Jowar Roti Health Benefits: జొన్న రొట్టెలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, మధుమేహ వ్యాధి గ్రస్తులు తప్పక తీసుకోవాల్సిన ఆహారం, దీని ప్రయోజనాలు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు

ఒకప్పుడు పేదలు ఎంతో ఇష్టంగా తినే ఆహారం. వరి అన్నం పాపులర్ అయ్యాక అందరూ జొన్నల వినియోగం తగ్గించారు. అయితే ఈ మధ్య జొన్న అందరి ఆహారం అయింది. రోడ్డు పక్క కట్టెల పొయ్యిపై తయారు చేసే ఈ రొట్టెలను (jowar ki roti) చాలామంది లొట్టలు వేసుకుని తింటున్నారు. తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ చాలా ఇళ్లల్లో ఆహారంగా తీసుకునేది జొన్న రొట్టెనే అంటే అతిశయోక్తి కాదు.

Jowar Roti (Photo Credits: Instagram / Chaspan)

జొన్న రొట్టె.. ఒకప్పుడు పేదలు ఎంతో ఇష్టంగా తినే ఆహారం. వరి అన్నం పాపులర్ అయ్యాక అందరూ జొన్నల వినియోగం తగ్గించారు. అయితే ఈ మధ్య జొన్న అందరి ఆహారం అయింది. రోడ్డు పక్క కట్టెల పొయ్యిపై తయారు చేసే ఈ రొట్టెలను (jowar ki roti) చాలామంది లొట్టలు వేసుకుని తింటున్నారు. తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ చాలా ఇళ్లల్లో ఆహారంగా తీసుకునేది జొన్న రొట్టెనే అంటే అతిశయోక్తి కాదు. ఇందులో బీ కాంప్లెక్స్‌ విటమిన్స్‌కు తోడు ఫైబర్‌, విటమిన్‌ ఏ, విటమిన్‌ సీ, క్రూడ్‌ ఫ్యాట్‌, అమినో యాసిడ్స్‌ ఇలా అత్యవసర పోషకాలు (Jowar Roti Health Benefits) అధికంగా ఉన్నాయి.

మధుమేహులకు ఇది చక్కటి భోజనం అని కూడా చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఇపుడు ఏ గల్లీ చూసినా తోపుడు బండ్లు, వాటి మీద కట్టెల పొయ్యి (కొన్నిచోట్ల గ్యాస్‌ కూడా ఉపయోగిస్తున్నారు), రెండు చేతుల నడుమ పిండి ముద్ద ఉంచి అందంగా రొట్టెలను చేస్తోన్న మహిళలు హైదరాబాద్ నగరంలో విరివిగా కనబడుతున్నారు. ఇక చపాతీ, రోటీ ఏదైనా తక్కువ కాలంలోనే తినేయాలి. లేదంటే అవి పాడైపోయే అవకాశాలున్నాయి. అయితే జొన్నరొట్టెకు ఆ ఇబ్బంది లేదు. కాస్త ఆలస్యమైనా దీనిని ఇబ్బంది లేకుండా తినేయొచ్చు.

జామపండుతో అనేక వ్యాధులు దూరం, రోజుకు ఒక్క జామ కాయ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఓ సారి చూద్దాం

జొన్నరొట్టెలో ఉన్న రెండు రకాలలో ఒకటి కడక్‌ రోటీ. ఇది గట్టిగా ఉంటుంది. మరోటి సాఫ్ట్‌రోటీ మెత్తగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే దీనిని తినేయాలి. కానీ కడక్‌ రోటీ అలా కాదు. కొన్ని వారాలైనా పాడయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీనిని సంప్రదాయ పద్ధతులలో నిల్వ చేస్తే వీటి జీవితకాలం మరింత పెరుగుతుంది. మన నగరంలో జొన్న రొట్టెను వెజిటేబుల్‌ కర్రీ లేదంటే చికెన్‌ కర్రీ లాంటి వాటితో కలిపి తీసుకుంటుంటారు. కొంతమంది పచ్చడితో కలిపి కూడా తింటుంటారు.

పోషకాలు సమృద్ధిగా కలిగిన ఆహారంగా జోవార్‌ ను చెబుతారు. గ్లూటెన్‌ లేకపోవడం. దీనిలో కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ ఉండటం వల్ల మధుమేహులకు చక్కటి అవకాశంగా నిలిచింది. ఇది నెమ్మదిగా గ్లూకోజ్‌ను విడుదల చేస్తుంది. శాఖాహారులకు ఇది అత్యుత్తమ ఆహారంగా పనిచేస్తుంది. 100 గ్రాముల జొవార్‌లో 10.4 గ్రాముల ప్రోటీన్‌ ఉంటుంది. మన శరీరానికి ప్రతిరోజూ అవసరమైన ఫైబర్‌లో 40శాతం ఇది అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) తగ్గించడంలో సహాయపడటంతోపాటుగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

గొంతు నొప్పి, నోటి దుర్వాసన, దగ్గు, నోటిలో పుండ్లు వేధిస్తున్నాయా, ఇంటిలోనే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వీటిని తరిమికొట్టవచ్చు, నిపుణులు చెబుతున్నవేంటో ఓ సారి చూద్దాం

గ్లూటెన్‌ పదార్థాల ఎలర్జీ ఉన్న వారితో పాటుగా ఉదరకుహర వ్యాధి (సెలియాక్‌ డిసెజస్‌) ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. జొన్నలలో ఐరన్‌, కాల్షియం, విటమిన్‌ బి, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటివి ఉన్నాయి. దీనివల్ల చర్మం, జుట్టు, గుండె, ఎముకల ఆరోగ్యానికి కూడా ఇవి దోహదపడతాయి. జీర్ణక్రియనూ మెరగుపరుస్తుంది. జొన్నలను రోటీ రూపంలో మాత్రమే కాదు ఇడ్లీ, దోశ రూపంలో తినొచ్చు. ఊబకాయులు బరువు తగ్గేందుకు కూడా ఇది చక్కటి ఎంపికగా నిపుణులు చెబుతున్నారు.