Garlic Milk Benefits: చలికాలంలో జలుబును తరిమికొట్టాలంటే వెల్లుల్లి పాలు తాగాల్సిందే, గార్లిక్ మిల్క్ తయారీ విదానం, వెల్లుల్లి ఉపయోగాలు ఓ సారి చూద్దాం

పిల్లలు, పెద్దలు అందరినీ ఈ జలుబు పీడిస్తూ ఉంటుంది. అయితే దీని నుంచి తక్షణం ఉపశమనం పొందడానికి వెల్లుల్లి పాలు (Garlic Milk Benefits) ఔషధంగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

Garlic (Photo Credits: Wikimedia Commons)

రానున్నది చలికాలం..ఈ కాలంలో జలుబు దగ్గు చాలామందిని వేధిస్తూ ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరినీ ఈ జలుబు పీడిస్తూ ఉంటుంది. అయితే దీని నుంచి తక్షణం ఉపశమనం పొందడానికి వెల్లుల్లి పాలు (Garlic Milk Benefits) ఔషధంగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.ఛాతిలోని శ్లేష్మాన్ని కరిగించి, తొలగించేందుకు ఈ పాలు బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. ఈ వెల్లుల్లి పాలను ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు అంటే.. రాత్రి భోజనం చేసిన గంట తర్వాత ఈ పాలు తాగితే (Drinking Garlic Milk) అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. పాలు తాగిన తర్వాత మరేమీ తినవద్దని వైద్యులు చెబుతున్నారు.

అయితే ఈ వెల్లుల్లి పాలను పిల్లలకు ఇస్తే వెల్లుల్లి పరిమాణాన్ని తగ్గించాలి. పిల్లలకు వారానికి రెండు సార్లు ఇస్తే సరిపోతుంది. పెద్దలు ఈ వెల్లుల్లి పాలను వరుసగా 21 రోజులు తాగితే ఛాతీ శ్లేష్మం తొలగించి శ్లేష్మం పూర్తిగా తొలగిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

వెల్లుల్లి పాలు తయారు చేయడం ఎలా:

ముందుగా 200 మిలీ ఆవు పాలు కాని గేదె తీసుకోండి. ఈ పాలలో అర గ్లాసు నీరు కలపండి. అనంతరం 7 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి పాలలో వేసి ఉడికించాలి. వెల్లుల్లి రెబ్బలు ఉడికిన తర్వాత దాన్ని తీసి పావు టీస్పూన్ పసుపు, పావు టీస్పూన్ మిరియాలపొడి వేసి కలపాలి. తర్వాత తగినంత పంచదార కలుపుకుని తాగండి

ఒమిక్రాన్ శరీరంలోకి ప్రవేశిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఈ కొత్త కోవిడ్ వేరియంట్‌‌పై డాక్టర్లు ఏమి చెబుతున్నారు, ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్‌ (బీ.1.1.529) పై ప్రత్యేక కథనం

సాదారణంగా వెల్లుల్లి (Health Benefits of Garlic) జ్వరం, దగ్గు, తలనొప్పి, కడుపు నొప్పి, సైనస్ సమస్యలు, కీళ్ళనొప్పి, ఉబ్బసం, శ్వాస సమస్య, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తంలో అధిక చక్కెర స్థాయిలు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లి, ఒత్తిడి, అలసటలను తగ్గించటమేకాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గర్భిణుల ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుతుంది. బాలింతలకు పాలు బాగా పడేలా చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా, వెల్లుల్లి నుంచి విడుదలయ్యే అల్లిసిన్, వివిధ వ్యాధులను తగ్గించే శక్తిని కలిగి ఉంటుంది. శరీరంలోని కొవ్వును కరిగించే శక్తి వెల్లులికి ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.

ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒమిక్రాన్ కరోనా వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచదేశాలు, మళ్లీ మాస్కులు ధరించాలని సూచన

వీలైనంతవరకు ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. అదేవిధంగా జుట్టురాలే సమస్య ఉంటే వెల్లుల్లిని గ్రైండ్ చేసుకుని తలకు పట్టిస్తే జుట్టు రాలే సమస్య నుండి విముక్తి కలుగుతుంది. రక్తంలో చక్కెర శాతాన్ని వెల్లుల్లి క్రమబద్ధీకరిస్తుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకోవటం వల్ల జీర్ణాశయ సమర్థతను పెంచుతుంది. చర్మంపై ఉండే పుండ్లపై రుద్దితే ఉపశమనం కలుగుతుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీ-బయాటిక్‌గా పేర్కొనవచ్చు. వెల్లుల్లిను వాడటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, గుండె వ్యాధులను తగ్గించి, కాలేయ, మూత్రాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. విరేచనాలు ఇతర జీర్ణాశయ సమస్యలను నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.