Health Tips: ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ హోమ్ రెమెడీస్ తో సమస్యకు పరిష్కారం..

ఈ సీజన్లో కీళ్ల నొప్పులు ఎముకల నొప్పులు కండరాల నొప్పుల సమస్య ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది.

source: pixabay

చలికాలంలో  ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఈ సీజన్లో కీళ్ల నొప్పులు ఎముకల నొప్పులు కండరాల నొప్పుల సమస్య ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమస్య వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. సరైన జాగ్రత్తలు తీసుకొని కొన్ని హోమ్ రెమెడీస్ పాటించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

లక్షణాలు- ఆర్థరైటిస్ సమస్య ప్రారంభ దశలో కాళ్లలో వాపు కండరాల్లో కొద్దిగా నొప్పి ఎముకలలో నొప్పి కొంచెం ఒత్తిడి కదిలింపు కాలు కదిలించేటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. సమస్య వస్తుందని తెలవడానికి మనకు కీళ్లలో నొప్పులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువగా ఉంటుంది. ఎంత విశ్రాంతి తీసుకున్న సరే ఈ కీళ్ల నొప్పులు తగ్గకపోతే ఇది ఆర్థరైటిస్  లక్షణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా కీళ్లలో వాపు ముఖ్యంగా జాయింట్లలో ఉబ్బడము, ఎర్రగా కొంచెం తిమ్మిరిగా అనిపించడం, కూడా ఆర్థరైటిస్ లక్షణాలు.ముఖ్యంగా కీళ్ల నొప్పుల కారణంగా శరీరంలో అలసట బలహీనత వంటి సమస్యలు ఏర్పడతాయి. దీన్ని రుమాటాయిడ్ ఆర్థరైటిస్ గా చెప్పవచ్చు.

Health Tips: చక్కెరను అతిగా వాడుతున్నారా,

ఎందువల్ల వస్తుంది- ఆర్థరైటిస్ అనేది ముఖ్యంగా విటమిన్ లోపాల వల్ల ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా విటమిన్ సి ,విటమిన్-డి ,క్యాల్షియం లోపం వల్ల ఇది ఎక్కువగా ఇబ్బంది గురిచేస్తుంది.మన శరీరంలో క్యాల్షియం విటమిన్-డి విటమిన్ సి తక్కువగా ఉన్నప్పుడు ఎముకలు బలహీనంగా మారుతాయి. లోపటం బోలుగా మారుతాయి. ఇది కీళ్ల మధ్యన ఘర్షణ పెరగడం మా ప్రారంభమవుతుంది. దీని ద్వారా మోకాళ్లలో ఎముకలలో కీళ్ల కదలికల్లో వాపు నొప్పి వంటివి ఏర్పడతాయి. ఇది ఆర్థరైటిస్ కి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీనితో పాటు రోగనిరోధక వ్యవస్థ కూడా బలహీనపడుతుంది.

తగ్గించుకునే విధానం.

పసుపు- పసుపులో కర్ఫ్యూమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది ఇన్ఫర్మేషన్ తగ్గిస్తుంది. ఆథరైటిస్ నొప్పిని వాపును తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలలో అర టీ స్పూన్ పసుపు కలిపి ప్రతి రోజు తీసుకున్నట్లయితే ఆర్థరైటి సమస్యను తగ్గించుకోవచ్చు.

ఆముదం నూనె- ఆముదం నూనె కూడా ఆథరైటిస్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. పడుకునే ముందు రాత్రి గోరువెచ్చటి ఆముదం నూనెను ఒక టీ స్పూన్ తీసుకొని కాళ్లకు మర్దన చేసుకుని కీళ్లకు మసాజ్ చేసుకున్నట్లయితే   ఆర్థరైటిస్ సమస్యను తగ్గించుకోవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి