Herbert Kleber Google Doodle: వ్యసనం అనేది జీవితంలో పరాజయం కానే కాదు, అదొక మానసిక స్థితి అంతే, ప్రముఖ మానసిక వైద్యులు హెర్బర్ట్‌పై గూగుల్ ప్రత్యేక డూడుల్, ఓ సారి ఆ మహనీయునిని స్మరించుకుందాం
ఆ రోజుకున్న ప్రాముఖ్యతను వివరించేలా చిన్న కార్టూన్ రూపంలో అది దర్శనమిస్తుంది. ఈ రోజు చరిత్రలో ఎవరైతే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి ఉంటారో వారి ఫోటోను) గూగుల్ తన డూడుల్ గా పెట్టి అందరికీ గుర్తు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ రోజు కూడా ఓ ప్రముఖ వ్యక్తి ఫోటోతో గూగుల్ డూడుల్ ను రూపొందించింది.
October 1: గూగుల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే లోగోపై డూడుల్ కనిపిస్తుంది. ఆ రోజుకున్న ప్రాముఖ్యతను వివరించేలా చిన్న కార్టూన్ రూపంలో అది దర్శనమిస్తుంది. ఈ రోజు చరిత్రలో ఎవరైతే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి ఉంటారో వారి ఫోటోను) గూగుల్ తన డూడుల్ గా పెట్టి అందరికీ గుర్తు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ రోజు కూడా ఓ ప్రముఖ వ్యక్తి ఫోటోతో గూగుల్ డూడుల్ ను రూపొందించింది. ఆయన ప్రముఖ అమెరికన్ సైక్రియాటిస్ట్ (American psychiatrist)డాక్టర్ హెర్బర్ట్ డేవిడ్ క్లెబెర్(Herbert Kleber). సైకాలజీ (psychology)మీద ఆయన చేసిన సేవలకు గానూ గూగుల్ ఈ రోజు ఆయన్ని స్మరించుకుంటూ గూగుల్ డూడుల్(Google Doodle)ని రూపొందించింది. నేషనల్ అకాడమి ఆఫ్ మెడిసన్ 23వ వార్షికోత్సవానికి ఆయన ఎన్నికైన సంధర్భాన్ని పురస్కరించుకుని గూగుల్ ఆయన్ని స్మరించుకుంది. హెర్బర్ట్ 1934వ సంవత్సరం జూన్ 19వ తేదీన పెనిసెల్వేనియాలోని పిట్స్‌బర్గ్(Pittsburgh, Pennsylvania)లో జన్మించారు, డర్ట్మౌట్ కాలేజీలో తన కళాశాల విద్యను పూర్తి చేశారు. గూగుల్ డూడుల్ లో కనిపిస్తున్న ఫోటో పేషంట్ ఏదో చెబుతుంటే హెర్బర్ట్ ధీర్ఘంగా వింటున్నట్లుగా ఉంది. దీనికి కారణం చదువురాని వారికి కూడా హెర్బర్ చేసిన వైద్యం వారి జీవితాల్లో ఎంతో వెలుగును నింపింది అని చెప్పడమే. ఆయన గురించి ప్రపంచంలో చాలామందికి తెలిసినా కొన్ని విషయాలు చాలామందికి తెలియవు. అవేంటో ఓ సారి చూద్దాం.
హెర్బర్ట్ డేవిడ్ ప్రముఖ అమెరికన్ సైక్రియాటిస్ట్, ఈయన ఎన్నో పరిశోధనలు చేశారు.
నేషనల్ అకాడమి ఆఫ్ మెడిసన్ 23వ వార్షికోత్సవానికి ఆయన ఎన్నికైన సంధర్భాన్ని పురస్కరించుకుని గూగుల్ ఆయన్ని స్మరించుకుంది.
ఈ డాక్టర్ వ్యసనాన్ని జీవితంతో పరాజయంగా ఎప్పుడూ భావించలేదు, అదొక మానసిక స్థితిగానే భావించాడు.
నాటి అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ హెచ్ డబ్ల్యు బుష్ హెర్బర్డ్ కి ఎనలేని గౌరవాన్ని ఇచ్చారు. నేషనల్ డ్రగ్ కంట్రోల్ సొసైటికీ డిప్యూటీ డైరక్టర్ గా నియమించారు.
National Center on Addiction and Substance Abuseకి కో ఫౌండర్ గా కూడా వ్యవహరించారు. అక్కడ మానసిక పరిస్థితి మీద తన ప్రయోగాలను నిర్వహించారు. వ్యసనమనేది జీవితంలో ఫెయిల్యూర్ కాదని దాన్ని వ్యతిరేకిస్తూ పేషంట్లలో మనో స్థైర్యాన్ని నింపారు.
తన 84 ఏళ్ల జీవితంలో ఎక్కువ భాగం పేషంట్లతోనే గడిపి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. అక్టోబర్ 5 2018న ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అక్టోబర్ 5న ఆయన తొలి వర్థంతి సంధర్భంగా గూగుల్ ప్ర్యతేక డూడుల్ ని రూపొందించనుంది.