానికి ఈ ప్రోటీన్ సహాయపడుతుందని చెబుతున్నారు. ఎలుకల్లో అడ్రినల్ గ్రంథులను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం ద్వారా మూడు రెట్లు ఎక్కువగా వెంట్రుకలు పెరిగినట్లు వీరి పరిశోధనల్లో తేలింది. మూత్రపిండాల పైన ఉండే అడ్రినల్ గ్రంథులు కార్టిసాల్‌కు సమానమైన కార్టికోస్టెరాన్ అనే ఒత్తిడి హార్మోన్‌ను విడుదల చేస్తాయి.

ఈ ఒత్తిడి హార్మోన్ ఎలుకల్లో పెరుగుదలను అణిచివేశాయని, ఈ హర్మోన్‌ను నియంత్రిస్తే హెయిర్‌ ఫోలిసిల్‌ స్టెమ్‌ సెల్‌ (హెచ్‌ఎఫ్‌సీ) యాక్టివేట్‌ అయ్యి కొత్త జుట్టు పెరగడానికి కారణమౌతుందని నివేదికలో తెల్పింది. దీంతో మొదటిసారిగా జుట్టు రాలడానికి గల కారణాలను శాస్త్రీయ ఆధారాలతో గుర్తించి, దానిని ఎలా తిప్పికొట్టాలో కూడా ఈ అధ్యయనాలు తెల్పాయి. బట్టతల వ్యక్తుల్లో స్థబ్దంగా విశ్రాంతి స్థితిలో ఉండే హెయిర్ ఫోలికల్ మూలకణాలను ప్రోత్సహించడానికి GAS6 ప్రొటీన్‌ ఉపయోగపడుతుంది. ఎలుకల్లో ఈ ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ మనుషుల్లో దీని పనితీరుపై మరిన్ని అధ్యయనాలు చేయాల్సిఉందని పరిశోధన బృంధం తెల్పింది. వీరి ప్రయోగాలు ఫలిస్తే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి బట్టతల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పవచ్చు.

గొంతు నొప్పి, నోటి దుర్వాసన, దగ్గు, నోటిలో పుండ్లు వేధిస్తున్నాయా, ఇంటిలోనే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వీటిని తరిమికొట్టవచ్చు, నిపుణులు చెబుతున్నవేంటో ఓ సారి చూద్దాం

అధ్యయన రచయితలలో ఎక్కువ మంది హార్వర్డ్ స్టెమ్ సెల్ ఇన్స్టిట్యూట్, కేంబ్రిడ్జ్ (MA-USA) నుండి వచ్చినవారయితే కొందరు డెర్మటాలజీ విభాగం, మౌంట్ సినాయ్, న్యూయార్క్, NY, USAలోని ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ - మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ I. , యూనివర్సిటీ హాస్పిటల్ వుర్జ్‌బర్గ్, వర్జ్‌బర్గ్, జర్మనీ, లేదా మనోరోగచికిత్స విభాగం, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, హార్వర్డ్ మెడికల్ స్కూల్, బోస్టన్, MA, USA, నుంచి వచ్చారు.

ఈ శాస్త్రవేత్తలు జుట్టు పెరుగుదలకు ఆజ్యం పోసే ప్రొటీన్‌ను కనుగొన్న తర్వాత బట్టతల నివారణకు ఆస్కారం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు - GAS6 అనే ప్రోటీన్ జుట్టు రాలడాన్ని ఆపి, కొత్త జుట్టు పునరుత్పత్తికి సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడం సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుందని తెలిపారు.